Skip to main content

Posts

Showing posts from August, 2010

మాన్ హోల్ కవర్లు

ఒక దేశ నాగరికతా వికాసం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఆ దేశంలోని రోడ్ల మీది మాన్ హోల్స్ చూస్తే సరిపోతుందేమో. ఇది నేను నవ్వులాటకు అనటం లేదు. నిజంగానే అంటున్నాను. మాన్ హోల్స్ అంటే చాలా అప్రధానమైన విషయం అని అనిపించవచ్చు. కాని రోడ్డు భద్రత విషయంలో ఇదొక ముఖ్యమైన విషయం. రోడ్డుమీద యధాలాపంగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాం. సడన్ గా  ముందు వాహనం కదిలి పోతుంది. అక్కడ యమకూపం లాంటి మాన్ హోల్ దర్శనమిస్తుంది. దాన్ని తప్పించడానికి స్టీరింగు కుడికో, ఎడమకో తిప్పుతాం, లేదా సడన్ బ్రేకు వేస్తాం. ఏం చేసినా రద్దీగా ఉండే రోడ్డుపై ఆక్సిడెంటు జరగడం ఖాయం. తర్వాత తిట్లూ, కొట్లాటలూ, కేసులూ మామూలే. ఒకవేళ ఆ యమకూపాల మీద నుంచి అలాగే పోదామా? టైర్లు పగలడమో, విడిభాగాలు విరిగిపోవడమో, ద్విచక్రవాహనమైతే క్రింద పడిపోవడమో ఖాయంగా జరుగుతుంది. అసలు మాన్ హోల్లు ఎలా వుండాలి? ఉదాహరణకు క్రింది బొమ్మలు చూడండి. ఇలాంటి మాన్ హోల్లు కట్టడం బ్రహ్మ విద్యా? రాకెట్ సైన్సా? కనీసం సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం కూడా అవసరం లేదు. తాపీ మేస్త్రీ పనితనం చాలు. కానీ మన మాన్ హోల్సు ఎలా ఉంటాయో పరీక్షిద్దాం. ఇది నేనేదో మనని మనం అవమానించుకోవడంగా భావించడం లేదు.