Skip to main content

Posts

Showing posts from September, 2009
పది రూపాయల నోటుతో నిపుడు ఏపూ టైన నిండే న కు క్షి ది గ్రేట్ సీయము రాజశేఖరుడు సాక్షాత్తూ ప్రజాబద్దుడై ఇదిగో ఇచ్చెను రెండు రూకల కిలో బియ్యం సరే పోయె ము ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్రా ప్రజల్

అధికారం

దివంగత ముఖ్య మంత్రి చని పోయి రెండు రోజులు కూడా కాలేదు. సంతాప దినాలు పూర్తి కావడానికి ఇంకా ఐదు రోజులున్నాయి. ఈ లోపలే కాంగ్రెస్ వారు కామెడీ మొదలు పెట్టారు. వీరి కామెడీకి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ముఖ్య మంత్రి పార్థివ శరీరాన్ని ఇంకా తీసుకు రాక ముందే కేబినేట్ మీటింగ్ ఒకటి పెట్టారు. ఒక సంతాప తీర్మానం, కడప జిల్లాని YSR జిల్లాగా మార్చాలని ఒకటి, జగన్ ని ముఖ్యమంత్రిగా నియమించాలని ఒకటి మొత్తం మూడు తీర్మానాలు చేసారు. మొదటి రెండు వరకు ఫరవా లేదు. ఒక కేబినేట్ మంత్రి వర్గం ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కొరకై సిఫారసు చేయడం... కామెడీగా లేదూ? ఇందులో అసలు కామెడీ ఏమిటంటే ముఖ్యమంత్రి చనిపోయాక, ఆయన నియమించుకున్న ఈ మంత్రివర్గం రద్దయినట్లే నని రాజ్యాంగ నిపుణులు సెలవిచ్చారు. మరి వీరి తీర్మానాలకు చట్ట బద్ధత ఏది? ఇక రెండోది కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం. వీరంతా సమావేశమై జగన్ మాత్రమే ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేశారట. వీరి తీర్మానం నాలిక గీక్కోవడానికి కూడా పనికి రాదు. వీరెందుకు హడావిడిగా ఇప్పుడు తీర్మానం చేయడం? ఒక వైపు అధిష్టానం ఈ విషయం పై ఏమీ మాట్లాడకండి అని చెపుతుంటే? మూడోది ఎమ్మెల్యేలు కూడా తీర్మా

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు

మన విద్యా విధానం ఎటు వెళ్తుంది?

అందరం క్లాసులో నిశ్శబ్దంగా కూర్చున్నాం. అపుడు నేను REC వరంగల్ లో కొత్తగా చేరాను. మొదటి క్లాసు కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. రాబోయేది అయ్యంగార్ సార్. అందరికీ కొత్త కావడంతో భయం భయంగా కూర్చున్నాం. అందులో జరగ బోయేది మాథ్స్ క్లాసు. అయ్యంగార్ గారు రానే వచ్చారు. మొదట అందరిని పరిచయం చేసుకున్నారు. తనను తానూ పరిచయం చేసుకున్నారు. తరువాత చాక్ పీసు తీసుకుని బోర్డుపై అడ్డంగా ఒక గీత గీసారు. "ఇదేమిటి"? ఒకడిని లేపి అడిగారు. వాడు సరిగా చెప్పలేక పోయాడు. ఒకరిద్దరి తర్వాత ఒకడు చెప్పాడు. "X axis". "Good. మరి ఇదేమిటి?" ఇప్పుడు నిలువుగా గీత గీసి ఇంకొకడిని అడిగారు. ఈసారి వెంటనే వచ్చింది జవాబు. "Y axis". అలా ఒక్కొక్క బిందువును గుర్తిస్తూ, గీతలు గీస్తూ క్లాసులో ప్రతి ఒక్కరిని లేపి ప్రశ్నలు వేయ సాగారు. కొద్ది నిముషాల్లో మా భయం, బెరుకు పోయింది. అయన మాకో అధ్యాపకుడిగా కాక ఒక స్నేహితుడిగా కనిపించ సాగారు. ఉత్సాహంతో జవాబులు చెప్పడం మొదలు పెట్టాం.అలా అరగంట పాటు చర్చ కొనసాగింది. ఇంతలో నా స్నేహితుడు లేచి ఒక విషయం చెప్పాడు. "Yes, this is what exactly is call