Skip to main content

Posts

సమస్యాపూరణం

శ్రీ  కంది శంకరయ్య గారు నిర్వహిస్తున్న శంకరాభరణం బ్లాగులో ఇటీవల నేను చేసిన పూరణలు. ఆ.వె. జడలు ముడియ గట్టి జపమాల చేబట్టి దొంగ స్వామి నగరి దూరి నంత చేరె చక్రధరుని చెల్లియే తనచెంత కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె కం. మిడిమేళపు దొర యొక్కడు కడ గ్రేడు సిమెంటు వాడి కట్టగ డ్యామున్ నడిరేయి గండి పడెనట గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్! కం. ఏమూలో దాగిన కవి సాముగరిడి చేసె కంది శంకరు మహిమన్ ఆ మాన్యు ప్రోద్బలము చే పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్. కం. హవ్వా యనగను సిబియై చివ్వున బోఫార్సు కేసు చీపుగ మార్చెన్ ఇవ్విధమగు శోధనమున పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్ తే.గీ. రైతు మరచిన హైటెక్కు రాజకీయు డతని నోడించి నొక 'దేవు' కందల మిడ వేల కోట్లతో పుత్రు కుబేరు జేసె పామునకు బాలు వోసిన ఫలిత మిదియె? కం. తానధికారము నుండగ ఏనాడూ కానలేదు ఈయన రైతున్ కానగ రైతులపై అభి మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్. ఆ.వె. దారి తప్పుటెల్ల తప్పుకాదెచటను దారి మరచినంత తప్ప నగును దారి వెతికి వెతికి దరిజేరకున్నను దారి తప్పు వాడు; ధర్మ విధుడు తే.గీ. వీధి...

లెఫ్టా రైటా?

పై కార్టూన్ ప్రముఖ Free Software Activist, మరియు Free Software Foundation సృష్టికర్త అయిన రిచర్డ్ స్టాల్మన్  వేసినది. కుడి వైపు రాళ్ళున్నా కూడా మరింత కుడికి పడవ నడపమని క్యాపిటలిస్టు ఎకానమిస్టులు ఉద్భోదించే విధానం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చెప్పబడింది. నది ఒక ఆర్ధిక వ్యవస్థ అనుకుంటే దానికి వామపక్షంలో (ఎడమవైపు) ఇసుక తిన్నెలు, దక్షిణపక్షంలో (కుడివైపు) బండరాళ్ళున్నాయి.  నావ పూర్తి ఎడమకి వెళ్ళితే ఇసుకలో చిక్కుకొని ముందుకెళ్ళడం కష్టం. అలాగే పూర్తిగా కుడివైపు వెళ్ళితే రాళ్ళకు గుద్దుకొని మొత్తానికే పగిలి, మునిగి పోతుంది. వామపక్షం వారు నావ (ఆర్ధిక వ్యవస్థ) పూర్తిగా ఎడమ వైపు నడపాలని, అలాగే క్యాపిటలిస్టులు నావను పూర్తిగా కుడి వైపు నడపాలని చెప్పడం ఈ కార్టూను చూసినప్పుడు అంతర్లీనంగా స్పురిస్తుంది. అలాగే మనలాంటి మూడవ ప్రపంచ దేశాలు మునిగి పోతాయన్నా పట్టించు కోకుండా అమెరికా, వరల్డ్ బ్యాంకు ఎలా మనని ఆపదల వైపు ఉసిగొల్పుతాయో వివరిస్తుంది ఈ కార్టూను. స్టాల్మన్ వేసిన మరిన్ని కార్టూన్లు ఇక్కడ  చూడొచ్చు.

అయేషా మీరా హత్య కేసు

అయేషా మీరా హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధించబడిన సత్యం బాబు కన్ఫెషన్ వీడియో ఇది. ఈ కేసు విచారణలో ప్రత్యక్ష సాక్షులు గాని, సాక్ష్యాధారాలు గాని పోలీసులు ఏమీ సంపాదించ లేక పోయారు. ఈ కన్ఫెషన్ వీడియో, మరియు ఇతర సాంకేతిక పరమైన సాక్ష్యాలు తీర్పుకోసం పరిగణలోకి తీసుకున్నట్టు టీవీ ద్వారా విన్న సమాచారం. నాకు న్యాయ పరమైన విషయాలు పెద్దగా తెలియవు. కాని ఒక సామాన్యుడిగా పరిశీలించినా, ఈ కేసులో దర్యాప్తు గాని, విచారణ గాని న్యాయబద్ధంగా జరిగాయని అనిపించడం లేదు. ఎంతటి నేరస్తుడైనా, తాను చేసిన నేరాన్ని వివరిస్తున్నప్పుడు ఏదో ఒకలాంటి భావోద్వేగానికి గురి కావడం సర్వ సాధారణమైన విషయం. చేసిన డానికి పశ్చాత్తాపానికైనా గురవుతాడు, ఉన్మాదిగా నైనా మాట్లాడతాడు, ఏడుస్తాడు, లేదా గర్వంగా చెపుతాడు. కాని పై వీడియోలో చూస్తే సత్యం బాబు ఎలాంటి భావోద్వేగాలకు గురికాకుండా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పోలీసుల వైపునుండి ఒక్క ప్రశ్న కూడా లేకుండా కథంతా పూసగుచ్చినట్టు చెప్పడం కూడా ఎవరో నేర్పించినట్టుగా లేదూ? వెనక వైపున ఒక లుంగీనో దేన్నో బ్యాక్ డ్రాప్ గా కట్టారు. ఇది కూడా అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ పోలీసు స్టేష...

మాన్ హోల్ కవర్లు

ఒక దేశ నాగరికతా వికాసం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఆ దేశంలోని రోడ్ల మీది మాన్ హోల్స్ చూస్తే సరిపోతుందేమో. ఇది నేను నవ్వులాటకు అనటం లేదు. నిజంగానే అంటున్నాను. మాన్ హోల్స్ అంటే చాలా అప్రధానమైన విషయం అని అనిపించవచ్చు. కాని రోడ్డు భద్రత విషయంలో ఇదొక ముఖ్యమైన విషయం. రోడ్డుమీద యధాలాపంగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాం. సడన్ గా  ముందు వాహనం కదిలి పోతుంది. అక్కడ యమకూపం లాంటి మాన్ హోల్ దర్శనమిస్తుంది. దాన్ని తప్పించడానికి స్టీరింగు కుడికో, ఎడమకో తిప్పుతాం, లేదా సడన్ బ్రేకు వేస్తాం. ఏం చేసినా రద్దీగా ఉండే రోడ్డుపై ఆక్సిడెంటు జరగడం ఖాయం. తర్వాత తిట్లూ, కొట్లాటలూ, కేసులూ మామూలే. ఒకవేళ ఆ యమకూపాల మీద నుంచి అలాగే పోదామా? టైర్లు పగలడమో, విడిభాగాలు విరిగిపోవడమో, ద్విచక్రవాహనమైతే క్రింద పడిపోవడమో ఖాయంగా జరుగుతుంది. అసలు మాన్ హోల్లు ఎలా వుండాలి? ఉదాహరణకు క్రింది బొమ్మలు చూడండి. ఇలాంటి మాన్ హోల్లు కట్టడం బ్రహ్మ విద్యా? రాకెట్ సైన్సా? కనీసం సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం కూడా అవసరం లేదు. తాపీ మేస్త్రీ పనితనం చాలు. కానీ మన మాన్ హోల్సు ఎలా ఉంటాయో పరీక్షిద్దాం. ఇది నేనేదో మనని మనం అవమానించుకోవడంగా భావించడం ల...

పద్యాలతో కుస్తీ

పదో తరగతి చదివేటప్పుడు తెలుగు టీచర్ అనంతాచార్యుల వారు చందస్సు నేర్పించారు. ఆ సందర్భంగా  ఆటవెలది పద్యాన్ని బోధిస్తూ, ఒక పద్య పాదాన్ని ఇచ్చి పూరించమని చెప్పారు. అది... 'ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు' చందస్సు నేర్చుకున్న ఆనందంతో సమధికోత్సాహంతో ఇలా పూరించాను.  ఆ. వె. ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు పాడునపుడు మనము పరవశించి  మేను పులకరించి మేఘ మధ్యంబునం దాటలాడుచున్న యట్లు దోచు తర్వాత ఇంగ్లీషు మీడియం చదువు, సాంకేతిక విద్య కావడంవల్ల పద్యాల గురించి పూర్తిగా మరిచే పోయాను. మళ్ళీ ఇలా బ్లాగులోకం లోకి వచ్చిన తర్వాతనే పద్యాలు రాయడానికి ప్రయత్నం చేశాను. చింతా రామకృష్ణా రావుగారి ఆశీర్వచనం, ఆచార్య ఫణీంద్ర గారి వద్ద శిష్యరికం, కండి శంకరయ్య గారి ప్రోత్సాహం లేకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ పద్యం రాసి ఉండే వాడిని కాదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగా వివిధ బ్లాగులలో నేను వ్రాసిన కొన్ని పద్యాలు. ఆ. వె. ఆశ లేని బ్రతుకు అడవిలో వెన్నెల ఆశ యందె కలుగు ఆశయములు ఆశ యుండు టెల్ల అత్యాశ కాబోదు ఆశ లోనె కలదు దేశ భవిత చం. సరుకులు కొందమన్న మరి చాలవు జీతపు డబ్బు లేటికిన్ తిరుగుద మన్న రోడ్...

మతం మంచిదా, చెడ్డదా?

మతం మంచిదా, చెడ్డదా అనే విషయం మీద రక రకాల చర్చలు జరుగుతున్నాయి. మంచి, చెడుల స్వభావం గూర్చి గతం లోనే ఒక వ్యాసం వ్రాసి ఉన్నాను. మంచి, లేదా చెడు అనేవి విశ్వంలో ముందే నిర్ణయించ బడి లేవు. అవి దేశ కాల పరిస్థితుల కనుగుణంగా మారుతుంటాయి. ఒక దృష్టి కోణం లోంచి మంచిగా కనపడిన విషయం మరో దృష్టి కోణం నుంచి చెడుగా కనపడేందుకు ఎంతైనా అవకాశం ఉంది. ఇంతకీ మతమంటే ఏమిటి? మతమంటే ఒక మార్గం. ఒక జీవన విధానం. ఇప్పటి వరకు ఎన్నో మతాలు ఉద్భవించాయి, కొన్ని మతాలు స్థాపించ బడ్డాయి. చాలా మంది పుట్టుకతో మతాన్ని వారసత్వంగా పొందుతున్నారు. కొంతమంది ఇష్ట పడి మతాన్ని స్వీకరిస్తున్నారు. దార్శనికులైన వ్యక్తులు తాము చూసిన ప్రపంచం లోని రకరకాల అవకరాల గురించి తీవ్రంగా ఆలోచించి కొన్ని నియమాలను ప్రతిపాదిస్తారు. ఈ నియమాలనే జనానికి ప్రభోధిస్తారు. ఎక్కువ మంది జనం ఈ నియమాలు నిజంగా తమ సమస్యలని పరిష్కరిస్తాయని భావించినప్పుడు వారంతా ఒక మతంగా మారటం మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఇలా ఏర్పడ్డ మతంలోని అనుయాయులు తరువాత తరంలో తమ మత సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేక దిశలో పయనించడం కూడా చూశాం. ఉదాహరణలు కోకొల్లలు. క్రీస్తు, 'తప్పు చేయని వాడు మ...

అడవులు

ఈ మధ్య ఒక శుభ కార్యానికి హాజరు కావడానికి వరంగల్ జిల్లాలోని ఒక ఊరికి వెళ్లాను. ఇదివరలో చూసినప్పుడు ఆ వూరిలో నిండుగా చెట్లు ఉండేవి. ఈ సారి ఒక్కటి కూడా కనపడక పోయేసరికి ఊళ్ళో ఒకతన్ని విషయం అడిగాను. 'ఏం చెప్ప మంటారు సార్. పనికి ఆహార పథకం కింద ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నారు.' అని సమాధానం. పనికి ఆహార పథకం క్రింద ఉన్న పనుల్లో చెట్లు నరకడం ఒకటి. డబ్బులు పంచుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి కనపడిన చేట్టునల్లా నరికేస్తున్నారు. దీనివల్ల ఊరికి, పర్యావరణానికి ఎంత అపకారం జరుగుతుందో ఎవరికీ పట్టడం లేదు. నలభయ్యేడు డిగ్రీల ఉష్ణోగ్రత. ఎండా భగ భగ మండి పోతుంది. నిలబడదామంటే చెట్టు కనిపించ లేదు. 'ఊళ్ళో చెట్లు సరే, మరి ఇళ్ళల్లో చెట్లు ఏమయ్యాయి?' మళ్ళీ అతనే చెప్పాడు. 'ఈ మధ్య ఊరిలో వాస్తు పిచ్చి ఎక్కువయ్యింది. ఇంట్లో ఉండ కూడదని మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, యూకలిప్టస్ చెట్టు, పొప్పడి చెట్టు... ఇలా రక రకాల చెట్లను నరికేస్తున్నారు.' నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎవరు ఏది చెపితే అది నమ్మే ఈ జనం ఎప్పుడు బాగు పడతారో అర్థం కాదు! పల్లెటూళ్ళలో విద్యాగంధం లేని ప్రజలు ఇలా చేస్తుం...