Skip to main content

Posts

Showing posts with the label మూఢనమ్మకాలు

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

దేవుడికి ఒంట్లో బాగోలేదట

దేవుడికి ఒంట్లో బాగోలేదట! దైవభక్తులారా, మీరంతా తలో దేవున్ని పూజించండి, ఈ దేవున్ని బ్రతికించమని కోరుతూ. దేవుడైన వాడికి మా పూజలతో పనేంటి అనుకుంటున్నారా? ఒద్దొద్దు, కొత్త దేవుళ్ళకు ప్రజల తోనే పని. ప్రజాదరణే వారి బలం. మీరు పూజలు చేయండి, ఇళ్ళల్లో భజనలు చేయండి, ఎప్పటి మాదిరిగానే. వీలయితే పక్కింటి వారిని కూడా కలుపుకోండి. మంత్రులారా, మీకు మీ కమీషన్ల వ్యవహారాల్లో క్షణం తీరిక ఉండదని తెలుసు. భోలక్ పూర్ లో మునిసిపాలిటీ నీళ్ళు తాగి కుక్క చావులు చచ్చినా, మన్యసీమలో విషజ్వరాలొచ్చి  వందల మంది చచ్చినా అక్కడికెళ్ళే మాట దేవుడెరుగు, కనీసం అరగంట సమీక్షా సమావేశం ఏర్పాటు చేసే సమయం కూడా మీకు దొరకదని నాకు ముందే తెలుసు. అయినా అడుగుతున్నాను. మీరు వెళ్లి వారాల తరబడి దేవుడి పాదాల చెంతే ఉండండి. ఆయన తిరిగి లేచి తిరిగే దాకా కదలొద్దు, వదలొద్దు. రాష్ట్రం ఏమై పోతుందో అని భయం అవసరం లేదు. నడుస్తూనే ఉంటుంది ముక్కుతూ మూలుగుతూ, మీరున్నప్పుడు ఎలాగో, లేకపోయినా అలాగే. దేవున్ని మాత్రం కంటికి రెప్పలా చూసుకొండి. ముఖ్యమంత్రిగారూ, మీరు మాత్రం ఎందుకు? రాష్ట్రంలో ఏం వుంది గనక చేయడానికి? వెంటనే వెళ్లి దేవుడి సంగతి చూడండి. ...

సాయిబాబా దివ్యజ్యోతి

మొన్నటికి మొన్న మకర జ్యోతి పుణ్యమా అని వంద మందికి పైగా తోక్కుకుని చావడం ఇంకా మరిచి పోనేలేదు. ఆ తర్వాత అది మానవ కల్పితం అని చెప్పి దేవస్థానం వారు కోర్టులో సాక్ష్యం ఇవ్వడం ఇంకా జ్ఞాపకాల నుండి మాసి పోనే లేదు. అప్పుడే ఇంకో కొత్త జ్యోతి కథ మొదలైంది. దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో దివ్యజ్యోతి కనిపించిందని వార్త. ఉత్తి వార్తే కాదు, వీడియో సాక్ష్యాలతో సహా టీవీలో వార్తా కథనాలు. భక్తులతో, హేతువాదులతో చర్చలు, SMS పోల్సు. విచిత్రమైన విషయ మేమిటంటే SMS poll లో 80 శాతం మంది నమ్ముతున్నామని చెప్పడం. వీడియో చూస్తే అదేదో కెమెరా లెన్సు మీద పడ్డ నీడలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రతిరోజూ ఫోటోలలో వీడియోలలో ఎదురుగా లైటు పడినపుడు ఇలాంటి నీడలు పడడం చూస్తూనే ఉంటాం. ఇది అలాంటి నీడెనేమో నని కనీసం అనుమానించ నక్కర లేదా? ఏది పడితే దాన్ని నమ్మేయటమే? ఇలా దేన్నీ బడితే దాన్ని నమ్మడమే భక్తి అనుకుంటే చేసేదేమీ లేదు. దేవున్ని సాక్షాత్కారించుకొని మాత్రమే నమ్మమని వివేకానందుడు ఎక్కడో చెప్పినట్టు గుర్తు. అంటే గుడ్డిగా ఏదీ నమ్మొద్దనేగా? జనం ఇలా ప్రతీ దాన్నీ నమ్మబట్టే మోసాలు కూడా అదే రేంజిలో జరుగుతున్నాయి. దోపిడీ బాబాలు ఊరిక...

ముఖ్యమంత్రి నివాసం, వాస్తు.

పొద్దున్నే వార్త. ముఖ్యమంత్రి గారు క్యాంపు ఆఫీసు లోకి మార బోతున్నారు. శుభం. కాని పూర్తిగా కాదట. నివాసం ఇప్పుడు అమీర్ పేటలో ఉన్న స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట. ఇంతోటి దానికి అరవై లక్షల ప్రజా ధనం తగలేసి వాస్తు ప్రకారం మార్పు, చేర్పులు చేయించారు. గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కన్నా ముందు ముఖ్యమంత్రులు తమ నివాసాల నుండే పరిపాలన సాగించే వారు. లోపాయికారీగా ప్రభుత్వ డబ్బులతో తమ ఇళ్ళను కావలసిన విధంగా రిపేర్లు కూడా చేయించు కునేవారనుకోండి, అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు, యన్టీయార్ కూడా దీనికి మినహాయింపు కాదు. రాజశేఖర రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంటికివెళ్ళ లేదు. ఏకాఎకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మకాం పెట్టేసారు. యుద్ధ ప్రాతిపదిక పై ముఖ్యమంత్రి అధికార నివాస నిర్మాణం ప్రారంభించారు. దీనికోసం దాదాపు పది కోట్లవరకు ఖర్చు పెట్టారు. దీని ఖర్చు పైన కొన్నివిమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి భద్రత, పాలనా సౌలభ్యం మొదలైన వాటి దృష్ట్యా ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేదు. కాని ఇప్పుడు రోశయ్య గారు స్వంత ఇంటిలో నివాసముంటూ అధికార గృహం నుంచి...