Skip to main content

Posts

Showing posts from January, 2011

పోలవరం ప్రాజెక్టు

పోలవరం పై మళ్ళీ హడావుడి మొదలైంది. ఒక నాయకుడు పోలవరం అంటూ రక రకాల డ్రామాలాడి, ఇప్పుడు అధికారా పార్టీ నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అంటూ ఎదురు చూపులు చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకో నాయకుడు ఇన్నాళ్ళూ అధికార పార్టీ అందలం ఎక్కిస్తుందని వేచి చూచి, ఇక ఎదురు దాడి మాత్రమే శరణ్యమని తలచి అదే అదే పోలవరం డ్రామాను మరింతగా రక్తి కట్టించడానికి సిద్ధమౌతున్నాడు. భారత దేశంలోని ప్రాజెక్టులలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టులలో పోలవరం మొదటిదిగా నిలుస్తుంది. దీన్ని ఒకవైపు గిరిజన జాతులవారు వ్యతిరేకిస్తుంటే, రెండో వైపు పర్యావరణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా దీన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా కోర్టుకే వెళ్ళింది. CPI, TRS వంటి రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఒక ప్రాజెక్టును ఇంతమంది వ్యతిరేకించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల రెండువందలకు పైగా గ్రామాలు, రెండు లక్షలకు పైగా జనాభా నిర్వాసితులు అవుతున్నారు. వీరిలో సింహభాగం గిరిజనులు. 1,47,597 ఎకరాల భూమి నీటిలో మునిగి పోతుంది. ఇలా మునిగిపోయే భూమిలో ఎంతో ప్రకృతి సంపద, నల్లమల కొండల అందాలు కప్పబడి పోబోతున్నాయి. ఇక ముంపుకు

గ్రేటర్ రాయలసీమ, గ్రేటర్ తెలంగాణా

శ్రీకృష్ణ కమిటీ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ ఎంపీలతో జోరుగా మంతనాలు జరుపుతుంది. సమస్య కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పరిష్కారమైతే చాలు, పరిష్కారం వచ్చినట్టే అనిపిస్తోంది. కానీ సీమాంధ్ర వారిని, తెలంగాణా వారిని ఒకే పరిష్కారం దిశగా ఒప్పించడం నిజంగా కత్తి మీద సామే. ఈ విషయంలో చిదంబరం గారు ఎలా నెట్టుకొస్తారో చూడాలి. జస్టిస్ శ్రీకృష్ణ గారికి కర్ర విరక్కుండా, పాము చావకుండా నివేదికలు సమర్పిస్తారనే పేరు ఉంది. కానీ ఈ నివేదిక విషయంలో ఆయన పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి. కమిటీ వారి వద్దకు వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు చేసిన సూచనలు క్రోడీకరించారని మాత్రమే చెప్పాలి. అది తనంత తానుగా కొత్త పరిష్కార మార్గాలకు అన్వేషించినట్టుగా కనపడదు. కనీసం వివిధ ప్రజా సంఘాలు చేసిన గ్రేటర్ రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ లాంటి కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయమై TG వెంకటేష్ లాంటివారు నిరసన వ్యక్తం చేశారు కూడా. ఏ పరిస్థితిలోను సీమాంధ్రతో యధాతథంగా కలిసి ఉండటానికి తెలంగాణా వారు ఒప్పుకోరని శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది. అయితే తనంత తానుగా అలాంటి మార్గాలను అన్వేషించ డానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు

రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా ఉంది. స్వతంత్ర భారత దేశంలో బహుషా కాంగ్రెస్ పార్టీకి ఇంతటి గడ్డు పరిస్థితి ఇదివరలో ఎప్పుడూ వచ్చి ఉండదు. ఒకవైపు జగన్ వీరంగం. మరోవైపు తెలంగాణా సమస్య. మామూలుగా అయితే అవినీతి, అధిక ధరలు, పెట్రోలు ధర పెంపు లాంటివి ఆపార్టీకి దున్నపోతు మీద నీటి బొట్ల లాంటివే అయినా ఈ పరిస్థితులలో అవి కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి తన వైపు ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని ఏకంగా దేశ రాజధానిలోనే ప్రదర్శించి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన దయాదాక్షిన్యాల మీద ఆధారపడి ఉందని ప్రకటించాడు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి.   జగన్ వర్గం వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటే వారు రాజీనామా చేసేలా ఉన్నారు. తరువాత జరిగే ఉప ఎన్నికలలో ఎలాగూ ఆ స్థానాల్లో కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి ప్రభుత్వం పడిపోవడం ఖాయం. పోనీ ఉపేక్షిద్దామా అంటే ప్రభుత్వం ప్రతిష్ఠ నానాటికి తీసికట్టు, నాగంభొట్లు అన్న మాదిరిగా తయారౌతుంది. ఇక తెలంగాణా విషయానికి వస్తే గత ఆరేళ్ళుగా కాంగ్రేస్ ఆడుతున్న దొంగనాటకానికి చరమాంకం దగ్గర పడింది. అతి తొందరలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి. ఈవ

తిరుపతి లడ్డూలో బోల్టు వస్తే...

తిరుపతి లడ్డూలో బోల్టు రావడం ఈ నెలలో అప్పుడే రెండోసారి. యధాప్రకారం టీవీలో పదేపదే అదేపనిగా చూపిస్తూ చర్చలు, అభిప్రాయాలు. TTD వారిమీద భక్తుల ఆరోపణలు. తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తులకు సరిపడా లడ్డూలు తయారు చేయడం యంత్రాల సహాయం లేకుండా సాధ్యమయ్యే పని కాదు. ఇలా వాడుతున్న యంత్రాలు ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తున్నప్పుడు చిన్నచిన్న విడిభాగాలు ఊడిపడడం కూడా అంతే సహజం. బహుళజాతి కంపెనీలు వ్యాపారం కోసం నడిపే కూల్ డ్రింకుల లోనే బొద్దింకలు వస్తున్నాయి. TTD వారి లడ్డూ తయారీ వ్యాపార దక్షతతో నడుప బడుతున్న కంపెనీ కాదు. పైగా దీనిపై వారు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అలాగని ఇలాంటి పొరపాట్లు లేకుండా చేయడం అసాధ్యమనీ కాదు. కానీ దానికి అత్యాధునికమైన యంత్రాల వాడకం, వాటికి నియమిత కాల పరిశీలన, దిద్దుబాట్లు చేయాలి. ప్రతి లడ్డూను తయారీ అనంతర పర్యవేక్షణకు గురిచేయాలి. తయారయిన లడ్డూలను సంచీలలో కట్టి బ్యాచునంబర్లను ముద్రించాలి. ఇంత చేసినా కూడా ఏమైనా పొరపాట్లు దొర్లితే బ్యాచునంబరు ఆధారంగా సంబంధిత తయారీదార్లను శిక్షించాలి. ఇంత పద్ధతిగా చేయాలంటే పెట్టుబడి, అధిక సిబ్బంది అవసరమౌతుంది. ఇవన్నీ చేసినప్పుడు లడ్డూరేటు కూడా భారీ

రాష్ట్ర విభజన తప్పదా?

శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు రానే వచ్చింది. మొదటి సూచనగా రాష్ట్రం యధాతథంగా కొనసాగడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టింది. ఈవిషయం ఇప్పటికైనా సమైక్యవాదులు గుర్తిస్తే మంచిది. శ్రీక్రిష్ణ కమిటీ ఆరు సూచనలు చేసింది. అందులో నాలుగు ఆచరణసాధ్యం కాదని చెప్పింది. అది ఈ ఆరు సూచనలే ఎందుకు చేసిందనేది అంతు పట్టని తర్కం. ప్రజల నుండి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుందనుకుందామంటే,  ప్రజల్లోంచి ఇంకా చాలా సూచనలు వచ్చాయి. ఉదాహరణకు ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, వన్యసీమ మొదలైనవి. వాటిని కూడా చర్చించి సాధ్యాసాధ్యాలు వ్యాఖ్యానించాలి కదా! అందులో కూడా గ్రేటర్ రాయలసీమ, ప్రత్యెక రాయలసీమ, ప్రత్యేక ఆంధ్ర (సీమ లేకుండా) అనేవి బలంగా వినిపించాయి. మరి వీటిని కనీసం చర్చించనైనా లేదెందుకు? వాటిని కూడా చర్చించి సాధ్యం కాదని నిర్ణయం చేసి ఉండవచ్చు కదా? పోనీ, ఈ ఆరు సూచనలు చేసిందా అంటే, ఆరింట్లో నాలుగు పనికిరానివని తానే చెప్పింది. మరి పనికి రాని సూచనలు కమిటీ ఎందుకు చేస్తుంది? ఎవరిని గందరగోళంలో పడేద్దామని? నివేదిక ఈవిధంగా రావడం అంతుబట్టని చిదంబర రహస్యంగానే మిగిలి పోయింది. తానే సూచనలు చే

సమస్యాపూరణం

ఈమధ్య నేను శంకరాభరణం  బ్లాగులో చేసిన కొన్ని సమస్యా పూరణలు. కం  పలుగాకులు కలహించగ కలహము వలదంచు చెప్ప; కాకులు తమతో కలహించి గాయ పరచగ కలహంసల తప్పు గాక గాకుల తప్పా! తే గీ  షార్టు మెస్సేజి లోతాను స్మార్టు యనుచు అసలు మోబైలు మాటలే నమృత మనుచు బైకు నడుపు వేళ 'నమృతపాన' మంద అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె. తే గీ  అక్క చెల్లెండ్రు పాడిరి నొక్క పాట చెల్లి మగని వారడిగిరి చివర గాను గొప్పగాపాడె నెవ్వరో చెప్ప మనుచు 'చెల్లి' యని మగఁడు పిలువఁ చెలియ మురిసె. ఆ.వె. పడతి ఫాలభాగ వైశాల్యమును గాంచ ఆకసమ్ము తానె ఆగ్రహించె భ్రమసె తనను వీడి భామ ముంగురులలో సూర్యబింబ మమరె సుదతి నుదుట! ఆ.వె. పశువు నేమరించి పాలను కాజేసి దూడ గడ్డి మేప దోషమవదె? నోరులేని ప్రాణి నోటికూడు గుడిచి పాల వలన జనులు పతితులైరి . కం  కోరిన పడతుల చేతలు నేరము లైనను సరసపు నీతిగ దోచున్ కోరిక మెయి దహియింపగ కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్

విర్చువల్ బాక్సులో ఉబంటు

ఆపరేటింగ్ సిస్టం అంటే ఎక్కువ మందికి విండోస్ మాత్రమే తెలుసు. ముఖ్యంగా మన దేశంలో విండోస్ తప్ప వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడే వారిని అరుదుగా చూస్తుంటాం. దాదాపుగా మనకు లభించే కంప్యూటర్లన్నీ (ఆపిల్ మాకింతోష్ తప్ప) అన్నీ విండోస్ ప్రీ ఇన్స్టాల్ చేసి లభిస్తుంటాయి. అసెంబుల్ మెషిన్లు వాడే వారు ఎలాగూ పైరేటెడ్ విండోస్ వాడే సావకాశం మన దేశంలో ఉంది. అందుకేనేమో మన దేశంలో విండోస్ తప్ప ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ జోలికి ఎవరూ వెళ్ళడం లేదు. అయితే ఓపెన్ సోర్సు రంగంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని గనుక పరికించినట్టయితే, లినక్సు విండోస్ ను త్రోసిరాజనే రోజు ఎంతో దూరంలో లేదు. సర్వర్ల రంగంలో నయితే ఇప్పటికే లినక్సు విండోస్ కన్నా ఎన్నోరెట్లు ముందంజలో ఉంది.   అయితే మనలో చాలామందికి లినక్సుని ప్రయత్నించాలనే కోరిక ఉన్నప్పటికీ రక రకాల కారణాల వల్ల వాయిదా వేస్తుంటాము. మన సిస్టం లో ఇప్పటికే విండోస్ లోడై ఉంది కాబట్టి, దాన్ని తీసి వేయలేము. ఇంకో పార్టిషన్ తయారు చేసుకొని వేయడానికి కావలసిన ఓపిక, తీరిక చాలామందికి ఉండదు.  ఇంకో పార్టిషన్ తయారు చేసే ప్రయత్నంలో ఉన్న విండోస్ కాస్తా డిలేట్ అయితే మొదటికే మోసం వచ్చి, మొత్తం డేటా పో

దోపిడీ స్వభావం

మనిషి నాగరికత నేర్చుకుంటున్న కాలం నించీ అనివార్యంగా సాగుతున్న కార్యక్రమం దోపిడీ. కాలానుగుణంగా దోపిడీ స్వభావం మారింది కాని దోపిడీ అలాగే ఉంది. అసలు దోపిడీ అంటే ఏమిటి? ఒకడి కష్టార్జితాన్ని ఇంకోడు కొల్లగొట్టడం. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది, కష్టార్జితం కాకపొతే కొల్లగొట్ట వచ్చునా, అని. ఇవన్నీ నిర్ణయించడానికి, లెక్కగట్టడానికి కారల్ మార్క్స్ ఒక పెద్ద పుస్తకమే రాశాడు. ఇప్పుడు ఆవివరాలలోకి పోవడం నా ఉద్దేశం కాదు. ఆసలు ఈ దోపిడీ ఎలా పుట్టింది అని ఆలోచిస్తే, ఆదిమ సమాజంలోనే దీనికి బీజాలు పడి ఉంటాయి అని చెప్పక తప్పదు. మనిషి జంతువులా జీవించిన కాలంలో దోపిడీ అంతగా ఉండే అవకాశం లేదు. అయితే గియితే కుటుంబంలోనే బలవంతుడు బలహీనుడు నోటి దగ్గరి కూడు లాక్కునివుంటాడు. అది కూడా దోపిడీయే! కాని వ్యవస్థీకృతం కాదు. నాగరికత పెరుగుతున్న కొద్దీ జనం జానపదాలుగా (గ్రామాలు) గుమికూడడం మొదలు పెట్టారు. వ్యవసాయం చేసి కొంత అదనపు ధాన్యమో, పనిముట్లో కూడబెట్టుకోనే అవకాశం కలిగింది. ఇలా మొదలైంది ప్రైవేటు ఆస్తి. అయితే వ్యవస్థ పై నియంత్రణ లేక పోవడం వలన కొంత మంది బలవంతులు సహజంగానే బలహీనులను బెదిరించి ఇలా కూడబెట్టిన ఆస్తులను కొల్లగొడ