Skip to main content

Posts

Showing posts from October, 2010

అయేషా మీరా హత్య కేసు

అయేషా మీరా హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధించబడిన సత్యం బాబు కన్ఫెషన్ వీడియో ఇది. ఈ కేసు విచారణలో ప్రత్యక్ష సాక్షులు గాని, సాక్ష్యాధారాలు గాని పోలీసులు ఏమీ సంపాదించ లేక పోయారు. ఈ కన్ఫెషన్ వీడియో, మరియు ఇతర సాంకేతిక పరమైన సాక్ష్యాలు తీర్పుకోసం పరిగణలోకి తీసుకున్నట్టు టీవీ ద్వారా విన్న సమాచారం. నాకు న్యాయ పరమైన విషయాలు పెద్దగా తెలియవు. కాని ఒక సామాన్యుడిగా పరిశీలించినా, ఈ కేసులో దర్యాప్తు గాని, విచారణ గాని న్యాయబద్ధంగా జరిగాయని అనిపించడం లేదు. ఎంతటి నేరస్తుడైనా, తాను చేసిన నేరాన్ని వివరిస్తున్నప్పుడు ఏదో ఒకలాంటి భావోద్వేగానికి గురి కావడం సర్వ సాధారణమైన విషయం. చేసిన డానికి పశ్చాత్తాపానికైనా గురవుతాడు, ఉన్మాదిగా నైనా మాట్లాడతాడు, ఏడుస్తాడు, లేదా గర్వంగా చెపుతాడు. కాని పై వీడియోలో చూస్తే సత్యం బాబు ఎలాంటి భావోద్వేగాలకు గురికాకుండా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పోలీసుల వైపునుండి ఒక్క ప్రశ్న కూడా లేకుండా కథంతా పూసగుచ్చినట్టు చెప్పడం కూడా ఎవరో నేర్పించినట్టుగా లేదూ? వెనక వైపున ఒక లుంగీనో దేన్నో బ్యాక్ డ్రాప్ గా కట్టారు. ఇది కూడా అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ పోలీసు స్టేషన్ ల