Skip to main content

Posts

Showing posts from October, 2009

కడప జిల్లా పేరు మార్పు

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన జిల్లా కడప. రాయల సీమ ప్రాంతానింకి చెందిన ఈ ప్రాంతానికి ఎప్పటినుంచి గుర్తింపు ఉందో ఇదమిద్ధంగా తెలియక పోయినా రామాయణంలోని కిష్కింధ కాండ ఈ ప్రదేశం లోనే జరిగినట్లు చెపుతారు. 7వ శతాబ్దంలో చైనా చరిత్ర కారుడు హుయాన్ త్సాంగ్ ఇక్కడ పర్యటించి గ్రంథస్తం చేసినట్టు తెలుస్తుంది. కనీసం పదవ శతాబ్దం నుంచి ఈ పేరుతొ ప్రసిద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. పదకొండవ శతాబ్దం నుండి చోళుల ఆధీనం లో ఉన్న కడప పధ్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. దరిమిలా క్రీ శ 1565 లో నిజాం చేత ఆక్రమించుకో బడింది. క్రీ శ 1800 లో నిజాం నవాబు సీడెడ్ జిల్లాలలో భాగంగా దీన్ని బ్రిటిష్ వారికి సమర్పించాడు. 1820 నుండి 1829 వరకు జిల్లా కలెక్టరు గా ఉన్న సి.పి.బ్రౌన్ ఇక్కడి భాష, సంస్కృతుల పై విశేష కృషి జరిపాడు. బ్రిటిష్ వారి హయాం లో Cuddapah గా వ్యవహరించ బడిన జిల్లా పేరును 2005 ఆగస్టు 19 నుండి తిరిగి అధికారికంగా Kadapa గా మార్చారు. ఈ ప్రాంతం యోగి వేమన, అన్నమా చార్యులు, పోతులూరి వీర బ్రహ్మం, కవయిత్రి మొల్ల మొదలైన గొప్ప కవులు, వాగ్గేయ కారులకు పుట్టినిల్లు. వీర

ఎవరిదీ పాపం?

కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల్లో గత ఇరవై నాలుగ్గంటలుగా జరుగుతున్న దారుణ విలయం, అలాగే విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పొంచి వున్న ముప్పు కేవలం ప్రకృతి విలయం కాదనే విషయం హృదయాన్ని కలచి వేస్తుంది. ఈ పరిస్థితికి కారణం అహంకార పూరిత రాజకీయం, అధికారుల నిర్లక్ష్యం అని టీవీల్లో పేపర్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను. సుంకేసుల ఆనకట్ట నిండింది. అయినా గేట్లు తెరుచు కోకుండా మొరాయించాయి. ఫలితంగా మట్టికట్ట తెగిపోయి నీరు పొంగి పొర్లింది. ముందుగా కర్నూలు మునగడానికి ఇదే కారణం. వేసవి కాలం లో గేట్లకు సరియైన నిర్వహణ, పరిశీలన జరిపి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. శ్రీశైలం ప్రాజెక్టు పన్నెండవ గేటు ఇప్పటి వరకు తెరుచు కోలేదు. బాగా తుప్పు పట్టి తెరుచుకోక, ఒక ఉపకరణం విరిగి పొతే వెల్డింగు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదీ మన సన్నద్ధత. కొత్త ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించ డానికి ఉబలాట పడే ప్రభుత్వం పాత ప్రాజెక్టులు, చెరువుల మరమ్మత్తులకు పైసా విదిలించటం లేదని ఆరోపణ. నాగార్జున సాగర్ నీటిని నిలువ చేయడానికి ఉద్దేశించ బడింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని నిలువ చేయ డానికి రూపొ