Skip to main content

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు. 

కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే.

అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా వ్యతిరేకతను తీవ్రవాదంగా మారుస్తూ విధ్వంసాలు సృష్టిస్తూనే ఉంటారు.

అమెరికాలో కనీ వినీ ఎరుగని పెను విధ్వంసం సృష్టించడానికి లాడెన్ కి కేవలం ముగ్గురు పైలట్లు సరిపోయారు. ఒక అగ్ర రాజ్యాన్ని భయకంపితం  చేయడం ఇంత సులువా అని ప్రపంచం మొత్తం ముక్కుమీద వేలు వేసుకున్నారు. కానీ దురదృష్ట వశాత్తూ ఆ సంఘటనతో అమెరికా పాఠాలేవీ నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. తన విశృంఖల సామ్రాజ్యవాద, వలసవాద మానవహననాన్ని విచ్చలవిడిగా కొనసాగిస్తూనే ఉంది.

లాడెన్ పాకిస్తాన్లోనే ఉన్నాడని, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ఇండియా ఎంత గోడుపెట్టినా అమెరికా చెవులకు ఆన లేదు. మనమాటలు విననట్టు నటిస్తూ పాకిస్తాన్ తో అంటకాగిన అమెరికా ఇప్పుడు ఆ దేశ రాజధానికి కూతవేటు దూరంలో లాడెన్ ని మట్టు బెట్టామని సిగ్గులేకుండా ప్రకటించు కొంటుంది. గత పదిసంవత్సరాలుగా లాడెన్ పాకిస్తాన్ ఆశ్రయంలో ఉన్న సంగతి అమెరికాకు తెలియదనుకోవాలా? దావూద్ ఇబ్రహీం వంటి తీవ్రవాద బ్రోకర్లకు ఆశ్త్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ తో స్నేహం చేస్తున్న  అమెరికా తాను తీవ్ర వాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నానని ప్రపంచాన్ని నమ్మించ జూడడం పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందం. 

బహ్రైన్లో, బర్మాలో ప్రజా ఉద్యమాలు పట్టని అమెరికాకు లిబియా, ఈజిప్టు దేశాలలోని ప్రజాస్వామ్యాల పై ఎందుకంత ప్రేమో అక్కడి నూనె బావుల నడిగితే వివరంగా చెప్తాయి. తన అడుగులకు మడుగులొత్తే  దేశాలు మాత్రమే ప్రజాస్వామ్య దేశాలన్న కొత్త నిర్వచనాన్ని తలకెక్కించు కున్న అమెరికాకు ఆయా దేశాల్లో నడుస్తున్న ప్రజాస్వామ్య ఉద్యమాలు ఎందుకు కనబడతాయి?

దాని కళ్ళకు ఇరాన్ ప్రమోట్ చేస్తున్న తీవ్రవాదం కనబడుతుంది కానీ, ఇండియాకు పాకిస్తాన్ ప్రమోట్ చేస్తున్న తీవ్రవాదం మాత్రం కనబడదు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలను ఇకనైనా అమెరికా వీడవలసిన అవసరం ఉంది. లేకుంటే ఒకరి తర్వాత మరొక లాడెన్ పుడుతూనే ఉంటారు, ఏదో ఒక రకంగా అమెరికాకు బుద్ధి చెప్తూనే ఉంటారు. 

తమ దేశానికి పూనిన బ్రహ్మ రాక్షసిని వదిలించ డానికి శాంతి కాముకులైన అమెరికన్ ప్రజలే పూనుకోవాలి. లేక పొతే రాక్షసులు పుడుతూనే ఉంటారు, చస్తూనే ఉంటారు.


Comments

  1. mare, aa madhya india lo religious freedom ledani tega vapoyaru vallu. vaallakee poye kalam vastundi. endukante "everythig that has a beginning..has and end"

    ReplyDelete
  2. Every weekend i used to pay a visit this web page, because i wish for enjoyment, since this this website conations actually nice funny data too.


    My blog :: http://www.web.e-kabza.pl

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ