Skip to main content

Posts

Showing posts from April, 2017

దోమవిలాపం

ఐదు కొట్టంగనే నేను యాది తోన ఆఫిసును వీడి దారియందంత వెదకి కొంటి నొకబ్యాటు దోమల కొంపగూల్చ ఇంటికేగితి ఉత్సాహ మినుమడించ నేనొక చీకటీగ కడ నిల్చి చివాలున బ్యాటు లేపి గో రానెడు నంతలోన మశరమ్ములు జాలిగ నోళ్ళు విప్పి "మా ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; కృంగిపోతి; నా మానస మందెదో తళుకు మన్నది దోమ విలాప కావ్యమై గర్భమును మోసి పిల్లల గనుట కొరకు ఉదర పోషణ కోసమై ఒక్క బొట్టు రుధిర మడిగితిమే గాని ఊళ్ళు కాదె? హృదయమేలేని నీ జన్మ మెందుకోయి? జడమతుల మేము ఙ్ఞాన వంతుడవు నీవు బుద్ధి యున్నది భావ సమృద్ధి గలదు బండబారెనటోయి నీ గుండె కాయ! ఇంటి మశకమ్ముపై ద్వేష మెందుకోయి? స్టీలు దారాలతో ఒళ్ళు చిదిమి చిదిమి గుండె లోనుండి స్పార్కులు గుచ్చి గుచ్చి ఊడ్చి వేద్దురు కసిదీర మాడ్చి మమ్ము అకట! దయలేని వారు మీ యాడువారు మా సహవాసులైన సుకుమారపు గింజలు మాంస జీవులన్ జీవిత మెల్ల మీరలు భుజించుచు త్రేన్చుచు జాలిలేక మా ముందరి కూడు దోచి మము మోసము జేతురు చంపివేసి మ మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా? With due credits to Jandhyala Papayya Sastri garu -  Hari Babu Dornala