Skip to main content

Posts

Showing posts from December, 2009

తెలంగాణా

కాకతీయుల కాలంలో సుభిక్షమైన పరిపాలనకు నోచుకున్న తెలంగాణా తరువాత నవాబుల పాలనలోకి వచ్చింది. నాలుగు వందల సంవత్సరాల పాటు నిజాం కర్కశ పాలనకు కాకా వికలమైంది తెలంగాణా. నిజాం, అతని తాబేదార్లైన దేశ్ ముఖ్ లు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు తెలంగాణా ప్రజల ధన మాన ప్రాణాలను, కష్టాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. తెలంగాణా లో వీరు అమలు జరిపిన 'వెట్టి చాకిరీ', రోమన్ ల కాలం లోని బానిసత్వం కన్నా క్రూర మైనది. బానిసలకు కూడు పెట్టి పని చేయిస్తారు. కాని ఇక్కడ పని మాత్రమె చేయించుకునే వారు, కూడు ఎవరికీ వారే చూసుకోవాలి. ఎలాంటి ప్రతిఫలం లేకుండా ప్రతి ఇంటి నుండి దొరల పొలాల్లో, ఇళ్ళల్లో పనులు చేయించు కునే వారు. భారత దేశంలో నున్న ఇతర ప్రాంతాలు స్వతంత్ర వాయువులు పీల్చు కుంటున్నా తెలంగాణా బానిస బ్రతుకుల్లో మార్పు రాలేదు. కాశ్మీరు కోసం, జునాగడ్ కోసం తీరిక లేకుండా ప్రయత్నాలు చేసిన నెహ్రు, పటేల్ ద్వయం తెలంగాణా గురించి పట్టించుకోలేదు. చివరి ప్రయత్నంగా ప్రజలు సాయుధ పోరాటానికి దిగారు. మూడు వేల గ్రామాలను విముక్తం చేయగా దొరలంతా హైదరాబాదులో తల దాచుకొన్నారు. చివరికి హైదరాబాదును ముట్టడించిన తరుణంలో నెహ్రు, పటేల్