Skip to main content

ఎన్నికల ఫలితాలు

ఎన్నికలు అయి పోయి ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ వారు తప్ప ప్రతి ఒక్కరు రాష్ట్రంలో హంగ్ వస్తుందనే అనుకున్నారు. కాని ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి.

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పీకల లోతు అవినీతిలో కూరుకు పోయి నప్పటికీ విజయం సాధించడం ఏ విపరిణామాలకు దారి తీస్తుందో నని భయంగా వుంది.

చంద్రబాబు కాంగ్రెస్ అవినీతిపై పోరాటం చేసినప్పటికి అది ఆశించిన స్థాయిలో లేదు. కారణం సుస్పష్టం. చంద్ర బాబు ఏ విషయం లేవనెత్తినా కాంగ్రెస్ వారు దానికి ప్రతిగా గత తెలుగు దేశం పాలనలో జరిగిన ఉదంతాలను ఉదహరించి ఎదురు దాడికి దిగే వారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అంటే తామూ మచ్చ లేకుండా వుండటం ముఖ్యం. ప్రధాన ప్రతిపక్షంలో అది లోపించింది. పైగా కేంద్రంలో మన్మోహన్ సింగ్ మచ్చ లేని పాలన అందించడం కూడా కాంగ్రెస్ కి ఒక ప్లస్ అయింది.

అంతకు ముందు తెదేపా పాలనలో అభివృద్ధికి కృషి జరిగినప్పటికీ అవినీతి, అట్టడుగు ప్రజానీకాన్ని, రైతులను పట్టించుకు పోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరింగింది. 2004 లో చంద్ర బాబు అధికారం లోంచి దిగి పోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు వ్యతిరేకత అలాగే వుంది.

గత సంవత్సరంగా ఓటరులో మార్పు రాసాగింది. రాబందుల పాలన ఎలా వుంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన తరువాత. చివరిసారి ఉప ఎన్నికల్లో ఆ రకమైన సంకేతం ఇచ్చాడు వోటరు. కాని ఎప్పటిలాగే వోటరు నాడిని అంచనా వేయడంలో చంద్రబాబు దెబ్బ తిన్నాడు. ప్రజలపై కన్నా కూటములపై, కుటిల రాజకీయాలపై ఎక్కువ విశ్వాసం కనబర్చాడు. సహజంగా ఇది ఓటరుకి నచ్చలేదు.

ఫలితం... బై ఎలెక్షన్లో గెలిచిన తలసాని, కడియం కుడా ఇప్పుడు ఓడి పోవడం.

తద్విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ప్రజలనే నమ్మాడు. తాను చేసిన కార్య క్రమాలను(!) ప్రజలు ఆమోదిస్తారని పూర్తిగా విశ్వసించాడు. అది ప్రజలకు బాగా నచ్చింది.

చంద్రబాబు చెప్పిన నగదు బదిలీ, కలర్ టీవీ పథకాలను విశ్వసించే స్థితిలో లేరు జనం. గతంలో ఎన్నో ఇలాంటి ప్రజాకర్షక పథకాలకు రాం రాం చెప్పిన చంద్రబాబును జనం ఇంకా మరిచిపోలేదు.

నగదు బదిలీ పథకం ప్రజలకు చేరలేదు అనే వాదన తర్క విరుద్ధం. ఈ రోజుల్లో టీవీ లో ఇలా ప్రకటన వస్తే అలా అందరికీ తెలిసి పోతుంది. అయితే తన సిద్ధాంతాలకు తానే తిలోదకాలిచ్సిన బాబులో వారికి పరిపక్వత కనిపించలేదు. ఏ ఎండ కా గొడుగు పట్టే వాడిలా కనిపించాడు.

ఇక ప్రజారాజ్యం లో సామజిక న్యాయం కన్నాసామజిక వర్గ ప్రాధాన్యం, టికెట్లు అమ్ము కోవడం, రాజకీయ ఉపన్యాసాలలో అపరిపక్వత అతన్ని హీరో కాకుండా జీరో చేసాయి.

ఈ ఫలితాలు తమ పాలనకు సర్టిఫికేట్ అని బొత్స లాంటి వారు ఇప్పటికే చెపుతున్నారు. వచ్చే ఐదేళ్ళలో పరిపాలన ఎలా వుంటుందో మనం తేలిగ్గానే ఉహించ వచ్చు.

ఒక సారి భవిష్యత్తులోకి వెళితే...

మూల విరాట్టు కుమారుడు ఈసారి సంపాదనలో ముఖేష్ అంబానీని మించి పోవచ్చు.

రాయల సీమ ఫ్యాక్షనిజం ఈసారి పూర్తిగా తుడిచి పెట్టుకొని పోవచ్చు, ఒకటే ఫ్యాక్షన్ ఉంటుంది కాబట్టి.

మక్కా మసీదు, లుంబిని, గోకుల్ చాట్ పేలుళ్ళ విచారణకు వచ్చే ఐదు సంవత్సరాలలో కూడా ఆతీ గతీ ఉండదు. పైగా ప్రతి సంవత్సరం మక్కా మసీదు కాల్పులకు ప్రతీకార హత్యలు యదాతథం. అఫ్గన్, స్వాత్ లోయలో చోటు లేని తాలిబాన్లకు పాత బస్తీ స్వర్గ ధామం కావచ్చు.

మిగిలిన ప్రభుత్వ భూములు పూర్తిగా కైంకర్యం, అయినా ప్రాజెక్టులకు డబ్బులు శూన్యం.

దేవాదుల లీకేజీలు మరింతగా పెరిగి రిపేరు వీలుకాదని ఇంజనీర్లు సర్టిఫికేట్ ఇవ్వ వచ్చు.

ప్రముఖ వార్తా పత్రిక ఆస్తులను కాపాడుకోవడానికి తన 'పద్ధతులు' మార్చు కోవచ్చు.

రోడ్లపై గుంటలు తప్పించు కుంటూ స్పీడుగా డ్రైవ్ చేయడం కుర్రకారుకు ఫ్యాషన్ అవుతుంది.

GHMC గా మారినందు వల్ల నిధులు పెరిగినా, వాటితో పాటు చెత్త కుప్పలు, డ్రైనేజీ సెలయేళ్ళు హైదరాబాదులో ఇబ్బడి ముబ్బడి గా కంపు కొడుతూనే ఉంటాయి. కుళాయిలలో మురుగు నీరు రాకుండా వుంటే వార్త అవుతుంది.

నిధుల కొరత వల్ల రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచిత కరెంటు పథకాలు అటకెక్క వచ్చు.

Comments

  1. Meeru mari chala badha padipothunnaru papam. good luck for all your wishes...

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ