Skip to main content

Posts

Showing posts with the label నీరు

పోలవరం ప్రాజెక్టు

పోలవరం పై మళ్ళీ హడావుడి మొదలైంది. ఒక నాయకుడు పోలవరం అంటూ రక రకాల డ్రామాలాడి, ఇప్పుడు అధికారా పార్టీ నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అంటూ ఎదురు చూపులు చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకో నాయకుడు ఇన్నాళ్ళూ అధికార పార్టీ అందలం ఎక్కిస్తుందని వేచి చూచి, ఇక ఎదురు దాడి మాత్రమే శరణ్యమని తలచి అదే అదే పోలవరం డ్రామాను మరింతగా రక్తి కట్టించడానికి సిద్ధమౌతున్నాడు. భారత దేశంలోని ప్రాజెక్టులలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టులలో పోలవరం మొదటిదిగా నిలుస్తుంది. దీన్ని ఒకవైపు గిరిజన జాతులవారు వ్యతిరేకిస్తుంటే, రెండో వైపు పర్యావరణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా దీన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా కోర్టుకే వెళ్ళింది. CPI, TRS వంటి రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఒక ప్రాజెక్టును ఇంతమంది వ్యతిరేకించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల రెండువందలకు పైగా గ్రామాలు, రెండు లక్షలకు పైగా జనాభా నిర్వాసితులు అవుతున్నారు. వీరిలో సింహభాగం గిరిజనులు. 1,47,597 ఎకరాల భూమి నీటిలో మునిగి పోతుంది. ఇలా మునిగిపోయే భూమిలో ఎంతో ప్రకృతి సంపద, నల్లమల కొండల అందాలు కప్పబడి పోబోతున్నా...

ఎవరిదీ పాపం?

కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల్లో గత ఇరవై నాలుగ్గంటలుగా జరుగుతున్న దారుణ విలయం, అలాగే విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పొంచి వున్న ముప్పు కేవలం ప్రకృతి విలయం కాదనే విషయం హృదయాన్ని కలచి వేస్తుంది. ఈ పరిస్థితికి కారణం అహంకార పూరిత రాజకీయం, అధికారుల నిర్లక్ష్యం అని టీవీల్లో పేపర్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను. సుంకేసుల ఆనకట్ట నిండింది. అయినా గేట్లు తెరుచు కోకుండా మొరాయించాయి. ఫలితంగా మట్టికట్ట తెగిపోయి నీరు పొంగి పొర్లింది. ముందుగా కర్నూలు మునగడానికి ఇదే కారణం. వేసవి కాలం లో గేట్లకు సరియైన నిర్వహణ, పరిశీలన జరిపి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. శ్రీశైలం ప్రాజెక్టు పన్నెండవ గేటు ఇప్పటి వరకు తెరుచు కోలేదు. బాగా తుప్పు పట్టి తెరుచుకోక, ఒక ఉపకరణం విరిగి పొతే వెల్డింగు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదీ మన సన్నద్ధత. కొత్త ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించ డానికి ఉబలాట పడే ప్రభుత్వం పాత ప్రాజెక్టులు, చెరువుల మరమ్మత్తులకు పైసా విదిలించటం లేదని ఆరోపణ. నాగార్జున సాగర్ నీటిని నిలువ చేయడానికి ఉద్దేశించ బడింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని నిలువ చేయ డానికి రూపొ...