Skip to main content

Posts

Showing posts from November, 2009

తెలుగు భాష, పదజాలం

తెలుగు భాషలో ఇంగ్లీషు పదాలు ఉండాలా ఒద్దా అనే విషయం మీద ఇటీవల తర్కాలు బాగా జరుగుతున్నాయి. దీంట్లో కొంతమంది తెలుగు భాష లో ఇంగ్లీషు పదాలు కలపాలని, కొంత మంది కొత్త పదాలు తయారు చేయాలని అంటున్నారు. రైలు, బస్సు, కారు, కరెంటు లాంటి పదాలు ఎంతగా వాడుకలోకి వచ్చాయంటే వాటికి బదులు వేరొక సులభమైన తెలుగు పదం తయారు చేసైనా సరే, వాడుకలోకి తేవడం అంత సులభమైన విషయం కాదు. అలా అని ఇంగ్లీషు పదాలను తెలుగు లోకి దిగుమతి చేస్తూ పోతుంటే, చివరికి తెలుగులో తెలుగే మిగలకుండా పోయే ప్రమాదం ఉంది. తాడేపల్లి గారు ఇక్కడ చెప్పినట్టుగా ఇంగ్లీషు పదాల్ని అరువు తెచ్చుకున్నా కూడా ఆ పదాల్ని పునర్నిర్మితం చేసి మరిన్ని కొత్త పదాలను తయారు చేసుకోలేక పోతున్నాం. ఇక తెలుగు పదాల్ని సృష్టించ డానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వారంతా ఎంతో అభినంద నీయులే అయినప్పటికీ, ఈ పదాలకు ఒక దిశా నిర్దేశం లేదేమో అనిపిస్తుంది. ఎవరికీ వారే ఏదో కొన్ని పద బంధాలని కలిపి, లేదా అచ్చులను, హల్లులను కలిపి ఒక శబ్దాన్ని తయారు చేసి, పదాలను పుట్టిస్తున్నారు. అయితే కొంతమంది మేధావులు శాస్త్రీయంగా సంస్కృత పద బంధాలను, ధాతువులను, వ్యాకరణాన్ని ఆకళింపు చేసుకొని పదా