Skip to main content

Posts

Showing posts from August, 2009

సత్యాన్వేషణ, రాగ ద్వేషాలు

'వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, చెప్పగలవాడు పుట్టలేదురా...' అన్నాడో సినీ గేయ కవి. ఎంత నిజం! గుడ్ అంటే ఏమిటి? సత్యం. సత్యం అంటే? నిజం. నిజం అంటే? ... మళ్ళీ సత్యానికొద్దాం. సంస్కృతంలో 'సత్' అంటే మంచి అనే అర్థం ఉంది. అంటే మంచి చేసేదే సత్యం, నిజమూను. మళ్ళీ మొదటికోచ్చామా? ఏది మంచి? ఏది చెడు? మంచి పని అంటే ఏమిటి? మనకు లాభం జరిగితే మంచా? నష్టం జరిగితే చెడా? మనకు నష్టం జరిగినా ఇతరులకు లాభం జరిగితే? దాన్నేమనాలి? ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రకారం ఎక్కువమందికి ఏది లాభం జరిగితే అదే మంచా? మరి తక్కువ మంది విషయమో? ఉదాహరణకు శ్రీలంకలో తమిళులు తక్కువ శాతం ఉన్నారు. అక్కడి చట్టాలు సింహళులకు మంచి చేసేవిగా ఉన్నాయి. అది మంచేనా? అంతెందుకు? మనం ఆఫీసులో ఎక్కువ గంటలు పనిచేస్తే ఆఫీసరుకు మంచి. ఇంట్లో ఎక్కువ గంటలు గడిపితే కుటుంబ సభ్యులకు మంచి. ఇలా ఆలోచించుకుంటూ పోతే... మంచి, చెడుల మధ్యన ఎంత అస్పష్టత దాగి వుందో తెలుస్తుంది. ఈ మంచి, చెడుల గురించిన ఆలోచనలు మనిషి ఆలోచించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్నాయనిపిస్తుంది. అన్ని మతాలు, అన్ని ఇజాలు తాము చెప్పేదే మంచి అని బోధిస్తాయి. నిజానికి