Skip to main content

Posts

Showing posts from March, 2010

నిర్వీర్య మవుతున్న పోలీసు వ్యవస్థ

"దుండగులు ఎంతటి వారైనా వదిలిపెట్ట వద్దని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చాం" ఇవి శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడల్లా మన ముఖ్య మంత్రి గారు, లేక హోం మంత్రి గారు చెప్పే పడికట్టు పదాలు. అంటే ఏమిటి వీరి ఉద్దేశం? మామూలు పరిస్థితులలో ఎంతో కొంతటి వారైతే వదిలి పెడతారా? ఇప్పుడు మాత్రమే 'ఎంతటి వారైనా' వదిలి పెట్టకుండా శిక్షిస్తారా? అసలు ఎవరిని విడిచి పెట్టాలి, ఎవరిని విడిచి పెట్టొద్దు అని డీజీపీకి వీరు చెప్పే అవసరం ఏమిటి? వీరు చెపితే కాని డీజీపీకి ఈవిషయాలు తెలియవా? ఈ ఒక్క వాక్యం చాలదూ ప్రతి విషయంలో రాజకీయులు పోలీసుల వ్యవహారాలలో ఎంత జోక్యం కలిగించు కుంటున్నారో తెలుసుకోవా డానికి! "తప్పుచేసిన వారందరికీ  కఠినాతి కఠినమైన శిక్షలు విధించేలా చూస్తాం"  ఇది నాయకులు ఎప్పుడూ ఉపయోగించే మరొక వాక్యం. అసలు పోలీసు శాఖ విధి ఏమిటి? తప్పు చేసిన వారిని పట్టుకొని కోర్టులకు నివేదించడం. కోర్టులో వారి తప్పులను నివేదించడం. కొందరికి కఠినాతి కఠినమైన శిక్షలు, కొందరికి మామూలు మామూలు శిక్షలు విధించ డానికి వెసులుబాటు ఏమైనా ఉందా? లేక తప్పును బట్టి అందరికీ ఒకే రకమైన శిక్షలు ఉంటాయా? వీరు మాట్లాడే

ముఖ్యమంత్రి నివాసం, వాస్తు.

పొద్దున్నే వార్త. ముఖ్యమంత్రి గారు క్యాంపు ఆఫీసు లోకి మార బోతున్నారు. శుభం. కాని పూర్తిగా కాదట. నివాసం ఇప్పుడు అమీర్ పేటలో ఉన్న స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట. ఇంతోటి దానికి అరవై లక్షల ప్రజా ధనం తగలేసి వాస్తు ప్రకారం మార్పు, చేర్పులు చేయించారు. గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కన్నా ముందు ముఖ్యమంత్రులు తమ నివాసాల నుండే పరిపాలన సాగించే వారు. లోపాయికారీగా ప్రభుత్వ డబ్బులతో తమ ఇళ్ళను కావలసిన విధంగా రిపేర్లు కూడా చేయించు కునేవారనుకోండి, అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు, యన్టీయార్ కూడా దీనికి మినహాయింపు కాదు. రాజశేఖర రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంటికివెళ్ళ లేదు. ఏకాఎకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మకాం పెట్టేసారు. యుద్ధ ప్రాతిపదిక పై ముఖ్యమంత్రి అధికార నివాస నిర్మాణం ప్రారంభించారు. దీనికోసం దాదాపు పది కోట్లవరకు ఖర్చు పెట్టారు. దీని ఖర్చు పైన కొన్నివిమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి భద్రత, పాలనా సౌలభ్యం మొదలైన వాటి దృష్ట్యా ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేదు. కాని ఇప్పుడు రోశయ్య గారు స్వంత ఇంటిలో నివాసముంటూ అధికార గృహం నుంచి

ఇంటర్నెట్లో అమెరికా, చైనాల కంటే ఎక్కువగా వెదక బడుతున్న దేశం?

గూగుల్ లో అమెరికా, రష్యా, చైనా, జపాన్ ల కంటే ఇండియా నే యెక్కువగా వెతుకు తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ?

ప్రజారాజ్యం పార్టీ వింత పోకడలు

ఆంధ్ర జ్యోతి పత్రిక కొన్ని అతిశయోక్తి అలంకారాలతో ప్రజారాజ్యం పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక వ్యాసం రాసింది. ఆ వెంటనే ప్రజారాజ్యం కార్యకర్తలు ఆగ్రహోదగ్రులై ఆంధ్ర జ్యోతి కార్యాలయం పై ఆటవికంగా దాడి చేశారు. ఈ విషయంలో ఆంధ్ర జ్యోతిది తప్పే కావచ్చు. అలా అని ఇప్పుడు తెలుగులో నిష్పక్షపాతంగా జర్నలిజం నియమాలను పాటిస్తున్న పత్రిక ఒక్కటైనా ఉందా? ఆంధ్ర జ్యోతి క్షమించ రానటువంటి ఘోరమైన వార్తనే వ్రాసింది అనుకుందాం. దాన్ని ఖండించ డానికి ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాయి. అంతే కాక press council కి కూడా నివేదించ వచ్చు. కాని ప్రజారాజ్యం వారు ఏం చేసారు? వీరు చేసిన దాడి ఏ విధంగానూ సమర్ధించ లేనిది. వీరు పార్టీ ఇంకా ఏర్పడకముందే రాజశేఖర్, జీవిత లపై దాడి చేసి 'పూవు పుట్టగానే పరిమళిస్తుంది' అన్న సామెతని నిజం చేశారు. ఇప్పుడేమో ఏకంగా ఒక మీడియా సంస్థ మీదనే దాడికి తెగ బడ్డారు. వీరు ఇప్పుడే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే, రేపు పొరపాటున అధికారం లోకి వస్తే పరిస్తితి ఎలా వుంటుందో ఊహించు కోవాలంటేనే భయం వేస్తుంది. ఇప్పటికీ చిరంజీవి ఈ దాడిని ఖండించక పోవడం చూస్తుంటే ఇదే వీరి పాలసీ అని అనుకోవలసి వస్తుంది.