Skip to main content

Posts

Showing posts with the label సాంకేతికం

విర్చువల్ బాక్సులో ఉబంటు

ఆపరేటింగ్ సిస్టం అంటే ఎక్కువ మందికి విండోస్ మాత్రమే తెలుసు. ముఖ్యంగా మన దేశంలో విండోస్ తప్ప వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడే వారిని అరుదుగా చూస్తుంటాం. దాదాపుగా మనకు లభించే కంప్యూటర్లన్నీ (ఆపిల్ మాకింతోష్ తప్ప) అన్నీ విండోస్ ప్రీ ఇన్స్టాల్ చేసి లభిస్తుంటాయి. అసెంబుల్ మెషిన్లు వాడే వారు ఎలాగూ పైరేటెడ్ విండోస్ వాడే సావకాశం మన దేశంలో ఉంది. అందుకేనేమో మన దేశంలో విండోస్ తప్ప ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ జోలికి ఎవరూ వెళ్ళడం లేదు. అయితే ఓపెన్ సోర్సు రంగంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని గనుక పరికించినట్టయితే, లినక్సు విండోస్ ను త్రోసిరాజనే రోజు ఎంతో దూరంలో లేదు. సర్వర్ల రంగంలో నయితే ఇప్పటికే లినక్సు విండోస్ కన్నా ఎన్నోరెట్లు ముందంజలో ఉంది.   అయితే మనలో చాలామందికి లినక్సుని ప్రయత్నించాలనే కోరిక ఉన్నప్పటికీ రక రకాల కారణాల వల్ల వాయిదా వేస్తుంటాము. మన సిస్టం లో ఇప్పటికే విండోస్ లోడై ఉంది కాబట్టి, దాన్ని తీసి వేయలేము. ఇంకో పార్టిషన్ తయారు చేసుకొని వేయడానికి కావలసిన ఓపిక, తీరిక చాలామందికి ఉండదు.  ఇంకో పార్టిషన్ తయారు చేసే ప్రయత్నంలో ఉన్న విండోస్ కాస్తా డిలేట్ అయితే మొదటికే మోసం వచ్చి, ...