Skip to main content

Posts

Showing posts from December, 2010

సమస్యాపూరణం

శ్రీ  కంది శంకరయ్య గారు నిర్వహిస్తున్న శంకరాభరణం బ్లాగులో ఇటీవల నేను చేసిన పూరణలు. ఆ.వె. జడలు ముడియ గట్టి జపమాల చేబట్టి దొంగ స్వామి నగరి దూరి నంత చేరె చక్రధరుని చెల్లియే తనచెంత కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె కం. మిడిమేళపు దొర యొక్కడు కడ గ్రేడు సిమెంటు వాడి కట్టగ డ్యామున్ నడిరేయి గండి పడెనట గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్! కం. ఏమూలో దాగిన కవి సాముగరిడి చేసె కంది శంకరు మహిమన్ ఆ మాన్యు ప్రోద్బలము చే పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్. కం. హవ్వా యనగను సిబియై చివ్వున బోఫార్సు కేసు చీపుగ మార్చెన్ ఇవ్విధమగు శోధనమున పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్ తే.గీ. రైతు మరచిన హైటెక్కు రాజకీయు డతని నోడించి నొక 'దేవు' కందల మిడ వేల కోట్లతో పుత్రు కుబేరు జేసె పామునకు బాలు వోసిన ఫలిత మిదియె? కం. తానధికారము నుండగ ఏనాడూ కానలేదు ఈయన రైతున్ కానగ రైతులపై అభి మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్. ఆ.వె. దారి తప్పుటెల్ల తప్పుకాదెచటను దారి మరచినంత తప్ప నగును దారి వెతికి వెతికి దరిజేరకున్నను దారి తప్పు వాడు; ధర్మ విధుడు తే.గీ. వీధి

లెఫ్టా రైటా?

పై కార్టూన్ ప్రముఖ Free Software Activist, మరియు Free Software Foundation సృష్టికర్త అయిన రిచర్డ్ స్టాల్మన్  వేసినది. కుడి వైపు రాళ్ళున్నా కూడా మరింత కుడికి పడవ నడపమని క్యాపిటలిస్టు ఎకానమిస్టులు ఉద్భోదించే విధానం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చెప్పబడింది. నది ఒక ఆర్ధిక వ్యవస్థ అనుకుంటే దానికి వామపక్షంలో (ఎడమవైపు) ఇసుక తిన్నెలు, దక్షిణపక్షంలో (కుడివైపు) బండరాళ్ళున్నాయి.  నావ పూర్తి ఎడమకి వెళ్ళితే ఇసుకలో చిక్కుకొని ముందుకెళ్ళడం కష్టం. అలాగే పూర్తిగా కుడివైపు వెళ్ళితే రాళ్ళకు గుద్దుకొని మొత్తానికే పగిలి, మునిగి పోతుంది. వామపక్షం వారు నావ (ఆర్ధిక వ్యవస్థ) పూర్తిగా ఎడమ వైపు నడపాలని, అలాగే క్యాపిటలిస్టులు నావను పూర్తిగా కుడి వైపు నడపాలని చెప్పడం ఈ కార్టూను చూసినప్పుడు అంతర్లీనంగా స్పురిస్తుంది. అలాగే మనలాంటి మూడవ ప్రపంచ దేశాలు మునిగి పోతాయన్నా పట్టించు కోకుండా అమెరికా, వరల్డ్ బ్యాంకు ఎలా మనని ఆపదల వైపు ఉసిగొల్పుతాయో వివరిస్తుంది ఈ కార్టూను. స్టాల్మన్ వేసిన మరిన్ని కార్టూన్లు ఇక్కడ  చూడొచ్చు.