Skip to main content

Posts

Showing posts from January, 2010

సంయమనం

గత నెల రోజులుగా ఆంధ్రాలో, తెలంగాణాలో జరుగుతున్న ఉద్యమాలలో ఒక పదం మరీ మరీ వినిపించింది. ఈ పదాన్ని పలకడానికి అటు టీవీ యాంకర్లు, ఇటు రాజకీయ వాదులు, మరోవంక పోలీసులు విపరీతంగా శ్రమించారు. అదేదో గొప్ప చాలా పెద్ద పదం అనుకుంటే పొరపాటే. ఆ పదమే 'సంయమనం'. దీన్ని ఎన్ని రకాలుగా పలికారో చూద్దాం. సయ్యమనం సైమయనం సమ్మయనం సమయమనం సైమానం ... ఒక పదాన్ని ఇన్ని రకాలుగా పలుకు తున్నారంటే దాంట్లో క్లిష్టత ఉండ బట్టే కదా? హిందీ వాడు కూడా ఈ సంస్కృత పదాన్ని संयम ( తెలుగు లో పలికితే 'సయ్యం' అవుతుంది) గా మార్చి చేతులు దులిపేసు కున్నాడు. మనకు మాత్రం అంత కష్టమైన పదం ఎందుకూ అని? ఇదే కాదు ఇలాంటి నోరు తిరగని పదాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటి వలన ఉచ్చారణా దోషాలు ఎలాగూ తప్పవు, సంభాషణా వేగం, స్పష్టత కూడా లోపిస్తుంది. దురదృష్టమేమో కాని మనం మాత్రం కష్టమైన పదాలని సరళీకరించు కోవడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయం. రచయితలు, పండితులు, పత్రికల వారు (ఈ మధ్య అందరి కన్నా ఎక్కువగా భాష మీద ప్రయోగాలు చేస్తున్నది వీరే!) కష్ట మైన పదాలకు సరళమైన రూపాంతరాలను తయారు చేసి వాడ వలసిందిగా నా కోరిక. వీరు వదిలేస్తే ఆ పని టీవీ యాంకర్లు ఎలాగూ