ఈరోజు టీవీలో జయప్రకాష్ నారాయణ గారి కార్యక్రమం చూసాను. అయన చెప్పే వాస్తవాలు విటుంటే కళ్లు తిరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో మార్పూ రావాలనే కోరిక ఉంటుంది. అయితే నా ఒక్కడివల్ల ఏం అవుండానే నిర్లిప్తత ఉంటుంది. దీన్ని అవకాశవాద రాజకీయ పార్టీలు బాగా ఉపయోగించు కుంటున్నాయి. ఆయన విశ్లేషణ వింటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. వచ్చే బడ్జెట్ లో 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే ఒక ఓటు పై దాదాపు రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయల డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి అవినీతినే ఆశయంగా మలుచుకున్న పార్టీలు ఓటు పై వందో వెయ్యో ఖర్చు చేయడానికి వెనుకాడవు. ఈవిషయాలను సామాన్య ప్రజానీకానికి ప్రతి ఆలోచించే వ్యక్తీ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమ ఓటును సక్రమంగా వినియోగించ గలిగిన నాడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం స్ద్ధిస్తుందని చెప్పితే అతిశయోక్తి కాదు.
చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.