Skip to main content

అవినీతా అసమర్థతా

రోజూ ఆఫీసుకి వెళుతూ వుంటాం, ఇంటికి వస్తూ వుంటాం. తొందరలో పడి ఏది పూర్తిగా గమనిచం. గమనిచినా పట్టించుకోం. ఉదాహరణకి...
  1. మాన్ హోల్ కవర్లు ఎప్పుడూ రోడ్డుకి నాలుగు ఇంచులు లోపలికో, నాలుగు ఇంచులు బయటికో ఎందుకు వేయబడి ఉంటాయ్? రోడ్డుకి సమాంతరంగా వేసే టెక్నాలజీ ఇంకా మనకు లేదా?
  2. కొన్ని చోట్ల అమాంతంగా రోడ్డు ఎందుకు కురచ బడి పోతుంది? రోడ్డుకి ఏ స్మశానమో, మరోటో ఎందుకు అడ్డంగా వుంటుంది?
  3. అసలు రోడ్డు కూడా ఏ ముఖ్య కేంద్ర నాయకుడో, అంతర్జాతీయ నాయకుడో వచ్చినప్పుడే ఎందుకు వేయబడుతుంది? ఉన్నవి మైంటైన్ చేయటానికి, కొత్తవి వేయటానికి నిర్నీతమైన గడువులేమీ వుండవా?
  4. కొత్తగా వేసిన రోడ్డుని తవ్వి పోసి నిటి సరఫరా పనులో, కేబుల్ వర్కో చేస్తుంటారు. మళ్ళీ ఆ రోడ్లను వేయరు. వేసినా కూడా నాసిరకంగా వేస్తుంటారు. ఏదయినా పని చేసిన తర్వాత యధావిధంగా రోడ్డును పునరుద్ధరించాలని కాంట్రాక్టులో ఉండదా? ఉన్నా అమలుకాదా?
  5. ఫుట్ పాత్ మీద మొత్తం ఆక్రమణలు ఉంటాయి. వీటిని ఎవరు తొలగించాలి? కొన్ని చోట్ల ఫుట్ పాత్ మాత్రమే కాక రోడ్డు కూడా రెండు మూడు గజాల వరకు అక్రమించుకోబడి ఉంటుంది.
  6. కరెంటు స్థంభాలకి కేబుల్సు సాలె గూడులా వేలాడుతుంటాయి. వీటిని ఎవరు పట్టించుకోవాలి? ఇవి కొన్నిసార్లు రోడ్డుపై పడిపోయి ప్రమాదాలకు కారణమవుతుంటాయి.
  7. కొన్ని హోటల్లు రోడ్డుపైకి కుంపట్లను పెట్టి ఆ పొగను, వేడిని రోడ్డు పైకి వదులుతుంటాయి.
  8. బస్సులను బస్ బే లో ఆపరు. ఆపనివ్వకుండా అక్కడ ఆటోలో, తోపుడు బళ్ళో, హకర్సో తిష్ట వేసి వుంటారు.
  9. కొన్ని చోట్ల అవసరం లేక పోయినా రోడ్లు వెడల్పు చేస్తారు, వంతెనలను వేస్తారు. మరికొన్ని చోట్ల ఎంత అవసరం ఉన్నప్పటికీ పట్టించుకోరు.
  10. కొన్ని చోట్ల రోడ్డు పెద్దగానే వుంటుంది. కాని ట్రాఫిక్ పోలీసులే రోడ్డుకి అడ్డంగా పెద్ద పెద్ద బారికేడ్లు పెడతారు. అవి ఎందుకో ఎంత ఆలోచించినా అర్థం కాదు.
అర్థం కాని ప్రశ్నలలో ఇవి కొన్ని మాత్రమే. నిత్యం ఇలాంటి విషయాలు ఎన్నో గోచరిస్తూ వుంటాయి. మరి మీకు?

Comments

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...