ఈ మధ్య నేను కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగులో పూరించిన సమస్యలు. ఎరుపు వర్ణంలో చూపిన వరుస కంది శంకరయ్య గారిచే ఇవ్వబడిన సమస్యగా గుర్తించ గలరు. కం. మేలగు నాయకులెవ్వరు చాలక డబ్బది యొసగెడి సైతానైనా చాలను మన వోటరు పా పాలే సజ్జనుల నెల్ల బతితుల జేయున్! తే. గీ. చీమ పెరుగన్నమును తిని సేదదీరె నంత లోపుగా జరిగెను వింత యొకటి చీమ తుమ్మెను, బెదరెను సింహగణము అదిరిపడి నిద్ర మేల్కొనెనంత చీమ! తే. గీ. స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరి దేశమాతనే చేజార్చె దేహి యనుచు తిరిగి స్వాతంత్ర్యమును తెచ్చె ధీరజనులు స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె! తే. గీ. బియ్యమును కొంద మనుకున్న భయ్యమయ్యె కూరగాయల కొనుమాట నేరమయ్యె ఉల్లిపాయల ధరజూడ ఉట్టి పైన వచ్చె సంక్రాంతి లక్ష్మి యే మిచ్చె మనకు? ఆ. వె. కాలు ముడిచి పట్టి కాసారమున నిల్చు కొంగ కానుపించె కుంటివోలె కుక్క వెంటపడగ కొంగ పరుగులెత్తె కొంగ కైదు కాళ్ళు కోడికి వలె. ఆ. వె. మకరజ్యోతి గాంచ సౌకర్యములులేని శబరిమలకు వెడలి జనులు చావ పన్నువేయు ప్రభుత పనితీరు మారదు కస్తురి తిలకమ్ము గరళ మయ్యె! తే. గీ. వందకోట్ల జన...
జీవితంలో చీకటి, వెలుగు రెండూ ఉంటాయి. ఒకటే కావాలని కోరేవారికి రెండోది బోనస్‌గా వస్తుంది.