Skip to main content

Posts

Showing posts from March, 2009

ఓటు ఎవరికి వేయాలి?

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయ నాయకులు వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నగదు బదిలీ, కలర్ టీవీలతో అగ్ర భాగాన నిలిచింది. మొదట వంద రూపాయలకే ఇంటి సరుకులు వగైరా హామీలతో ముందుకొచ్చిన ప్రజా రాజ్యం పార్టీ వెనుక బడింది. కాంగ్రెస్ అయితే ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచిత కరెంటు పథకాలు, జలయజ్ఞం ఇప్పటికే ఆచరించి చూపాం అంటుంది. ఇప్పుడు బీజేపీ కొత్తగా సెల్ ఫోనులు, పదివేలకే లాప్ టాపులు, బ్రాడ్ బ్యాండ్ వగైరాలతో బయలు దేరింది. మిగతా వారితో పోల్చి చుస్తే ఇది కొంచెం హైటెక్ గా కనపడుతుంది.. ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారో మరి! నిజానికి ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలే. ప్రజోపయోగమైనవే. అయితే ముఖ్య మైన ప్రశ్న ఏమిటంటే ఇవి ఎంత వరకు ఆచరణ సాధ్యాలు? రైతులు, చేనేత కార్మికులు ఆత్మ హత్యలు చేసుకునే తరుణంలో కలర్ టీవీలు అవసరమా? రెండువేల రూపాయలు ఎవరికి ఇస్తారు? లబ్ది దారులను గుర్తించటానికి ప్రాతిపదిక ఏమిటి? నిజంగా గర్భ దరిద్రులకే ఆ సొమ్ము చేరుతుందని భరోసా ఏమిటి? గతంలో తెదేపా హయాములో పనికి ఆహార పథకం బియ్యం నాయకుల ఇళ్ళలోకి పోయాయన్న విషయం జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఆ

ఎన్నికలు, ఓటు విలువ

ఎన్నికల నోటిసు వచ్చిన తరువాత రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కు తున్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తామనే ధీమాతో వున్నారు. చిరంజీవి గ్లామర్ మరియు సంతర్పణ హామీలు, చంద్రబాబు ఎల్లలు దాటిన సంతర్పణ, రాజశేఖర్ రెడ్డి ఇదివరకే చేసివున్న సంతర్పణ లపై నమ్మకం పెట్టుకున్నారు. వీళ్ళ మాటల వరస చూస్తుంటే వీళ్ళకు ప్రజలు తమ కాళ్ళమీద తామే నిలబడడం కంటే బిచ్చగాళ్ళ లాగా అడుక్కుంటే ఎక్కువ సంతోష పడతారేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెపుతుంటారు. వీళ్ళు ఎక్కడినుంచి తెచ్చి ఇస్తారు? ప్రజల డబ్బేగా? మనం ఇంకా జమీందారీ వ్యవస్థ లో నుంచి బయటికి రాలేదని అనిపిస్తోంది. ఎంత సేపూ ఎవరో రావాలి, ఏదో ఇవ్వాలి అని కోరుకుంటాం. నిన్న ఓ టీవీ ఛానల్ లో చూపించారు... ఒకరు ఫ్రిజ్ ఇస్తే వోటేస్తాం అంటున్నారు, ఇంకొకరు మరోటి ఇస్తే వోటేస్తాం అంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారి మాటలలో చెప్పాలంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ని రాబోయే ఐదేళ్ళలో ప్రవేశ పెట్ట బోతుంది. మూడు కోట్ల మంది వోటేస్తే చాలు గెలవడానికి. అంటే ప్రతి ఓటు విలువ రెండు లక్షల ముప్పై వేల పైమాటే. తమ వోటుకు ఇంత విలువ ఉందని సామాన్యులకు తెలువడం