Skip to main content

అధికారం

దివంగత ముఖ్య మంత్రి చని పోయి రెండు రోజులు కూడా కాలేదు. సంతాప దినాలు పూర్తి కావడానికి ఇంకా ఐదు రోజులున్నాయి. ఈ లోపలే కాంగ్రెస్ వారు కామెడీ మొదలు పెట్టారు. వీరి కామెడీకి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.

ముఖ్య మంత్రి పార్థివ శరీరాన్ని ఇంకా తీసుకు రాక ముందే కేబినేట్ మీటింగ్ ఒకటి పెట్టారు. ఒక సంతాప తీర్మానం, కడప జిల్లాని YSR జిల్లాగా మార్చాలని ఒకటి, జగన్ ని ముఖ్యమంత్రిగా నియమించాలని ఒకటి మొత్తం మూడు తీర్మానాలు చేసారు. మొదటి రెండు వరకు ఫరవా లేదు. ఒక కేబినేట్ మంత్రి వర్గం ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కొరకై సిఫారసు చేయడం... కామెడీగా లేదూ? ఇందులో అసలు కామెడీ ఏమిటంటే ముఖ్యమంత్రి చనిపోయాక, ఆయన నియమించుకున్న ఈ మంత్రివర్గం రద్దయినట్లే నని రాజ్యాంగ నిపుణులు సెలవిచ్చారు. మరి వీరి తీర్మానాలకు చట్ట బద్ధత ఏది?

ఇక రెండోది కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం. వీరంతా సమావేశమై జగన్ మాత్రమే ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేశారట. వీరి తీర్మానం నాలిక గీక్కోవడానికి కూడా పనికి రాదు. వీరెందుకు హడావిడిగా ఇప్పుడు తీర్మానం చేయడం? ఒక వైపు అధిష్టానం ఈ విషయం పై ఏమీ మాట్లాడకండి అని చెపుతుంటే?

మూడోది ఎమ్మెల్యేలు కూడా తీర్మానం చేయడానికి ప్రయత్నించడం. కాని కేంద్రం మొట్టికాయలు వేసేసరికి సంతాప సభతో సరిపెట్టారు.

అసలు వీరు ఇంత హడావిడి చేయడం ఎందుకో అర్థం కాదు. జగన్ కి ప్రజాభిమానం, ఎమ్మెల్యేల బలం ఉన్నట్టయితే ఆయనే అవుతారు ముఖ్యమంత్రి. దీనికోసం ఇంతగా తొందర పాటు చర్యలకు దిగడం ఆశ్చర్యం కలిగించడమే కాదు, అసహజంగా కూడా వుంది.

పదే పదే రఘువీరా రెడ్డి ప్రకటనలు ఇవ్వడం, బొత్స సత్యనారాయణ వెళ్లి DS పై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడం తొందరపాటు చర్యలుగా అనిపించడం లేదూ?

Comments

  1. జగన్ CM ఐతే అదే కోటరీ లో ఉండి తమ పదవులు కాపాడుకోవచ్చని మంత్రుల ఆరాటం , జగనన్న CM కావలి అని అరిసి మీడియా లో ప్రముఖం గా కనపడితే ఏదో ఒక పదవి దక్కక పోతుందా అని మిగిలిన వారి ఆరాటం. స్వార్ధం ఒక స్థాయి వరకు భరించవచ్చోమో గాని వీళ్ళని వీళ్ళ ఆరాటాన్ని చూస్తుంటే ఛీ వద్దులేండి వేరే జీవాలతో పోలిస్తే మన బ్లాగర్లు చాలా మంది బాధ పడతారు.
    ఎక్కడ పడితే అక్కడ అలా అరుస్తా ఉంటే ప్రస్తుతం ఆ పదవి నిర్వహిస్తున్న వ్యక్తి కి ఎలా ఉంటుంది అన్న కనీస జ్ఞానం కూడా లేదు ఛీ ఛీ !

    ReplyDelete
  2. >> "వీళ్ళని వీళ్ళ ఆరాటాన్ని చూస్తుంటే ఛీ వద్దులేండి వేరే జీవాలతో పోలిస్తే మన బ్లాగర్లు చాలా మంది బాధ పడతారు"

    ;-)

    ఎవరో రాశారు, బ్లాగుల్లోనే. వైఎస్ అపర గాంధీ అట! అభిమానానికీ ఓ హద్దుండాలి.

    ReplyDelete
  3. పదవి కోసం, డబ్బుల కోసం ఎన్నెన్ని డ్యాన్సులు కడతన్నారో చూడండి. అకశేరుకాలు సార్, వీళ్ళు!

    ReplyDelete
  4. శ్రావ్య, అబ్రకదబ్ర, చదువరి గార్లకు ధన్యవాదాలు.

    ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన సంతాప సభలో కూడా అదే కనపడింది. హాజరైన కార్యకర్తల్లో ఏ ఒక్కరి ముఖంలోనూ సంతాపం కనపడ లేదు, ఎంత గట్టిగా అరవాలన్న తపనే తప్ప.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...