ఈరోజు టీవీలో జయప్రకాష్ నారాయణ గారి కార్యక్రమం చూసాను. అయన చెప్పే వాస్తవాలు విటుంటే కళ్లు తిరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో మార్పూ రావాలనే కోరిక ఉంటుంది. అయితే నా ఒక్కడివల్ల ఏం అవుండానే నిర్లిప్తత ఉంటుంది. దీన్ని అవకాశవాద రాజకీయ పార్టీలు బాగా ఉపయోగించు కుంటున్నాయి. ఆయన విశ్లేషణ వింటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. వచ్చే బడ్జెట్ లో 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే ఒక ఓటు పై దాదాపు రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయల డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి అవినీతినే ఆశయంగా మలుచుకున్న పార్టీలు ఓటు పై వందో వెయ్యో ఖర్చు చేయడానికి వెనుకాడవు. ఈవిషయాలను సామాన్య ప్రజానీకానికి ప్రతి ఆలోచించే వ్యక్తీ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమ ఓటును సక్రమంగా వినియోగించ గలిగిన నాడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం స్ద్ధిస్తుందని చెప్పితే అతిశయోక్తి కాదు.
భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.