Skip to main content

Posts

Showing posts from May, 2010

అడవులు

ఈ మధ్య ఒక శుభ కార్యానికి హాజరు కావడానికి వరంగల్ జిల్లాలోని ఒక ఊరికి వెళ్లాను. ఇదివరలో చూసినప్పుడు ఆ వూరిలో నిండుగా చెట్లు ఉండేవి. ఈ సారి ఒక్కటి కూడా కనపడక పోయేసరికి ఊళ్ళో ఒకతన్ని విషయం అడిగాను. 'ఏం చెప్ప మంటారు సార్. పనికి ఆహార పథకం కింద ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నారు.' అని సమాధానం. పనికి ఆహార పథకం క్రింద ఉన్న పనుల్లో చెట్లు నరకడం ఒకటి. డబ్బులు పంచుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి కనపడిన చేట్టునల్లా నరికేస్తున్నారు. దీనివల్ల ఊరికి, పర్యావరణానికి ఎంత అపకారం జరుగుతుందో ఎవరికీ పట్టడం లేదు. నలభయ్యేడు డిగ్రీల ఉష్ణోగ్రత. ఎండా భగ భగ మండి పోతుంది. నిలబడదామంటే చెట్టు కనిపించ లేదు. 'ఊళ్ళో చెట్లు సరే, మరి ఇళ్ళల్లో చెట్లు ఏమయ్యాయి?' మళ్ళీ అతనే చెప్పాడు. 'ఈ మధ్య ఊరిలో వాస్తు పిచ్చి ఎక్కువయ్యింది. ఇంట్లో ఉండ కూడదని మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, యూకలిప్టస్ చెట్టు, పొప్పడి చెట్టు... ఇలా రక రకాల చెట్లను నరికేస్తున్నారు.' నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎవరు ఏది చెపితే అది నమ్మే ఈ జనం ఎప్పుడు బాగు పడతారో అర్థం కాదు! పల్లెటూళ్ళలో విద్యాగంధం లేని ప్రజలు ఇలా చేస్తుం

పద్యం: క్షామం

ఆంధ్రామృతం బ్లాగులో పెద్దలు చింతా రామకృష్ణారావు గారు ఇచ్చిన సమస్య "క్షామము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్"    కి నేను చేసిన పూరణం. ఉ. 'సీమ'ను క్షామ మెక్కువని చెప్పుచు కొందరు; కాదు కాదు మా సీమన క్షామ మెక్కువని చెప్పెద రింకొక ప్రాంత నాయకుల్; క్షామము తాండవించుటకు కారణ మౌదురు, ఓటు కింత శి క్షా? మము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్.

కసబ్ కి ఉరిశిక్ష తక్కువా?

కసబ్ కి ఉరిశిక్ష విధిస్తూ కోర్టులో తీర్పు వెలువడిన దరిమిలా రక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ శిక్ష సరిపోదని, అసలు ఖండ ఖండాలుగా నరికి కాకులకు, గద్దలకు వేయాలని; మరికొందరు చావనీయ కుండా, బ్రతుకు అంటే అసహ్యం కలిగేలా చిత్ర హింసలు పెట్టాలని; ఇంకొందరు ముస్లిం ఆచారాల ప్రకారం అంతిమ క్రతువు నిర్వ హించక పోతే సరిపోతుందని ఇలా రక రకాలుగా చెప్తున్నారు. అసలు కసబ్ ఎవరు? పాకిస్తాన్ లోని ఒక దరిద్రుల కుటుంబంలో జన్మించాడు. దారిద్ర్యం, అపరిమిత సంతానం అవిద్యకు, మూర్ఖత్వానికి దారి తీసాయి.  దుర్భర దారిద్ర్యం నేర ప్రవృత్తికి, దొంగ తనాలకు పురికొల్పింది. ఇలాంటి వారు టెర్రరిస్టులని తయారు చేసే ముష్కర మూకలకు శ్రేష్టమైన ముడిసరుకు అవుతారనేది జగమెగిన సత్యమే. చాలా సహజంగానే వారు ఇతన్ని తమ గుంపులోకి లాగారు. అందుకు ప్రతిఫలంగా ఇతని తండ్రికి డబ్బు ముట్టిందని కూడా వార్తలు ఉన్నాయి. చదువు, సంస్కారం లేని యితడు ఇస్లామిక్ తీవ్రవాద సాహిత్యాన్ని ఔపోశన పట్టి కరడు గట్టిన టెర్రరిస్టుగా మారాడని అనుకోలేం. ఇన్ని రోజుల విచారణలో కూడా ఈ విషయం తెలుస్తుంది. కసబ్ ఎన్నోసార్లు రక రకాల అబద్ధాలు చెప్పాడు. తానూ టెర్రరిస్టు కాదని, టూరిస్టు

సాయి బాబానా, దేవుడా?

యధాలాపంగా చానెళ్ళు తిరగేస్తుంటే ABN/ఆంధ్రజ్యోతి లో ఒక వింత చర్చ కనిపించింది. 'అందరి వాడేనా' అనే టైటిల్ తో ఒక సాయి బాబా భక్తుడు గారు, ఒక శాస్త్రులు గారిని కూర్చో బెట్టి యాంకరు వీర లెవెల్లో తతంగం నడిపిస్తున్నాడు. నేను మధ్యలో జాయినైనానేమో ముందేమీ అర్థం కాలేదు. చివరకి అర్థమైన సారాంశం ఇదీ. గుంటూరు జిల్లాకి చెందినా ఒక డాక్టరు గారు 'షిర్డీ సాయిబాబా అసలు హిందూ దేవుడే కాదు' అంటూ వాదం లేవ దీస్తూ ఒక పుస్తకం రాశాడట. దాంట్లో సాయిబాబా అసలు హిందువే కాదని, నిరంతరం 'అల్లా మాలిక్' అనుకుంటూ తిరిగిన వాడిని హిందువు లెందుకు పూజించాలని ఆయన ప్రశ్నలు లేవ దీశాడు. సనాతన ధర్మం రోజు రోజుకీ అటకెక్కి, జనం సాయి జపంలో మునిగి తేలుతున్న ఈ తరుణంలో కక్కా లేక మింగా లేక గుర్రుగా వున్న సనాతన వాదులకు దీంతో కొంత బలం చేకూరినట్టే కనిపిస్తుంది. అందుకే కాబోలు, శాస్త్రులు గారు వీర లెవెల్లో వాదన వినిపిస్తున్నారు. ఎప్పుడూ నాస్తికులకు, అస్తిత్వ వాదులకు మధ్యన జరిగే వాదనలు విని విని విసుగెత్తిన తరుణంలో ఇదేదో కొత్తగా బాగానే ఉందని పించింది. వార్తల చానెల్సుకి కూడా కొత్త విషయం దొరికి నట్లుంది, రెండు వైపులా బాగానే