Skip to main content

Posts

Showing posts from March, 2011

అశ్వత్థామ, కుంజర న్యాయం

ధర్మరాజు మనకు ఒక గొప్ప న్యాయాన్ని అందించి వెళ్ళాడు. అదే అశ్వత్థామ, కుంజర న్యాయం. కురుక్షేత్ర సంగ్రామంలో అప్రతిహతంగా ముందుకు వెళ్ళుతున్న ద్రోణుడు, తన కుమారుడైన అశ్వత్థామ మరణిస్తే కానీ క్రుంగిపోయి ఓటమి చెందడని భావించిన ధర్మరాజు ఇలా అరుస్తాడు. 'అశ్వత్థామ హతః' కాని ఆయన ధర్మాత్ముడని పేరు. అబద్ధం చెప్పకూడదు. కాబట్టి వ్రతానికి భంగం కలగకుండా 'కుంజరః' అని మెల్లిగా అంటాడు. అప్పుడే అశ్వత్థామ అనే పేరుగల ఏనుగు మరణించడం కొసమెరుపు. ఆ విధంగా పుత్రుని మరణ వార్త తప్పుగా వినడం వలన అశక్తుడు గా మారిన ద్రోణున్ని పాండవవర్గం వారు సులభంగా చంపివేశారన్నది మిగతా కథ. ఇలా ధర్మరాజు చేత కనిపెట్టబడిన ఈ న్యాయాన్ని ఈనాడు మీడియా గొప్పగా ఉపయోగిస్తుంది. ఎలాగంటే, తమకు అనుకూలంగా ఉండే విషయం ఎంత చిన్నదైనా బాకా ఊది, బానరు కట్టి మరీ చెప్పడం. అలాగే తమకు ప్రతికూలంగా ఉండే విషయం ఎంత ముఖ్యమైనదైనా చెప్పీ చెప్పనట్టు వెనక పేజీలో చిన్నగా వేయడం. తద్వారా తమ వ్యతిరేకులను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ తర్వాత అంతం చేయడం. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయంలో పేర్కొన్న మీడియా మేనేజిమెంటు ఇలాంటిదే అని భావించ వచ్చు. ఇక పోతే ఒక మహానా

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ

బయటపడ్డ శ్రీకృష్ణ కమిటీ పక్షపాత ధోరణి

శ్రీకృష్ణ కమిటీ పక్షపాత ధోరణిపై మొదటినుండి తెలంగాణా వాదులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బయట పడిన ఎనిమిదో అధ్యాయం లోని భాగాలు కమిటీ యొక్క దిగజారుడు తనాన్ని నగ్నంగా బయట పెడుతూ, తెలంగాణా వాడు చేస్తున్న ఆరోపణలు నిరాధారం కావని నిరూపించాయి. ఇలాంటి అధ్యాయం పై సంతకం పెట్టడం ద్వారా జస్టిస్ శ్రీకృష్ణ ఏరకమైన లాభాలు పొందారో తెలియదు కాని, తన ప్రతిష్టకు మాత్రం మాయని మచ్చ తెచ్చుకున్నారని మాత్రం చెప్పవచ్చు. సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో తమకిష్టం లేని యూనియన్ లీడర్లను శిక్షించడానికి మేనేజిమెంట్లు తమకి మడుగులోత్తే తొత్తులైన ఆఫీసర్లతో ఎంక్వయిరీలు వేయించి తమకు అనుకూలంగా రిపోర్టులు రాయించుకుని పెద్ద పెద్ద శిక్షలు విధిస్తుంటారు. ఇవి ఎలాగూ లేబర్ కోర్టులలో వీగి పోతుంటాయి. కొండొకచో అలాంటి ప్రవర్తనకు దిగిన అధికారులకు చీవాట్లు కూడా పడుతుంటాయి. కాని ఇక్కడ ఎంక్వరీలు చేసే ఆఫీసర్లు కాని, శిక్షలు విధించే మేనేజర్లు కాని న్యాయ కోవిదులు కారన్న విషయం గమనార్హం. దేశంలో పేరొందిన న్యాయమూర్తిగా వెలుగొందిన జస్టిస్ శ్రీకృష్ణ ఒక సాధారణమైన లాలూచీ అధికారి మాదిరిగా ప్రవర్తించడం చిత్రమైన విషయం. ఆయన ఎనిమిదో అధ్యాయం లో పేర్కొన

కుహనా సమైక్య వాదం, కుహనా ప్రత్యేక వాదం

ఇప్పుడు రగులుతున్న తెలంగాణా సమస్యలో ప్రధానంగా రెండు వాదాలు వినిపిస్తాయి. రాష్ట్రాన్ని విభజించాలని చెప్పే ప్రత్యేక వాదం ఒకటి కాగా, రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని చెప్పే సమైక్య వాదం ఒకటి. ప్రత్యేక వాదుల విషయానికొస్తే మొదలు చెప్పుకోవాల్సింది తెలంగాణా రాష్ట్ర సాధనం మాత్రమే సమస్యకు ఏకైక వికల్పంగా భావిస్తున్న తెలంగాణా ప్రాంతంలోని అత్యధిక శాతం మంది ప్రజలు, మేధావులు, రాజకీయులు. అలాగే ప్రత్యేక ఆంద్ర రాష్ట్రంతో మాత్రమే తమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పే ఆంధ్రా ప్రజలు, మేధావులు, రాజకీయులు. తెలంగాణా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై సానుభూతితో విభజన కోరుతున్న ఆంధ్రా ప్రజలు, మేధావులు. వీరందరూ ఏదో ఒక కారణంతో రాష్ట్ర విభజననే కోరుతున్నారు. ఇక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పే వాదనలు తెలుగు జాతి, తెలుగు జాతి సౌభ్రాతృత్వం, తెలుగు జాతి సమైక్యత చుట్టూ తిరుగుతుంటాయి. వీరి వాదనలో విపరీతమైన భాషాప్రేమ తప్ప మరేమీ కనిపించదు. సగటు తెలంగాణా పౌరుడు 'తన పొట్ట నిండడమా? తెలుగుపై ప్రేమా?' అన్న మీమాంసలో మొదటి దాన్నే ఎంచుకున్నాడని వీరు గుర్తించరు. తెలుగు జాతి సౌభ్రాత్వుత్వం గురించి మాట్లాడే వారికి, తమ సోదర

కాకరాపల్లిలో మానవమేధం

గంగవరం, ముదిగొండ మరపుకైనా రాలేదు. సోంపేట నెత్తురు తడి ఆరనైనా ఆరలేదు, మళ్ళీ కాకరా పల్లిలో మానవమేధం. ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తాకట్టు పెట్టి పెట్టుబడి దారుల పాదాలకు మడుగులోత్తే క్రమంలో ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాల్సి ఉందో ఆలోచిస్తేనే భయం గొల్పుతుంది. ఆ ప్రాంతపు ప్రజలు ప్రాణాలొడ్డి థర్మల్ ప్లాంటు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటేనే అది వారికి ఎంత నష్టదాయకమో చెప్పకనే చెపుతుంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్టు అక్కడే పెట్టాలనే యావ ఈ ప్రభుత్వానికెందుకు? సమాధానం జగద్విదితం. ఆ ప్రాంతం పెట్టుబడి దారులకు అనుకూలమైనది. నీటి లభ్యత ఉంటుంది. పోర్టు దగ్గరగా ఉంటుంది. అనగా పెట్టుబడి దారునికి అధిక లాభాలు వస్తాయి. లోపాయికారీగా తమకు ఎక్కువ కమీషన్లు ముడుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పెట్టుబడి దారుడు చెప్పిన దానికి గంగిరెద్దులా తలూపడం తప్ప ప్రజల గురించి ఏమాలోచిస్తుంది? అసలు రక్షణలన్నీ పెట్టుబడి దారునికేనా? ప్రజల కేమీ లేవా? అన్న సందేహం కలుగుతుంది. పంట భూములను నాశనం చేసి ఫ్యాక్టరీలు నిర్మించడం ఏమిటి? అలా నిర్మించడానికి రాష్ట్రంలో బీడు భూములు చాలా ఉన్నాయి. అక్కడ పనులు లేక ఎంతోమంది కార్మికులు ఉన్నారు. అలాం