Skip to main content

Posts

Showing posts from April, 2008

రోజు రోజుకి పెరుగుతున్న అవినీతి.

ప్రతిరోజూ పెరిగిపోతున్న అవినీతిని చూస్తుంటే భయమేస్తుంది. ఈ అవినీతికి అంతం లేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఒకప్పుడు లక్షలు, తర్వాత కోట్లు, ఇప్పుడయితే వందల కోట్లు, వేలకోట్లు! ప్రతి రోజు పేపరు చదువుతున్నప్పుడు వళ్ళు ఉడికి పోతుంది. లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. లక్ష మంది కైనా ఉపయోగ పడుతుందా అనేదే ప్రశ్న. బహుశా పాలక వర్గానికి చెందిన లక్ష మందికి ఉపయోగ పడుతుందేమో? ఈ రోజు జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్వ్యూ చూసాను. అయన చెప్పే విషయాలు కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. ఉదాహరణకి రెండు రూపాయలకు కిలో బియ్యం మరియు ఉచిత కరెంటు. ఉచిత కరెంటు కోసమై రెండొందల కోట్లు కర్చవుతుంది. రెండు రూపాయలకు కిలో బియ్యం ఉచితంగా పంచి పెట్టినా కర్చు 800 కోట్లు మించదు. అంటే లక్ష కోట్ల బడ్జెట్ లో ప్రజలకు వీళ్ళు తాయిలం వేసేది వెయ్యి కోట్లు. మిగతాతొంభై తోమ్మిదివేల కోట్ల రూపాయలు నిరాటంకంగా కైంకర్యం చేయడానికి ఇదొక రాజ మార్గం. ఆయన్ రాండ్ అనే ప్రముఖ రచయిత్రి మాటల్లో చెప్పాలంటే, "సంక్షేమకర్యక్రమల పేరుతో నిరంకుశత్వానికి బాట వేయడం చాలా సులభం". ఇప్పుడు రాష్ట్రం లో అదే జరుగుతోంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల బూచి చూపుతున్నారు. వాళ