Skip to main content

Posts

సత్యాన్వేషణ, రాగ ద్వేషాలు

'వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, చెప్పగలవాడు పుట్టలేదురా...' అన్నాడో సినీ గేయ కవి. ఎంత నిజం! గుడ్ అంటే ఏమిటి? సత్యం. సత్యం అంటే? నిజం. నిజం అంటే? ... మళ్ళీ సత్యానికొద్దాం. సంస్కృతంలో 'సత్' అంటే మంచి అనే అర్థం ఉంది. అంటే మంచి చేసేదే సత్యం, నిజమూను. మళ్ళీ మొదటికోచ్చామా? ఏది మంచి? ఏది చెడు? మంచి పని అంటే ఏమిటి? మనకు లాభం జరిగితే మంచా? నష్టం జరిగితే చెడా? మనకు నష్టం జరిగినా ఇతరులకు లాభం జరిగితే? దాన్నేమనాలి? ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రకారం ఎక్కువమందికి ఏది లాభం జరిగితే అదే మంచా? మరి తక్కువ మంది విషయమో? ఉదాహరణకు శ్రీలంకలో తమిళులు తక్కువ శాతం ఉన్నారు. అక్కడి చట్టాలు సింహళులకు మంచి చేసేవిగా ఉన్నాయి. అది మంచేనా? అంతెందుకు? మనం ఆఫీసులో ఎక్కువ గంటలు పనిచేస్తే ఆఫీసరుకు మంచి. ఇంట్లో ఎక్కువ గంటలు గడిపితే కుటుంబ సభ్యులకు మంచి. ఇలా ఆలోచించుకుంటూ పోతే... మంచి, చెడుల మధ్యన ఎంత అస్పష్టత దాగి వుందో తెలుస్తుంది. ఈ మంచి, చెడుల గురించిన ఆలోచనలు మనిషి ఆలోచించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్నాయనిపిస్తుంది. అన్ని మతాలు, అన్ని ఇజాలు తాము చెప్పేదే మంచి అని బోధిస్తాయి. నిజానికి ...

అవినీతి మంత్రులకే తిరిగి పట్టం

కరుణానిధి చివరికి పంతం నెగ్గించుకున్నాడు. ఎ. రాజా, టి. ఆర్. బాలు తిరిగి కేంద్ర మంత్రులు కాబోతున్నారు. పరమ అవినీతి పరులని మన్మోహన్ సింగ్ మొత్తుకున్నా అతని మాట కరుణానిధి లెక్క చెయ్య లేదు. ఆ క్వాలిఫికేషనే DMK అధినేత వత్తిడికి ముఖ్య కారణం అని వేరే చెప్ప నవసరం లేదను కుంటాను. బాలు స్వయంగా తన కొడుకు కంపెనీకి గ్యాస్ సరఫరా కుంభకోణంలో ఇరుక్కుంటే, రాజా ఏమో 60,000 ల కోట్ల రూపాయల స్పెక్ట్రం అలోకేషన్ కుంభకోణం లో పాత్ర ధారి. ఇప్పుడు అవినీతి పూర్తిగా వ్యవస్తీకృత మైందన్న విషయానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదేమో? అధినేతలకు గాని, వారి అనుచరులకు గాని తమ అవినీతి భాగోతాలను ప్రజలు చూస్తున్నారన్న భయం ఏమాత్రం లేదు. వారు ఎంత సేపు ఎంత ఎక్కువ డబ్బు సంపాదించి వచ్చే ఎన్నికల్లో కొంత ఖర్చు పెట్టి నెగ్గుదామా అనే చూస్తున్నారు. అవినీతి వల్ల తాము ఓడిపోతామేమో అన్న ఆలోచనే లేదు. ఎన్ని అవినీతి కుంభకోణాలు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రబల సాక్ష్యంగా నిలుస్తుందాయే!

ఎన్నికల ఫలితాలు

ఎన్నికలు అయి పోయి ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ వారు తప్ప ప్రతి ఒక్కరు రాష్ట్రంలో హంగ్ వస్తుందనే అనుకున్నారు. కాని ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పీకల లోతు అవినీతిలో కూరుకు పోయి నప్పటికీ విజయం సాధించడం ఏ విపరిణామాలకు దారి తీస్తుందో నని భయంగా వుంది. చంద్రబాబు కాంగ్రెస్ అవినీతిపై పోరాటం చేసినప్పటికి అది ఆశించిన స్థాయిలో లేదు. కారణం సుస్పష్టం. చంద్ర బాబు ఏ విషయం లేవనెత్తినా కాంగ్రెస్ వారు దానికి ప్రతిగా గత తెలుగు దేశం పాలనలో జరిగిన ఉదంతాలను ఉదహరించి ఎదురు దాడికి దిగే వారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అంటే తామూ మచ్చ లేకుండా వుండటం ముఖ్యం. ప్రధాన ప్రతిపక్షంలో అది లోపించింది. పైగా కేంద్రంలో మన్మోహన్ సింగ్ మచ్చ లేని పాలన అందించడం కూడా కాంగ్రెస్ కి ఒక ప్లస్ అయింది. అంతకు ముందు తెదేపా పాలనలో అభివృద్ధికి కృషి జరిగినప్పటికీ అవినీతి, అట్టడుగు ప్రజానీకాన్ని, రైతులను పట్టించుకు పోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరింగింది. 2004 లో చంద్ర బాబు అధికారం లోంచి దిగి పోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు వ్యతిరేకత అలాగే వుంది. గత సంవత్సరంగా ఓటరులో మార్పు రాసాగింది. రాబందుల పాలన ఎలా వుం...

ICICI బ్యాంకులో నా అనుభవం

క్రమంగా ప్రైవేటు రంగ సంస్థలు భారత దేశంలో ముందంజ వేస్తుంటే సంతోషించిన వాళ్ళలో నేను ఒకడిని. ఒకప్పుడు జాతీయ బ్యాంకులో DD తీయాలంటే గంటలకొద్దీ సమయం పట్టేది. అదే నిమిషాల్లో ప్రైవేటు బ్యాంకుల్లో ఇచ్చేస్తుంటే ముచ్చటేసేది. అయితే ఈ ప్రైవేటు బ్యాంకులు ఎంత ఘరానా గా దోపిడీ చేయ గలవో అనుభవం మీద తెలిసింది. మూడు సంవత్సరాల క్రితం నేను 9 లక్షలు గృహ ఋణం తీసుకున్నాను మారే వడ్డీ విధానం పై. అప్పుడు వడ్డీ 9.00 శాతంగా వుండేది. ఈ మూడు సంవత్సరాల్లో వాయువేగ మనో వేగాలతో వడ్డీ రేటు 13.00 శాతానికి పెంచారు. సరే రేపో రేటు పెరిగింది కాబట్టి పెంచారులే అనుకుంటే మిగతా బ్యాంకుల కన్నా చాలా ఎక్కువగా. ఇక వాయిదాలను చూస్తే జీవితాంతం కట్టినా ఇంకా మిగిలేలా పెంచేశారు, అలాగే వాయిదా మొత్తం కూడా. రేపో రేటు తగ్గిన తర్వాత కుడా చాలా కాలం మిన్నకుండి కేవలం అర శాతం తగ్గించి 12.5 శాతం చేసారు. ఇక ఇలా కాదని కొంత మొత్తం తీర్చేద్దామని రెండున్నర లక్షలు పట్టుకుని బ్యాంకుకి వెళ్లాను. బేగంపేటలో వీరికి ఒక కస్టమర్ రిలేషన్ సెంటరు ఒకటి వుంది. అక్కడికే వెళ్లాను. మామూలుగా నైతే అన్ని లావా దేవీలు counter లోనే జరుపుతారు. కాని ఆశ్చర్యకరంగా నన్ను లోపలి...

ఓటు ఎవరికి వేయాలి?

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయ నాయకులు వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నగదు బదిలీ, కలర్ టీవీలతో అగ్ర భాగాన నిలిచింది. మొదట వంద రూపాయలకే ఇంటి సరుకులు వగైరా హామీలతో ముందుకొచ్చిన ప్రజా రాజ్యం పార్టీ వెనుక బడింది. కాంగ్రెస్ అయితే ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచిత కరెంటు పథకాలు, జలయజ్ఞం ఇప్పటికే ఆచరించి చూపాం అంటుంది. ఇప్పుడు బీజేపీ కొత్తగా సెల్ ఫోనులు, పదివేలకే లాప్ టాపులు, బ్రాడ్ బ్యాండ్ వగైరాలతో బయలు దేరింది. మిగతా వారితో పోల్చి చుస్తే ఇది కొంచెం హైటెక్ గా కనపడుతుంది.. ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారో మరి! నిజానికి ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలే. ప్రజోపయోగమైనవే. అయితే ముఖ్య మైన ప్రశ్న ఏమిటంటే ఇవి ఎంత వరకు ఆచరణ సాధ్యాలు? రైతులు, చేనేత కార్మికులు ఆత్మ హత్యలు చేసుకునే తరుణంలో కలర్ టీవీలు అవసరమా? రెండువేల రూపాయలు ఎవరికి ఇస్తారు? లబ్ది దారులను గుర్తించటానికి ప్రాతిపదిక ఏమిటి? నిజంగా గర్భ దరిద్రులకే ఆ సొమ్ము చేరుతుందని భరోసా ఏమిటి? గతంలో తెదేపా హయాములో పనికి ఆహార పథకం బియ్యం నాయకుల ఇళ్ళలోకి పోయాయన్న విషయం జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఆ ...

ఎన్నికలు, ఓటు విలువ

ఎన్నికల నోటిసు వచ్చిన తరువాత రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కు తున్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తామనే ధీమాతో వున్నారు. చిరంజీవి గ్లామర్ మరియు సంతర్పణ హామీలు, చంద్రబాబు ఎల్లలు దాటిన సంతర్పణ, రాజశేఖర్ రెడ్డి ఇదివరకే చేసివున్న సంతర్పణ లపై నమ్మకం పెట్టుకున్నారు. వీళ్ళ మాటల వరస చూస్తుంటే వీళ్ళకు ప్రజలు తమ కాళ్ళమీద తామే నిలబడడం కంటే బిచ్చగాళ్ళ లాగా అడుక్కుంటే ఎక్కువ సంతోష పడతారేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెపుతుంటారు. వీళ్ళు ఎక్కడినుంచి తెచ్చి ఇస్తారు? ప్రజల డబ్బేగా? మనం ఇంకా జమీందారీ వ్యవస్థ లో నుంచి బయటికి రాలేదని అనిపిస్తోంది. ఎంత సేపూ ఎవరో రావాలి, ఏదో ఇవ్వాలి అని కోరుకుంటాం. నిన్న ఓ టీవీ ఛానల్ లో చూపించారు... ఒకరు ఫ్రిజ్ ఇస్తే వోటేస్తాం అంటున్నారు, ఇంకొకరు మరోటి ఇస్తే వోటేస్తాం అంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారి మాటలలో చెప్పాలంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ని రాబోయే ఐదేళ్ళలో ప్రవేశ పెట్ట బోతుంది. మూడు కోట్ల మంది వోటేస్తే చాలు గెలవడానికి. అంటే ప్రతి ఓటు విలువ రెండు లక్షల ముప్పై వేల పైమాటే. తమ వోటుకు ఇంత విలువ ఉందని సామాన్యులకు తెలువడం ...

రాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

ఇప్పుడు బరిలో ఉన్న ముఖ్యమైన పార్టీల గుణగణాల పై ఒక పరిశీలన. కాంగ్రెస్ పార్టీ : ప్రస్తుతం ఈ పార్టీ తో ఏ ఇతర ప్రముఖ పార్టీ చేతులు కలపడానికి భయపడుతుంది. కారణం (ఎన్ని అభివృద్ది పనులు చేసినప్పటికి) ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పార్టీనేతల కుంభకోణాలే. ఈ పార్టీ పాలనలో జలయజ్ఞం, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచితవిద్యుత్తు మొదలైన కార్యక్రమాలు ఎంతో కొంత అమలైన మాట వాస్తవం. వీటి వల్ల లబ్ది పొందినవారు ఈ పార్టీ కే వోటు వేయడం సహజం. అయితే ఆలోచనా శీలురైన ప్రజలు ఈ పార్టీ అవినీతిపనులను ఎంతవరకు సమర్థిస్తారు అనే విషయం వేచి చూడాల్సిందే. తెలుగు దేశం - మహా కూటమి : ఈ కూటమి ప్రస్తుతం కాంగ్రెస్ కుంభ కోణాలను ఎండగట్టడంలో తల మునకలై ఉంది. ఇది మంచి వ్యూహమే ఐనప్పటికీ గతంలో చంద్ర బాబు పాలనలోనిఅవినీతి, కుంభ కోణాలు ఒక పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాక వీరు ఎంత సేపు వీరుఅవినీతి పై పోరాటం సాగిస్తున్నా మంటున్నారు కాని, అధికారం లోకి వస్తే నీతివంతమైన పరిపాలనకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పడం లేదు. దానికి తోడు తెలంగాణా ఇవ్వాలా వద్దా అనే వాదోప వాదాలు ఎలాగూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ వ్యతిరేకులకు ఈ కూటమి బలమైనప్రత్యా...