Skip to main content

Posts

Showing posts from May, 2009

అవినీతి మంత్రులకే తిరిగి పట్టం

కరుణానిధి చివరికి పంతం నెగ్గించుకున్నాడు. ఎ. రాజా, టి. ఆర్. బాలు తిరిగి కేంద్ర మంత్రులు కాబోతున్నారు. పరమ అవినీతి పరులని మన్మోహన్ సింగ్ మొత్తుకున్నా అతని మాట కరుణానిధి లెక్క చెయ్య లేదు. ఆ క్వాలిఫికేషనే DMK అధినేత వత్తిడికి ముఖ్య కారణం అని వేరే చెప్ప నవసరం లేదను కుంటాను. బాలు స్వయంగా తన కొడుకు కంపెనీకి గ్యాస్ సరఫరా కుంభకోణంలో ఇరుక్కుంటే, రాజా ఏమో 60,000 ల కోట్ల రూపాయల స్పెక్ట్రం అలోకేషన్ కుంభకోణం లో పాత్ర ధారి. ఇప్పుడు అవినీతి పూర్తిగా వ్యవస్తీకృత మైందన్న విషయానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదేమో? అధినేతలకు గాని, వారి అనుచరులకు గాని తమ అవినీతి భాగోతాలను ప్రజలు చూస్తున్నారన్న భయం ఏమాత్రం లేదు. వారు ఎంత సేపు ఎంత ఎక్కువ డబ్బు సంపాదించి వచ్చే ఎన్నికల్లో కొంత ఖర్చు పెట్టి నెగ్గుదామా అనే చూస్తున్నారు. అవినీతి వల్ల తాము ఓడిపోతామేమో అన్న ఆలోచనే లేదు. ఎన్ని అవినీతి కుంభకోణాలు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రబల సాక్ష్యంగా నిలుస్తుందాయే!

ఎన్నికల ఫలితాలు

ఎన్నికలు అయి పోయి ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ వారు తప్ప ప్రతి ఒక్కరు రాష్ట్రంలో హంగ్ వస్తుందనే అనుకున్నారు. కాని ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పీకల లోతు అవినీతిలో కూరుకు పోయి నప్పటికీ విజయం సాధించడం ఏ విపరిణామాలకు దారి తీస్తుందో నని భయంగా వుంది. చంద్రబాబు కాంగ్రెస్ అవినీతిపై పోరాటం చేసినప్పటికి అది ఆశించిన స్థాయిలో లేదు. కారణం సుస్పష్టం. చంద్ర బాబు ఏ విషయం లేవనెత్తినా కాంగ్రెస్ వారు దానికి ప్రతిగా గత తెలుగు దేశం పాలనలో జరిగిన ఉదంతాలను ఉదహరించి ఎదురు దాడికి దిగే వారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అంటే తామూ మచ్చ లేకుండా వుండటం ముఖ్యం. ప్రధాన ప్రతిపక్షంలో అది లోపించింది. పైగా కేంద్రంలో మన్మోహన్ సింగ్ మచ్చ లేని పాలన అందించడం కూడా కాంగ్రెస్ కి ఒక ప్లస్ అయింది. అంతకు ముందు తెదేపా పాలనలో అభివృద్ధికి కృషి జరిగినప్పటికీ అవినీతి, అట్టడుగు ప్రజానీకాన్ని, రైతులను పట్టించుకు పోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరింగింది. 2004 లో చంద్ర బాబు అధికారం లోంచి దిగి పోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు వ్యతిరేకత అలాగే వుంది. గత సంవత్సరంగా ఓటరులో మార్పు రాసాగింది. రాబందుల పాలన ఎలా వుం

ICICI బ్యాంకులో నా అనుభవం

క్రమంగా ప్రైవేటు రంగ సంస్థలు భారత దేశంలో ముందంజ వేస్తుంటే సంతోషించిన వాళ్ళలో నేను ఒకడిని. ఒకప్పుడు జాతీయ బ్యాంకులో DD తీయాలంటే గంటలకొద్దీ సమయం పట్టేది. అదే నిమిషాల్లో ప్రైవేటు బ్యాంకుల్లో ఇచ్చేస్తుంటే ముచ్చటేసేది. అయితే ఈ ప్రైవేటు బ్యాంకులు ఎంత ఘరానా గా దోపిడీ చేయ గలవో అనుభవం మీద తెలిసింది. మూడు సంవత్సరాల క్రితం నేను 9 లక్షలు గృహ ఋణం తీసుకున్నాను మారే వడ్డీ విధానం పై. అప్పుడు వడ్డీ 9.00 శాతంగా వుండేది. ఈ మూడు సంవత్సరాల్లో వాయువేగ మనో వేగాలతో వడ్డీ రేటు 13.00 శాతానికి పెంచారు. సరే రేపో రేటు పెరిగింది కాబట్టి పెంచారులే అనుకుంటే మిగతా బ్యాంకుల కన్నా చాలా ఎక్కువగా. ఇక వాయిదాలను చూస్తే జీవితాంతం కట్టినా ఇంకా మిగిలేలా పెంచేశారు, అలాగే వాయిదా మొత్తం కూడా. రేపో రేటు తగ్గిన తర్వాత కుడా చాలా కాలం మిన్నకుండి కేవలం అర శాతం తగ్గించి 12.5 శాతం చేసారు. ఇక ఇలా కాదని కొంత మొత్తం తీర్చేద్దామని రెండున్నర లక్షలు పట్టుకుని బ్యాంకుకి వెళ్లాను. బేగంపేటలో వీరికి ఒక కస్టమర్ రిలేషన్ సెంటరు ఒకటి వుంది. అక్కడికే వెళ్లాను. మామూలుగా నైతే అన్ని లావా దేవీలు counter లోనే జరుపుతారు. కాని ఆశ్చర్యకరంగా నన్ను లోపలి