Skip to main content

మన విద్యా విధానం ఎటు వెళ్తుంది?

అందరం క్లాసులో నిశ్శబ్దంగా కూర్చున్నాం. అపుడు నేను REC వరంగల్ లో కొత్తగా చేరాను. మొదటి క్లాసు కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. రాబోయేది అయ్యంగార్ సార్. అందరికీ కొత్త కావడంతో భయం భయంగా కూర్చున్నాం. అందులో జరగ బోయేది మాథ్స్ క్లాసు.

అయ్యంగార్ గారు రానే వచ్చారు. మొదట అందరిని పరిచయం చేసుకున్నారు. తనను తానూ పరిచయం చేసుకున్నారు. తరువాత చాక్ పీసు తీసుకుని బోర్డుపై అడ్డంగా ఒక గీత గీసారు.

"ఇదేమిటి"? ఒకడిని లేపి అడిగారు. వాడు సరిగా చెప్పలేక పోయాడు.

ఒకరిద్దరి తర్వాత ఒకడు చెప్పాడు. "X axis".

"Good. మరి ఇదేమిటి?" ఇప్పుడు నిలువుగా గీత గీసి ఇంకొకడిని అడిగారు.

ఈసారి వెంటనే వచ్చింది జవాబు. "Y axis".

అలా ఒక్కొక్క బిందువును గుర్తిస్తూ, గీతలు గీస్తూ క్లాసులో ప్రతి ఒక్కరిని లేపి ప్రశ్నలు వేయ సాగారు. కొద్ది నిముషాల్లో మా భయం, బెరుకు పోయింది. అయన మాకో అధ్యాపకుడిగా కాక ఒక స్నేహితుడిగా కనిపించ సాగారు. ఉత్సాహంతో జవాబులు చెప్పడం మొదలు పెట్టాం.అలా అరగంట పాటు చర్చ కొనసాగింది. ఇంతలో నా స్నేహితుడు లేచి ఒక విషయం చెప్పాడు.

"Yes, this is what exactly is called as Roll's theorem." ఆయన చెప్పారు.

ఆశ్చర్య పోవడం మావంతైంది. Roll's theorem మొదటి పాఠం అని తెలుసు (ముందే సిలబస్ చూసుకున్నాం కాబట్టి). కాని ఆ సిద్ధాంతాన్ని మా అంత మేమే చెపుతామని అస్సలు ఉహించ లేదు! ఇక ఆ థియరీని జీవితంలో ఎలా మరిచి పోగలం? తర్వాత ఆయన ఆ చాప్టర్ లో ఒక్క లెక్కని కుడా చెప్పలేదు. ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే వాటిని మేమే పరిష్కరించి వేసాం. మూల సిద్ధాంతం తెలిసిన తర్వాత సమస్యలు పరిష్కరించడం ఎంత సులభమో అప్పుడు తెలిసింది.

సరిగ్గా ఇలాంటి విద్యా విధానమే మనకు కావలసినది. అయితే B Tech లో కాదు. ప్రాథమిక పాఠశాల నుండే మొదలు కావాలి. కాని జరుగు తున్నది వేరు. తోచింది చెప్పడం. గంటలకు గంటలు పిల్లల తో బట్టీయం వేయించడం. బండెడు హోం వరకు చేయించడం. దీంతో పిల్లలకు కనీసం ఆడుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. ఇక ఇంటర్మీడియేట్ కాలేజీల విషయం మరీ దారుణం. పిల్లలని చదివే యంత్రాలు గా భావిస్తున్నారు. ఫలితంగా ర్యాంకుల మాటేమో గాని, పిల్లలు మానసిక రోగులు గా మారుతున్నారు. ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు.

Comments

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...