పై కార్టూన్ ప్రముఖ Free Software Activist, మరియు Free Software Foundation సృష్టికర్త అయిన రిచర్డ్ స్టాల్మన్ వేసినది.
కుడి వైపు రాళ్ళున్నా కూడా మరింత కుడికి పడవ నడపమని క్యాపిటలిస్టు ఎకానమిస్టులు ఉద్భోదించే విధానం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చెప్పబడింది.
నది ఒక ఆర్ధిక వ్యవస్థ అనుకుంటే దానికి వామపక్షంలో (ఎడమవైపు) ఇసుక తిన్నెలు, దక్షిణపక్షంలో (కుడివైపు) బండరాళ్ళున్నాయి. నావ పూర్తి ఎడమకి వెళ్ళితే ఇసుకలో చిక్కుకొని ముందుకెళ్ళడం కష్టం. అలాగే పూర్తిగా కుడివైపు వెళ్ళితే రాళ్ళకు గుద్దుకొని మొత్తానికే పగిలి, మునిగి పోతుంది.
వామపక్షం వారు నావ (ఆర్ధిక వ్యవస్థ) పూర్తిగా ఎడమ వైపు నడపాలని, అలాగే క్యాపిటలిస్టులు నావను పూర్తిగా కుడి వైపు నడపాలని చెప్పడం ఈ కార్టూను చూసినప్పుడు అంతర్లీనంగా స్పురిస్తుంది.
అలాగే మనలాంటి మూడవ ప్రపంచ దేశాలు మునిగి పోతాయన్నా పట్టించు కోకుండా అమెరికా, వరల్డ్ బ్యాంకు ఎలా మనని ఆపదల వైపు ఉసిగొల్పుతాయో వివరిస్తుంది ఈ కార్టూను.
స్టాల్మన్ వేసిన మరిన్ని కార్టూన్లు ఇక్కడ చూడొచ్చు.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.