Skip to main content

సత్యాన్వేషణ, రాగ ద్వేషాలు

'వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, చెప్పగలవాడు పుట్టలేదురా...' అన్నాడో సినీ గేయ కవి. ఎంత నిజం!

గుడ్ అంటే ఏమిటి?
సత్యం.

సత్యం అంటే?
నిజం.

నిజం అంటే?
...

మళ్ళీ సత్యానికొద్దాం. సంస్కృతంలో 'సత్' అంటే మంచి అనే అర్థం ఉంది. అంటే మంచి చేసేదే సత్యం, నిజమూను. మళ్ళీ మొదటికోచ్చామా? ఏది మంచి? ఏది చెడు?

మంచి పని అంటే ఏమిటి? మనకు లాభం జరిగితే మంచా? నష్టం జరిగితే చెడా? మనకు నష్టం జరిగినా ఇతరులకు లాభం జరిగితే? దాన్నేమనాలి? ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రకారం ఎక్కువమందికి ఏది లాభం జరిగితే అదే మంచా? మరి తక్కువ మంది విషయమో?

ఉదాహరణకు శ్రీలంకలో తమిళులు తక్కువ శాతం ఉన్నారు. అక్కడి చట్టాలు సింహళులకు మంచి చేసేవిగా ఉన్నాయి. అది మంచేనా?

అంతెందుకు? మనం ఆఫీసులో ఎక్కువ గంటలు పనిచేస్తే ఆఫీసరుకు మంచి. ఇంట్లో ఎక్కువ గంటలు గడిపితే కుటుంబ సభ్యులకు మంచి.

ఇలా ఆలోచించుకుంటూ పోతే... మంచి, చెడుల మధ్యన ఎంత అస్పష్టత దాగి వుందో తెలుస్తుంది. ఈ మంచి, చెడుల గురించిన ఆలోచనలు మనిషి ఆలోచించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్నాయనిపిస్తుంది. అన్ని మతాలు, అన్ని ఇజాలు తాము చెప్పేదే మంచి అని బోధిస్తాయి. నిజానికి ఈ మతాలు, ఇజాలు అన్నీ కుడా మంచిని అన్వేషించడం తోటే మొదలయ్యాయి. సమాజంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న ప్రతి సారి, సత్యం కోసం అన్వేషణ జరిపినవారు గొప్ప ప్రవక్తలుగా మారారు. వారి వారి కాలాలకు, అప్పుడున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో సఫలీకృతులయ్యారు. తాము కనుగొన్న 'సత్యాలను' భావి తరాల కోసం విపులంగా క్రోడీకరించారు. తదనుగుణంగానే ఇప్పుడు సమాజం నడుస్తుంది.

విచిత్రమేమంటే సత్యాన్వేషణలో అందరి గమ్యం ఒకటే. కాని మార్గాలు వేరయ్యాయి. ఎవరికి వారు మాదే సత్యం అంటే మాదే సత్యం అని కలహించు కున్నారు. సంగ్రామాలు, మహా సంగ్రామాలు, ప్రపంచ మహా సంగ్రామాలు సహితం జరిగాయి. కేవలం మాదే సత్యం అని నిరూపించు కోవటానికి! తనకు తెలిసిన సత్యాన్నే ప్రపంచ సత్యంగా మార్చ టానికి. దీంట్లో ఎంతమంది సఫలీకృత మయ్యారో చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికీ అర్థమౌతుంది.

నేను చెప్పేదే సత్యం అని ఎవరైనా అంటే అది ఎంత నిరర్థక మైన మాటో ఇప్పుడు గమనించారా? మహా మహులైన ప్రవక్తలు, జ్ఞానుల మాటాలు కుడా నిరంతర సత్యాలు కావని గ్రహించాం. అలాంటప్పుడు మన మాటలు ఎంత? మనం చెప్పే మాటల్లో ఎంత శాతం సత్యం ఉంది? అలాగే ఇతరులు చెప్పే దాంట్లో ఎంతో కొంత సత్యం ఉంటుందని ఎందుకు భావించం?

అలా భావించిన నాడు మన చర్చలు ఎంత అర్థ వంతంగా, గౌరవ పూరితంగా ఉంటాయి? అలాంటి చర్చల వల్ల మాత్రమే విజ్ఞానం పెంపొందడానికి అవకాశం ఉంది తప్ప రాగ ద్వేషాలతో కూడిన చర్చల వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదు.

Comments

  1. సత్యానికి ప్రయోజనానికి ముడిపెట్టడం అర్ధం కాకుండా ఉంది. సత్యం మంచి చెడులకు అతీతమైనదని నేను అనుకొంటున్నాను.

    యేమైనా మంచి విషయం రాసినందుకు అభినందనలు.

    ReplyDelete
  2. సీతారాంరెడ్డి గారు

    శాశ్వత మైన సత్యమేది లేదనేదే నా అభిప్రాయం. దీని గురించి నా అభిప్రాయాలు మరికొన్ని వ్యాసాల ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తాను.

    వ్యాఖ్య చేసినందుకు కృతఙ్ఞతలు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...