Skip to main content

Posts

Showing posts from February, 2011

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు పదం కూడా ఉండదు

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

పద్యాలు: సమస్యా పూరణం

ఈ మధ్య నేను కంది శంకరయ్య  గారి శంకరాభరణం  బ్లాగులో పూరించిన సమస్యలు. ఎరుపు వర్ణంలో చూపిన వరుస కంది శంకరయ్య గారిచే ఇవ్వబడిన సమస్యగా గుర్తించ గలరు. కం.  మేలగు నాయకులెవ్వరు చాలక డబ్బది యొసగెడి సైతానైనా చాలను మన వోటరు పా పాలే సజ్జనుల నెల్ల బతితుల జేయున్! తే. గీ. చీమ పెరుగన్నమును తిని సేదదీరె నంత లోపుగా జరిగెను వింత యొకటి చీమ తుమ్మెను, బెదరెను సింహగణము అదిరిపడి నిద్ర మేల్కొనెనంత చీమ! తే. గీ. స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరి దేశమాతనే చేజార్చె దేహి యనుచు తిరిగి స్వాతంత్ర్యమును తెచ్చె ధీరజనులు స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె! తే. గీ. బియ్యమును కొంద మనుకున్న భయ్యమయ్యె కూరగాయల కొనుమాట నేరమయ్యె ఉల్లిపాయల ధరజూడ ఉట్టి పైన వచ్చె సంక్రాంతి లక్ష్మి యే మిచ్చె మనకు? ఆ. వె. కాలు ముడిచి పట్టి కాసారమున నిల్చు కొంగ కానుపించె కుంటివోలె కుక్క వెంటపడగ కొంగ పరుగులెత్తె కొంగ కైదు కాళ్ళు కోడికి వలె. ఆ. వె. మకరజ్యోతి గాంచ సౌకర్యములులేని శబరిమలకు వెడలి జనులు చావ పన్నువేయు ప్రభుత పనితీరు మారదు కస్తురి తిలకమ్ము గరళ మయ్యె! తే. గీ. వందకోట్ల జనులు గూడి భరత భువిని

దోపిడీ అంటే ఏమిటి?

తాడేపల్లిగారు నిన్న ఒక వ్యాఖ్యలో అమాయకంగా అసలు దోపిడీ అంటే ఏమిటి?  దోపిడీ దారులెవరు? ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం లో బిజినెస్ చేసుకుంటే అది దోపిడీయా? అంటూ ప్రశ్న వేశారు. దానికి నాకన్నా బాగా ఈరోజు ఈనాడు పేపర్ బాగా సమాధానం చెప్పినట్టుంది. అధికారం మనదైతే అడ్డూ అదుపూ లేకుండా ఎలా భొంచేయవచ్చో ఈ వార్తలు చూస్తే తెలుస్తుంది. ఇది ఒక రోజు సమాచారం మాత్రమే, ఒక నెల పేపర్లు తిరగేస్తే చాలు, కొన్ని వందల పేర్లు బయటికొస్తాయి!

సాయిబాబా దివ్యజ్యోతి

మొన్నటికి మొన్న మకర జ్యోతి పుణ్యమా అని వంద మందికి పైగా తోక్కుకుని చావడం ఇంకా మరిచి పోనేలేదు. ఆ తర్వాత అది మానవ కల్పితం అని చెప్పి దేవస్థానం వారు కోర్టులో సాక్ష్యం ఇవ్వడం ఇంకా జ్ఞాపకాల నుండి మాసి పోనే లేదు. అప్పుడే ఇంకో కొత్త జ్యోతి కథ మొదలైంది. దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో దివ్యజ్యోతి కనిపించిందని వార్త. ఉత్తి వార్తే కాదు, వీడియో సాక్ష్యాలతో సహా టీవీలో వార్తా కథనాలు. భక్తులతో, హేతువాదులతో చర్చలు, SMS పోల్సు. విచిత్రమైన విషయ మేమిటంటే SMS poll లో 80 శాతం మంది నమ్ముతున్నామని చెప్పడం. వీడియో చూస్తే అదేదో కెమెరా లెన్సు మీద పడ్డ నీడలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రతిరోజూ ఫోటోలలో వీడియోలలో ఎదురుగా లైటు పడినపుడు ఇలాంటి నీడలు పడడం చూస్తూనే ఉంటాం. ఇది అలాంటి నీడెనేమో నని కనీసం అనుమానించ నక్కర లేదా? ఏది పడితే దాన్ని నమ్మేయటమే? ఇలా దేన్నీ బడితే దాన్ని నమ్మడమే భక్తి అనుకుంటే చేసేదేమీ లేదు. దేవున్ని సాక్షాత్కారించుకొని మాత్రమే నమ్మమని వివేకానందుడు ఎక్కడో చెప్పినట్టు గుర్తు. అంటే గుడ్డిగా ఏదీ నమ్మొద్దనేగా? జనం ఇలా ప్రతీ దాన్నీ నమ్మబట్టే మోసాలు కూడా అదే రేంజిలో జరుగుతున్నాయి. దోపిడీ బాబాలు ఊరిక

ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్య

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ఉపన్యాసాలలో చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఆ మధ్య మెదక్ జిల్లాలో మాట్లాడుతూ 'మీరు, మేం' అంటూ ఆంధ్రా, తెలంగాణా లను వేరు చేసి మాట్లాడారు. ఆయన ఇంకా సమైఖ్యాంధ్ర ముఖ్యమంత్రి గా ఉన్నారని మరిచిపోయారేమో ననిపించింది .అయితే అతనికి తెలుగు రాదనో, మరోటో అనుకోని సరిపెట్టుకుందా మనుకుంటే ఇటీవల రచ్చబండ సందర్భంగా చేసిన వ్యాఖ్య మరీ వికృతంగా ఉంది. పాతబస్తీలో ఆయన రచ్చబండ సందర్భంగా మాట్లాడుతూ మక్కా మసీదులో హిందూ తీవ్రావాదులే  బాంబు పెట్టారని తేల్చి చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా ఇవి ఆయన మాట్లాడ వలసిన మాటలు కావు. తీవ్రవాది ఎవరైనా తీవ్రవాదే. హిందూ అయితే ఒకటి, ముస్లిము అయితే ఒకటి కాదు. తీవ్రవాదిని తీవ్రవాదిగానే చూడాలి తప్ప హిందువుగా, ముస్లిముగా కాదు. అంతేకాక ఎవరు బాధ్యులో, ఎవరు కాదో తేల్చాల్సింది కోర్టులు, ముఖ్యమంత్రి కాదు. అందునా ప్రభుత్వ పరంగా నిర్వహించబడే కార్యక్రమాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు బాగాలేదు.

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గురిం

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్దతు పొందుతున్నా