Skip to main content

కుహనా సమైక్య వాదం, కుహనా ప్రత్యేక వాదం

ఇప్పుడు రగులుతున్న తెలంగాణా సమస్యలో ప్రధానంగా రెండు వాదాలు వినిపిస్తాయి. రాష్ట్రాన్ని విభజించాలని చెప్పే ప్రత్యేక వాదం ఒకటి కాగా, రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని చెప్పే సమైక్య వాదం ఒకటి.

ప్రత్యేక వాదుల విషయానికొస్తే మొదలు చెప్పుకోవాల్సింది తెలంగాణా రాష్ట్ర సాధనం మాత్రమే సమస్యకు ఏకైక వికల్పంగా భావిస్తున్న తెలంగాణా ప్రాంతంలోని అత్యధిక శాతం మంది ప్రజలు, మేధావులు, రాజకీయులు. అలాగే ప్రత్యేక ఆంద్ర రాష్ట్రంతో మాత్రమే తమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పే ఆంధ్రా ప్రజలు, మేధావులు, రాజకీయులు. తెలంగాణా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై సానుభూతితో విభజన కోరుతున్న ఆంధ్రా ప్రజలు, మేధావులు. వీరందరూ ఏదో ఒక కారణంతో రాష్ట్ర విభజననే కోరుతున్నారు.

ఇక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పే వాదనలు తెలుగు జాతి, తెలుగు జాతి సౌభ్రాతృత్వం, తెలుగు జాతి సమైక్యత చుట్టూ తిరుగుతుంటాయి. వీరి వాదనలో విపరీతమైన భాషాప్రేమ తప్ప మరేమీ కనిపించదు. సగటు తెలంగాణా పౌరుడు 'తన పొట్ట నిండడమా? తెలుగుపై ప్రేమా?' అన్న మీమాంసలో మొదటి దాన్నే ఎంచుకున్నాడని వీరు గుర్తించరు. తెలుగు జాతి సౌభ్రాత్వుత్వం గురించి మాట్లాడే వారికి, తమ సోదరులు కోరుతున్న న్యాయ బద్ధమైన కోరికలు కనపడవు. వారి పోరాటాలు, త్యాగాలు కనపడవు. కాని వారు ఆవేశంలో చేసిన చిన్న చిన్న పొరబాట్లు మాత్రం భూతద్దంలో చూసినట్టు కనబడతాయి.

ఇక పోతే ఇప్పుడు శీర్షికలో ప్రస్తావించిన కుహనా వాదాల గురించి ప్రస్తావిద్దాం. 

మొదట కుహనా సమైక్యవాదం గురించి.

వీరు సమైక్య వాదం పై పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతారు. వీరి వాదాలు అన్నీ వీగిపోయే సమయం వచ్చినప్పుడు మాత్రం అసలు విషయం బయట పెడతారు. అదేనండీ, హైదరాబాదు. మాకు హైదరాబాదు ఇచ్చేస్తే, ఒక్క రోజులో తెలంగాణా ఇస్తాం అంటారు, అదేదో వారి ఇంటినుండి తెచ్చి ఇచ్చేటట్టు! వీరికి ఉన్నది హైదరాబాదు నగరం పై కాంక్ష తప్ప సమైక్యత భావన ఆవగింజంత కూడా ఉండదు. ఇంకొంత మంది మాత్రం 'హైదరాబాదు కూడా కాదు, మాది నీటి సమస్య' అంటారు. వీరు కొంతలో కొంత నయం మనసులో మాట చెప్పినందుకు. మరి వీరికున్న భయాలేవో మాత్రం చెప్పరు. ఇప్పుడ అన్ని రాష్ట్రాల మధ్య నీటి ట్రిబ్యునళ్ళు ఎలా పని చేస్తున్నాయో, విడిపోయాక కూడా అలాగే పని చేస్తాయి  అనే విషయం వీరికి తెలియదనుకోవాలా?

ఇక కుహనా ప్రత్యేకవాదం గురించి.

వీరు మేం ప్రత్యేక వాదులమనే చెప్పుతారు.  పైగా 1972 ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నామని కూడా చెపుతారు. 'విడిపోతే మేం మీకంటే గొప్పగా అభివృద్ధి చెందుతాం' అంటారు. 'మరి విడిపోవచ్చు గదా?' అని అడిగితే మాత్రం అసలు రంగు బయట పెడతారు. 'మీరు మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి విడిపోం' అన్నది వీరి ముఖ్యమైన వాదన. ఏ ఉద్యమమైనా దేనికో ఒకదానికి వ్యతిరేకంగానే పుడుతుంది. ఉద్యమంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. అన్ని రకాల భాషలు ప్రయోగింప బడతాయి. ఇలాంటి వారికి తెలంగాణా వాదులను తాలిబాన్లని సంబోధించడం మాత్రం కనపడదు. తాము ఒకప్పుడు తెలంగాణాకి అనుకూలంగా ఉన్న ముల్కీ రూల్స్ కి వ్యతిరేకంగానే ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేసామన్న విషయాన్ని కన్వీనియెంట్ గా మరిచి పోతారు. వీరు బయటికి చెప్పేది ప్రత్యేక వాదమే అయినా వీరిది కుహనా సమైక్య వాదులకు, వీరికి పెద్దగా తేడా లేదు. అదేమిటో బహిరంగ రహస్యమే, హైదరాబాదు పై, దామాషాకు మించిన జలాలపై ఆశ తప్ప మరేమీ కాదు.

Comments

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...