Skip to main content

ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్య

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ఉపన్యాసాలలో చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఆ మధ్య మెదక్ జిల్లాలో మాట్లాడుతూ 'మీరు, మేం' అంటూ ఆంధ్రా, తెలంగాణా లను వేరు చేసి మాట్లాడారు. ఆయన ఇంకా సమైఖ్యాంధ్ర ముఖ్యమంత్రి గా ఉన్నారని మరిచిపోయారేమో ననిపించింది .అయితే అతనికి తెలుగు రాదనో, మరోటో అనుకోని సరిపెట్టుకుందా మనుకుంటే ఇటీవల రచ్చబండ సందర్భంగా చేసిన వ్యాఖ్య మరీ వికృతంగా ఉంది.

పాతబస్తీలో ఆయన రచ్చబండ సందర్భంగా మాట్లాడుతూ మక్కా మసీదులో హిందూ తీవ్రావాదులే  బాంబు పెట్టారని తేల్చి చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా ఇవి ఆయన మాట్లాడ వలసిన మాటలు కావు.

తీవ్రవాది ఎవరైనా తీవ్రవాదే. హిందూ అయితే ఒకటి, ముస్లిము అయితే ఒకటి కాదు. తీవ్రవాదిని తీవ్రవాదిగానే చూడాలి తప్ప హిందువుగా, ముస్లిముగా కాదు. అంతేకాక ఎవరు బాధ్యులో, ఎవరు కాదో తేల్చాల్సింది కోర్టులు, ముఖ్యమంత్రి కాదు. అందునా ప్రభుత్వ పరంగా నిర్వహించబడే కార్యక్రమాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు బాగాలేదు.

Comments

  1. ముస్లింల వోట్ల కోసం అలా మాట్లాడి ఉంటాడు. హిందువులలోని వివిధ కులాల వోట్ బ్యాంక్ వాళ్ల పార్టీకి ఎలాగూ ఉంది కనుక హిందువులు వోట్లు వెయ్యకపోవడం జరగదు అనుకున్నాడు. అంతే.

    ReplyDelete
  2. ఏ కారణం లేకుండా సాక్షాత్తు ప్రధాన మంత్రి వివిధ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండమని చెప్పారా? రాహుల్ గాంధీ ఏ కారణం లేకుండానే అతివాదుల వల్లే ముప్పు ఉంది అని హెచ్చరించారా? ఏ కారణం లేకుండానే ఎక్కడో కూర్చుని ముష్రాఫ్ బెదిరిస్తున్నారంటారా? ముస్లిం ల పేరుతో హైదరాబాదు లోకి తీవ్రవాదులు చేరిపోయారని నా అనుమానం. భారతదేశం లో ఏది జరిగినా ముందు అందరి చూపూ హైదరాబాద్ మీదే ఉంటుంది. ఈ విషయం కె సి ఆర్ గారు అర్ధం చేసుకోరు. ఎవరి గోల వారిదే!!

    ReplyDelete
  3. ప్రవీన్ శర్మ గారు

    కాంగ్రేస్ వారికి వొటు బ్యాంకు రాజకీయాలు మామూలే. కానీ ఇంత బాహాటంగా, అదీ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడడం ఆ పార్టీ దిగజారుడు తనానికి పరాకాష్టగా అనిపిస్తుంది.

    నీహారిక గారు

    మీరనేదేమిటో నాకు అర్థం కాలేదు. టపాలో వ్రాసినదానికి, మీరు చెప్పిన దానికి సంబంధం ఏమిటి?

    Anonymous

    ఇంతమంది ఒకే సారి గొంతు కలపడం వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. కేంద్రం లోనివారు బెంగాల్ ఎలక్షన్లను ద్రుష్టిలో పెట్టుకుని అన్నారనుకున్నా, మన సీయెం గారికి ఏమవసరం. అమ్మ గారితో గొంతు కలిపి మార్కులు కొట్టేద్దమనేమో!

    ReplyDelete
  4. మజ్లీస్ మద్దతుకోసం కావచ్చు.

    ReplyDelete
  5. కావచ్చు నిజమే. కాని వారెప్పుడూ మద్దతు ఇవ్వడానికి రడీగానే ఉంటారుగా!

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ