Skip to main content

Posts

Showing posts with the label తెలుగు

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

పద్యాలతో కుస్తీ

పదో తరగతి చదివేటప్పుడు తెలుగు టీచర్ అనంతాచార్యుల వారు చందస్సు నేర్పించారు. ఆ సందర్భంగా  ఆటవెలది పద్యాన్ని బోధిస్తూ, ఒక పద్య పాదాన్ని ఇచ్చి పూరించమని చెప్పారు. అది... 'ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు' చందస్సు నేర్చుకున్న ఆనందంతో సమధికోత్సాహంతో ఇలా పూరించాను.  ఆ. వె. ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు పాడునపుడు మనము పరవశించి  మేను పులకరించి మేఘ మధ్యంబునం దాటలాడుచున్న యట్లు దోచు తర్వాత ఇంగ్లీషు మీడియం చదువు, సాంకేతిక విద్య కావడంవల్ల పద్యాల గురించి పూర్తిగా మరిచే పోయాను. మళ్ళీ ఇలా బ్లాగులోకం లోకి వచ్చిన తర్వాతనే పద్యాలు రాయడానికి ప్రయత్నం చేశాను. చింతా రామకృష్ణా రావుగారి ఆశీర్వచనం, ఆచార్య ఫణీంద్ర గారి వద్ద శిష్యరికం, కండి శంకరయ్య గారి ప్రోత్సాహం లేకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ పద్యం రాసి ఉండే వాడిని కాదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగా వివిధ బ్లాగులలో నేను వ్రాసిన కొన్ని పద్యాలు. ఆ. వె. ఆశ లేని బ్రతుకు అడవిలో వెన్నెల ఆశ యందె కలుగు ఆశయములు ఆశ యుండు టెల్ల అత్యాశ కాబోదు ఆశ లోనె కలదు దేశ భవిత చం. సరుకులు కొందమన్న మరి చాలవు జీతపు డబ్బు లేటికిన్ తిరుగుద మన్న రోడ్...

సంయమనం

గత నెల రోజులుగా ఆంధ్రాలో, తెలంగాణాలో జరుగుతున్న ఉద్యమాలలో ఒక పదం మరీ మరీ వినిపించింది. ఈ పదాన్ని పలకడానికి అటు టీవీ యాంకర్లు, ఇటు రాజకీయ వాదులు, మరోవంక పోలీసులు విపరీతంగా శ్రమించారు. అదేదో గొప్ప చాలా పెద్ద పదం అనుకుంటే పొరపాటే. ఆ పదమే 'సంయమనం'. దీన్ని ఎన్ని రకాలుగా పలికారో చూద్దాం. సయ్యమనం సైమయనం సమ్మయనం సమయమనం సైమానం ... ఒక పదాన్ని ఇన్ని రకాలుగా పలుకు తున్నారంటే దాంట్లో క్లిష్టత ఉండ బట్టే కదా? హిందీ వాడు కూడా ఈ సంస్కృత పదాన్ని संयम ( తెలుగు లో పలికితే 'సయ్యం' అవుతుంది) గా మార్చి చేతులు దులిపేసు కున్నాడు. మనకు మాత్రం అంత కష్టమైన పదం ఎందుకూ అని? ఇదే కాదు ఇలాంటి నోరు తిరగని పదాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటి వలన ఉచ్చారణా దోషాలు ఎలాగూ తప్పవు, సంభాషణా వేగం, స్పష్టత కూడా లోపిస్తుంది. దురదృష్టమేమో కాని మనం మాత్రం కష్టమైన పదాలని సరళీకరించు కోవడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయం. రచయితలు, పండితులు, పత్రికల వారు (ఈ మధ్య అందరి కన్నా ఎక్కువగా భాష మీద ప్రయోగాలు చేస్తున్నది వీరే!) కష్ట మైన పదాలకు సరళమైన రూపాంతరాలను తయారు చేసి వాడ వలసిందిగా నా కోరిక. వీరు వదిలేస్తే ఆ పని టీవీ యాంకర్లు ఎలాగూ...

తెలుగు భాష, పదజాలం

తెలుగు భాషలో ఇంగ్లీషు పదాలు ఉండాలా ఒద్దా అనే విషయం మీద ఇటీవల తర్కాలు బాగా జరుగుతున్నాయి. దీంట్లో కొంతమంది తెలుగు భాష లో ఇంగ్లీషు పదాలు కలపాలని, కొంత మంది కొత్త పదాలు తయారు చేయాలని అంటున్నారు. రైలు, బస్సు, కారు, కరెంటు లాంటి పదాలు ఎంతగా వాడుకలోకి వచ్చాయంటే వాటికి బదులు వేరొక సులభమైన తెలుగు పదం తయారు చేసైనా సరే, వాడుకలోకి తేవడం అంత సులభమైన విషయం కాదు. అలా అని ఇంగ్లీషు పదాలను తెలుగు లోకి దిగుమతి చేస్తూ పోతుంటే, చివరికి తెలుగులో తెలుగే మిగలకుండా పోయే ప్రమాదం ఉంది. తాడేపల్లి గారు ఇక్కడ చెప్పినట్టుగా ఇంగ్లీషు పదాల్ని అరువు తెచ్చుకున్నా కూడా ఆ పదాల్ని పునర్నిర్మితం చేసి మరిన్ని కొత్త పదాలను తయారు చేసుకోలేక పోతున్నాం. ఇక తెలుగు పదాల్ని సృష్టించ డానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వారంతా ఎంతో అభినంద నీయులే అయినప్పటికీ, ఈ పదాలకు ఒక దిశా నిర్దేశం లేదేమో అనిపిస్తుంది. ఎవరికీ వారే ఏదో కొన్ని పద బంధాలని కలిపి, లేదా అచ్చులను, హల్లులను కలిపి ఒక శబ్దాన్ని తయారు చేసి, పదాలను పుట్టిస్తున్నారు. అయితే కొంతమంది మేధావులు శాస్త్రీయంగా సంస్కృత పద బంధాలను, ధాతువులను, వ్యాకరణాన్ని ఆకళింపు చేసుకొని పదా...