Skip to main content

Posts

Showing posts from February, 2009

రాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

ఇప్పుడు బరిలో ఉన్న ముఖ్యమైన పార్టీల గుణగణాల పై ఒక పరిశీలన. కాంగ్రెస్ పార్టీ : ప్రస్తుతం ఈ పార్టీ తో ఏ ఇతర ప్రముఖ పార్టీ చేతులు కలపడానికి భయపడుతుంది. కారణం (ఎన్ని అభివృద్ది పనులు చేసినప్పటికి) ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పార్టీనేతల కుంభకోణాలే. ఈ పార్టీ పాలనలో జలయజ్ఞం, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచితవిద్యుత్తు మొదలైన కార్యక్రమాలు ఎంతో కొంత అమలైన మాట వాస్తవం. వీటి వల్ల లబ్ది పొందినవారు ఈ పార్టీ కే వోటు వేయడం సహజం. అయితే ఆలోచనా శీలురైన ప్రజలు ఈ పార్టీ అవినీతిపనులను ఎంతవరకు సమర్థిస్తారు అనే విషయం వేచి చూడాల్సిందే. తెలుగు దేశం - మహా కూటమి : ఈ కూటమి ప్రస్తుతం కాంగ్రెస్ కుంభ కోణాలను ఎండగట్టడంలో తల మునకలై ఉంది. ఇది మంచి వ్యూహమే ఐనప్పటికీ గతంలో చంద్ర బాబు పాలనలోనిఅవినీతి, కుంభ కోణాలు ఒక పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాక వీరు ఎంత సేపు వీరుఅవినీతి పై పోరాటం సాగిస్తున్నా మంటున్నారు కాని, అధికారం లోకి వస్తే నీతివంతమైన పరిపాలనకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పడం లేదు. దానికి తోడు తెలంగాణా ఇవ్వాలా వద్దా అనే వాదోప వాదాలు ఎలాగూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ వ్యతిరేకులకు ఈ కూటమి బలమైనప్రత్యా

వ్యాపార ప్రకటనలు, మీడియా బాధ్యత

ఎలక్షన్లు దగ్గర పడే కొద్ది విపరీతమైన రాజకీయ 'వ్యాపార' ప్రకటనలు టీవీలో, పత్రికలలో కనిపిస్తున్నాయి. అధికార పక్షమైతే ఏకంగా ప్రజల డబ్బు తోనే ప్రకటనలు గుప్పిస్తుంది. అయితే ఇప్పుడు ప్రకటించడంలో కూడా కొత్త ధోరణి కనిపిస్తోంది. దిన పత్రిక లోనైతే మకుటం (హెడ్ లైన్) రూపంలో, టీవీలోనైతే వార్తల మధ్యన ఒక వార్తగా స్ఫురించేటట్లుగా వేయించు కుంటున్నారు. నిజానికి ఇలాంటి ప్రకటనలు, అది ప్రకటన అని తెలిసే విధంగా ఒక మూల స్పష్టంగా వ్రాయాలి. కాని ఎక్కువ ప్రీమియం వల్లనో ఏమో కాని, పత్రికల వారు, టీవీ వారు అది కూడా విస్మరిస్తున్నారు. దురదృష్ట వశాత్తు మన దేశంలో ఎక్కువ మంది ఇంకా అమాయకపు ప్రజలే. ఇలాంటి ప్రకటనలు వారు నిజమైన వార్తలుగా నమ్మే అవకాశం ఎక్కువ. ఆ విధంగా ఇవి ప్రజల ఆలోచనలను కృత్రిమంగా ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. ఇలాంటివి ప్రకటనలు వేసేటప్పుడు అవి ప్రకటనలని తెలిసేటట్టుగా జాగ్రత్త వహించడం మీడియా యొక్క కనీస బాధ్యత.

అవినీతి భాగోతం

రాజశేఖర్ రెడ్డి వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఈ రోజు పెద్ద గొడవ జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలలో ఎంతో కొంత నిజం తప్పకుండా వుండే అవకాశం ఉంది. అయినా ఎంతో పరిశోధించాల్సిన అవసరం లేదు. కళ్ళముందే వట వృక్శాల్లా పెరిగి పోతున్న ఆయన బంధువుల కంపెనీలే చెపుతున్నాయి. అయితే రాజశేఖర రెడ్డి ఎదురు దాడిగా చంద్రబాబు పై చేసే ప్రతి ఆరోపణలకు కొంతమంది ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్ర బాబు కూడా అవినీతి పరుడే అయినప్పటికీ అది ఇప్పుడు అంత ప్రస్తుతం కాదు. ఎందుకంటే అధికారం లోకి వచ్చే వరకు రాజశేఖర రెడ్డి చంద్రబాబు పై ఎన్నో ఆరోపణలు చేసాడు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో ఏ లాంటి చర్యలూ తీసుకోలేక పోయాడు. పైగా తనపై వచ్చిన ఆరోపణలకు ప్రత్యారోపణలతో జవాబివ్వడం నిజంగా సిగ్గు చేటయిన విషయం. అయితే వీరిదరు సృష్టిస్తున్న గందరగోలాన్ని మనం తప్పక గమనించాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంతటి ఆరోపణలు చేస్తున్న చంద్ర బాబు కుడా రేపు అధికారం లోకి వస్తే రాజ శేఖర రెడ్డి పై చర్యలు తీసుకుంటానని స్పష్టమైన హామీ యివ్వటం లేదు. ఇక చిరంజీవి అంటారా, ఎంత సేపూ ఇతరుల అవినీతి గురించి మాట్లాడుతాడే కాని తాను నీత

అవినీతా అసమర్థతా

రోజూ ఆఫీసుకి వెళుతూ వుంటాం, ఇంటికి వస్తూ వుంటాం. తొందరలో పడి ఏది పూర్తిగా గమనిచం. గమనిచినా పట్టించుకోం. ఉదాహరణకి... మాన్ హోల్ కవర్లు ఎప్పుడూ రోడ్డుకి నాలుగు ఇంచులు లోపలికో, నాలుగు ఇంచులు బయటికో ఎందుకు వేయబడి ఉంటాయ్? రోడ్డుకి సమాంతరంగా వేసే టెక్నాలజీ ఇంకా మనకు లేదా? కొన్ని చోట్ల అమాంతంగా రోడ్డు ఎందుకు కురచ బడి పోతుంది? రోడ్డుకి ఏ స్మశానమో, మరోటో ఎందుకు అడ్డంగా వుంటుంది? అసలు రోడ్డు కూడా ఏ ముఖ్య కేంద్ర నాయకుడో, అంతర్జాతీయ నాయకుడో వచ్చినప్పుడే ఎందుకు వేయబడుతుంది? ఉన్నవి మైంటైన్ చేయటానికి, కొత్తవి వేయటానికి నిర్నీతమైన గడువులేమీ వుండవా? కొత్తగా వేసిన రోడ్డుని తవ్వి పోసి నిటి సరఫరా పనులో, కేబుల్ వర్కో చేస్తుంటారు. మళ్ళీ ఆ రోడ్లను వేయరు. వేసినా కూడా నాసిరకంగా వేస్తుంటారు. ఏదయినా పని చేసిన తర్వాత యధావిధంగా రోడ్డును పునరుద్ధరించాలని కాంట్రాక్టులో ఉండదా? ఉన్నా అమలుకాదా? ఫుట్ పాత్ మీద మొత్తం ఆక్రమణలు ఉంటాయి. వీటిని ఎవరు తొలగించాలి? కొన్ని చోట్ల ఫుట్ పాత్ మాత్రమే కాక రోడ్డు కూడా రెండు మూడు గజాల వరకు అక్రమించుకోబడి ఉంటుంది. కరెంటు స్థంభాలకి కేబుల్సు సాలె గూడులా వేలాడుతుంటాయి. వీటిని ఎవరు పట్టించుక

ఓటరులో పరివర్తన రావాలి

ఈరోజు టీవీలో జయప్రకాష్ నారాయణ గారి కార్యక్రమం చూసాను. అయన చెప్పే వాస్తవాలు విటుంటే కళ్లు తిరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో మార్పూ రావాలనే కోరిక ఉంటుంది. అయితే నా ఒక్కడివల్ల ఏం అవుండానే నిర్లిప్తత ఉంటుంది. దీన్ని అవకాశవాద రాజకీయ పార్టీలు బాగా ఉపయోగించు కుంటున్నాయి. ఆయన విశ్లేషణ వింటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. వచ్చే బడ్జెట్ లో 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే ఒక ఓటు పై దాదాపు రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయల డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి అవినీతినే ఆశయంగా మలుచుకున్న పార్టీలు ఓటు పై వందో వెయ్యో ఖర్చు చేయడానికి వెనుకాడవు. ఈవిషయాలను సామాన్య ప్రజానీకానికి ప్రతి ఆలోచించే వ్యక్తీ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమ ఓటును సక్రమంగా వినియోగించ గలిగిన నాడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం స్ద్ధిస్తుందని చెప్పితే అతిశయోక్తి కాదు.

గాంధీ భవన్, భీంరావ్ భాడా

ఈరోజు అసెంబ్లీ లో చర్చ చూసాను. గాంధీ భవన్ కి స్థలం అవసరమైంది, పార్టీ ఆఫీసు సరిపోవటం లేదు కాబట్టి. గవర్నమెంటు స్థలం ఇవ్వడానికి పూనుకొంది. గవర్నమెంటు స్థలం ఇస్తే ఏ గొడవా లేదు. అయితే గాంధీ భవన్ కి ఆనుకొని గవర్నమెంటు స్థలం లేదు కాబట్టి వెనుకనే ఉన్నా బస్తి లో 90 సంవత్సరాలుగా ఉంటున్న పట్టాదరులైన ప్రజల ఇళ్ళను బలవంతంగా ఖాళీ చేయించారు. వీరికి 350 గజాలలో మరో మురికివాడ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఇంకో విషయమేమంటే దీనికోసం 13 కోట్ల ప్రజల డబ్బుని వెచ్చించారు. ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు తప్పక స్ఫురిస్తాయి. పార్టీ ఆఫీసు లకి భూములు కేటాయించే విషయంలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ప్రభుత్వం ఎంత కావాలంటే అంత భూమి కేటాయించు కోవచ్చా? ప్రభుత్వ భూమి మాత్రమే ఇవ్వాలా? ప్రజలవద్దనుచి బలవంతంగా లాక్కుని ఆయా పార్టీలకు అవసరమైన చోట మాత్రమే ఇవ్వాలా? భూమిని ఇవ్వడమే కాక ప్రత్యేకమైన భూములు మాత్రమే ఇవ్వడానికి అవసరమైన మరికొంత ధనం వెచ్చించ వచ్చా? ప్రజలు తమ ఇళ్ళను ఖాళీ చేయడానికి వ్యతిరేకించినా (వారు చట్టపరంగా అ భూమికి అధికారులు... పట్టాదారులు) బలవంతంగా ఖాళీ చేయించే వెసులుబాటు ఉంటుందా? మనిషికి చట్టపరంగా తానూ కట్టుకున్న

భయంకరంగా మారిన అవినీతి

రోజూ పేపర్లో చూస్తుంటే అవినీతి కుంభ కోణాలు ఎంతగా పెరిగి పోయాయో తెలుస్తూంది. అవినీతి లక్షలు దాటి కొట్లలోకి అది కూడా పదులు వందలు దాటి వేల కోట్ల లోకి పెరిగింది. దీనికి అంతం ఎప్పుడైనా వుంటుందా అని అనిపిస్తుంది. ఎందుకని ఎవరికీ దీనిగురించి చీమకుట్టినట్టైనా వుండదో అని ఆశ్చర్య మేస్తుంది. ప్రతి పార్టీ అవినీతిని అంతం చేస్తానని అంటుంది, రూలింగ్ పార్టీతో సహా! ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టం, సారా పోయించం అని ఒక పార్టీ కూడా చెప్పదు. ఎందుకంటే వాళ్లకు బాగా తెలుసు. ఇవి లేకుండా ఎలెక్షన్ లో గెలవడం అసాధ్యమని. మన ప్రజల తెలివి తేటలు, జ్ఞాపక శక్తి మీద వీరికి అపారమైన నమ్మకం, విశ్వాసమూను. అధికారం లో వుండి ఏమి చేసిన కూడా మళ్లీ ఒక నోటు, కొంత మద్యం పంపిణి చేస్తే చాలు, గెలిచి పోతామని ఎక్కడ లేని ధీమా. దురదృష్ట వశాత్తు దాన్నే నిజం చేస్తున్నారు మన ప్రజలు. ఈనాయకులు ఇచ్చే డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయనే విషయం ఒక్కసారి ఆలోచిస్తే ఎవరికి అర్థం కాదు? ఈ ప్రజలు అన్నీ అర్థమయ్యీ సరేలే అనుకుంటున్నారా, లేక ఏమీ అర్థం కాక సరేలే అనుకుంటున్నారా? అర్థం కాదు. నాకనిపిస్తుంది, దీనికి మూలాలు తరతరాలుగా మగ్గిన భూస్వామ్య శృంకలాల్లో ఉన్నా