Skip to main content

Posts

Showing posts with the label సరదాకి

తిరుపతి లడ్డూలో బోల్టు వస్తే...

తిరుపతి లడ్డూలో బోల్టు రావడం ఈ నెలలో అప్పుడే రెండోసారి. యధాప్రకారం టీవీలో పదేపదే అదేపనిగా చూపిస్తూ చర్చలు, అభిప్రాయాలు. TTD వారిమీద భక్తుల ఆరోపణలు. తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తులకు సరిపడా లడ్డూలు తయారు చేయడం యంత్రాల సహాయం లేకుండా సాధ్యమయ్యే పని కాదు. ఇలా వాడుతున్న యంత్రాలు ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తున్నప్పుడు చిన్నచిన్న విడిభాగాలు ఊడిపడడం కూడా అంతే సహజం. బహుళజాతి కంపెనీలు వ్యాపారం కోసం నడిపే కూల్ డ్రింకుల లోనే బొద్దింకలు వస్తున్నాయి. TTD వారి లడ్డూ తయారీ వ్యాపార దక్షతతో నడుప బడుతున్న కంపెనీ కాదు. పైగా దీనిపై వారు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అలాగని ఇలాంటి పొరపాట్లు లేకుండా చేయడం అసాధ్యమనీ కాదు. కానీ దానికి అత్యాధునికమైన యంత్రాల వాడకం, వాటికి నియమిత కాల పరిశీలన, దిద్దుబాట్లు చేయాలి. ప్రతి లడ్డూను తయారీ అనంతర పర్యవేక్షణకు గురిచేయాలి. తయారయిన లడ్డూలను సంచీలలో కట్టి బ్యాచునంబర్లను ముద్రించాలి. ఇంత చేసినా కూడా ఏమైనా పొరపాట్లు దొర్లితే బ్యాచునంబరు ఆధారంగా సంబంధిత తయారీదార్లను శిక్షించాలి. ఇంత పద్ధతిగా చేయాలంటే పెట్టుబడి, అధిక సిబ్బంది అవసరమౌతుంది. ఇవన్నీ చేసినప్...

లెఫ్టా రైటా?

పై కార్టూన్ ప్రముఖ Free Software Activist, మరియు Free Software Foundation సృష్టికర్త అయిన రిచర్డ్ స్టాల్మన్  వేసినది. కుడి వైపు రాళ్ళున్నా కూడా మరింత కుడికి పడవ నడపమని క్యాపిటలిస్టు ఎకానమిస్టులు ఉద్భోదించే విధానం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చెప్పబడింది. నది ఒక ఆర్ధిక వ్యవస్థ అనుకుంటే దానికి వామపక్షంలో (ఎడమవైపు) ఇసుక తిన్నెలు, దక్షిణపక్షంలో (కుడివైపు) బండరాళ్ళున్నాయి.  నావ పూర్తి ఎడమకి వెళ్ళితే ఇసుకలో చిక్కుకొని ముందుకెళ్ళడం కష్టం. అలాగే పూర్తిగా కుడివైపు వెళ్ళితే రాళ్ళకు గుద్దుకొని మొత్తానికే పగిలి, మునిగి పోతుంది. వామపక్షం వారు నావ (ఆర్ధిక వ్యవస్థ) పూర్తిగా ఎడమ వైపు నడపాలని, అలాగే క్యాపిటలిస్టులు నావను పూర్తిగా కుడి వైపు నడపాలని చెప్పడం ఈ కార్టూను చూసినప్పుడు అంతర్లీనంగా స్పురిస్తుంది. అలాగే మనలాంటి మూడవ ప్రపంచ దేశాలు మునిగి పోతాయన్నా పట్టించు కోకుండా అమెరికా, వరల్డ్ బ్యాంకు ఎలా మనని ఆపదల వైపు ఉసిగొల్పుతాయో వివరిస్తుంది ఈ కార్టూను. స్టాల్మన్ వేసిన మరిన్ని కార్టూన్లు ఇక్కడ  చూడొచ్చు.

సాయి బాబానా, దేవుడా?

యధాలాపంగా చానెళ్ళు తిరగేస్తుంటే ABN/ఆంధ్రజ్యోతి లో ఒక వింత చర్చ కనిపించింది. 'అందరి వాడేనా' అనే టైటిల్ తో ఒక సాయి బాబా భక్తుడు గారు, ఒక శాస్త్రులు గారిని కూర్చో బెట్టి యాంకరు వీర లెవెల్లో తతంగం నడిపిస్తున్నాడు. నేను మధ్యలో జాయినైనానేమో ముందేమీ అర్థం కాలేదు. చివరకి అర్థమైన సారాంశం ఇదీ. గుంటూరు జిల్లాకి చెందినా ఒక డాక్టరు గారు 'షిర్డీ సాయిబాబా అసలు హిందూ దేవుడే కాదు' అంటూ వాదం లేవ దీస్తూ ఒక పుస్తకం రాశాడట. దాంట్లో సాయిబాబా అసలు హిందువే కాదని, నిరంతరం 'అల్లా మాలిక్' అనుకుంటూ తిరిగిన వాడిని హిందువు లెందుకు పూజించాలని ఆయన ప్రశ్నలు లేవ దీశాడు. సనాతన ధర్మం రోజు రోజుకీ అటకెక్కి, జనం సాయి జపంలో మునిగి తేలుతున్న ఈ తరుణంలో కక్కా లేక మింగా లేక గుర్రుగా వున్న సనాతన వాదులకు దీంతో కొంత బలం చేకూరినట్టే కనిపిస్తుంది. అందుకే కాబోలు, శాస్త్రులు గారు వీర లెవెల్లో వాదన వినిపిస్తున్నారు. ఎప్పుడూ నాస్తికులకు, అస్తిత్వ వాదులకు మధ్యన జరిగే వాదనలు విని విని విసుగెత్తిన తరుణంలో ఇదేదో కొత్తగా బాగానే ఉందని పించింది. వార్తల చానెల్సుకి కూడా కొత్త విషయం దొరికి నట్లుంది, రెండు వైపులా బాగానే...