Skip to main content

Posts

Showing posts from July, 2010

పద్యాలతో కుస్తీ

పదో తరగతి చదివేటప్పుడు తెలుగు టీచర్ అనంతాచార్యుల వారు చందస్సు నేర్పించారు. ఆ సందర్భంగా  ఆటవెలది పద్యాన్ని బోధిస్తూ, ఒక పద్య పాదాన్ని ఇచ్చి పూరించమని చెప్పారు. అది... 'ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు' చందస్సు నేర్చుకున్న ఆనందంతో సమధికోత్సాహంతో ఇలా పూరించాను.  ఆ. వె. ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు పాడునపుడు మనము పరవశించి  మేను పులకరించి మేఘ మధ్యంబునం దాటలాడుచున్న యట్లు దోచు తర్వాత ఇంగ్లీషు మీడియం చదువు, సాంకేతిక విద్య కావడంవల్ల పద్యాల గురించి పూర్తిగా మరిచే పోయాను. మళ్ళీ ఇలా బ్లాగులోకం లోకి వచ్చిన తర్వాతనే పద్యాలు రాయడానికి ప్రయత్నం చేశాను. చింతా రామకృష్ణా రావుగారి ఆశీర్వచనం, ఆచార్య ఫణీంద్ర గారి వద్ద శిష్యరికం, కండి శంకరయ్య గారి ప్రోత్సాహం లేకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ పద్యం రాసి ఉండే వాడిని కాదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగా వివిధ బ్లాగులలో నేను వ్రాసిన కొన్ని పద్యాలు. ఆ. వె. ఆశ లేని బ్రతుకు అడవిలో వెన్నెల ఆశ యందె కలుగు ఆశయములు ఆశ యుండు టెల్ల అత్యాశ కాబోదు ఆశ లోనె కలదు దేశ భవిత చం. సరుకులు కొందమన్న మరి చాలవు జీతపు డబ్బు లేటికిన్ తిరుగుద మన్న రోడ్లపయి త