Skip to main content

భయంకరంగా మారిన అవినీతి

రోజూ పేపర్లో చూస్తుంటే అవినీతి కుంభ కోణాలు ఎంతగా పెరిగి పోయాయో తెలుస్తూంది. అవినీతి లక్షలు దాటి కొట్లలోకి అది కూడా పదులు వందలు దాటి వేల కోట్ల లోకి పెరిగింది. దీనికి అంతం ఎప్పుడైనా వుంటుందా అని అనిపిస్తుంది. ఎందుకని ఎవరికీ దీనిగురించి చీమకుట్టినట్టైనా వుండదో అని ఆశ్చర్య మేస్తుంది.

ప్రతి పార్టీ అవినీతిని అంతం చేస్తానని అంటుంది, రూలింగ్ పార్టీతో సహా! ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టం, సారా పోయించం అని ఒక పార్టీ కూడా చెప్పదు. ఎందుకంటే వాళ్లకు బాగా తెలుసు. ఇవి లేకుండా ఎలెక్షన్ లో గెలవడం అసాధ్యమని. మన ప్రజల తెలివి తేటలు, జ్ఞాపక శక్తి మీద వీరికి అపారమైన నమ్మకం, విశ్వాసమూను. అధికారం లో వుండి ఏమి చేసిన కూడా మళ్లీ ఒక నోటు, కొంత మద్యం పంపిణి చేస్తే చాలు, గెలిచి పోతామని ఎక్కడ లేని ధీమా. దురదృష్ట వశాత్తు దాన్నే నిజం చేస్తున్నారు మన ప్రజలు.

ఈనాయకులు ఇచ్చే డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయనే విషయం ఒక్కసారి ఆలోచిస్తే ఎవరికి అర్థం కాదు? ఈ ప్రజలు అన్నీ అర్థమయ్యీ సరేలే అనుకుంటున్నారా, లేక ఏమీ అర్థం కాక సరేలే అనుకుంటున్నారా? అర్థం కాదు. నాకనిపిస్తుంది, దీనికి మూలాలు తరతరాలుగా మగ్గిన భూస్వామ్య శృంకలాల్లో ఉన్నాయనిపిస్తోంది. ఎవరో ఏదో ఇస్తారని, వాటిని తీసుకొని కృతజ్ఞత గా ఉండాలన్న ఆలోచన ఇంకా మన ప్రజలను వీదలేదనిపిస్తుంది. మన రాజ్యాన్ని మనమే పరిపాలిస్తున్నామన్న ఆలోచన ఇంకా రాలేదనిపిస్తోంది. పరిపాలించే బాధ్యత తీసుకునే కోరిక కూడా ఉంటుందనికోను.

Comments

Popular posts from this blog

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

సాయి బాబానా, దేవుడా?

యధాలాపంగా చానెళ్ళు తిరగేస్తుంటే ABN/ఆంధ్రజ్యోతి లో ఒక వింత చర్చ కనిపించింది. 'అందరి వాడేనా' అనే టైటిల్ తో ఒక సాయి బాబా భక్తుడు గారు, ఒక శాస్త్రులు గారిని కూర్చో బెట్టి యాంకరు వీర లెవెల్లో తతంగం నడిపిస్తున్నాడు. నేను మధ్యలో జాయినైనానేమో ముందేమీ అర్థం కాలేదు. చివరకి అర్థమైన సారాంశం ఇదీ. గుంటూరు జిల్లాకి చెందినా ఒక డాక్టరు గారు 'షిర్డీ సాయిబాబా అసలు హిందూ దేవుడే కాదు' అంటూ వాదం లేవ దీస్తూ ఒక పుస్తకం రాశాడట. దాంట్లో సాయిబాబా అసలు హిందువే కాదని, నిరంతరం 'అల్లా మాలిక్' అనుకుంటూ తిరిగిన వాడిని హిందువు లెందుకు పూజించాలని ఆయన ప్రశ్నలు లేవ దీశాడు. సనాతన ధర్మం రోజు రోజుకీ అటకెక్కి, జనం సాయి జపంలో మునిగి తేలుతున్న ఈ తరుణంలో కక్కా లేక మింగా లేక గుర్రుగా వున్న సనాతన వాదులకు దీంతో కొంత బలం చేకూరినట్టే కనిపిస్తుంది. అందుకే కాబోలు, శాస్త్రులు గారు వీర లెవెల్లో వాదన వినిపిస్తున్నారు. ఎప్పుడూ నాస్తికులకు, అస్తిత్వ వాదులకు మధ్యన జరిగే వాదనలు విని విని విసుగెత్తిన తరుణంలో ఇదేదో కొత్తగా బాగానే ఉందని పించింది. వార్తల చానెల్సుకి కూడా కొత్త విషయం దొరికి నట్లుంది, రెండు వైపులా బాగానే...