Skip to main content

నిర్వీర్య మవుతున్న పోలీసు వ్యవస్థ

"దుండగులు ఎంతటి వారైనా వదిలిపెట్ట వద్దని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చాం"

ఇవి శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడల్లా మన ముఖ్య మంత్రి గారు, లేక హోం మంత్రి గారు చెప్పే పడికట్టు పదాలు. అంటే ఏమిటి వీరి ఉద్దేశం? మామూలు పరిస్థితులలో ఎంతో కొంతటి వారైతే వదిలి పెడతారా? ఇప్పుడు మాత్రమే 'ఎంతటి వారైనా' వదిలి పెట్టకుండా శిక్షిస్తారా?

అసలు ఎవరిని విడిచి పెట్టాలి, ఎవరిని విడిచి పెట్టొద్దు అని డీజీపీకి వీరు చెప్పే అవసరం ఏమిటి? వీరు చెపితే కాని డీజీపీకి ఈవిషయాలు తెలియవా? ఈ ఒక్క వాక్యం చాలదూ ప్రతి విషయంలో రాజకీయులు పోలీసుల వ్యవహారాలలో ఎంత జోక్యం కలిగించు కుంటున్నారో తెలుసుకోవా డానికి!

"తప్పుచేసిన వారందరికీ  కఠినాతి కఠినమైన శిక్షలు విధించేలా చూస్తాం" 

ఇది నాయకులు ఎప్పుడూ ఉపయోగించే మరొక వాక్యం. అసలు పోలీసు శాఖ విధి ఏమిటి? తప్పు చేసిన వారిని పట్టుకొని కోర్టులకు నివేదించడం. కోర్టులో వారి తప్పులను నివేదించడం. కొందరికి కఠినాతి కఠినమైన శిక్షలు, కొందరికి మామూలు మామూలు శిక్షలు విధించ డానికి వెసులుబాటు ఏమైనా ఉందా? లేక తప్పును బట్టి అందరికీ ఒకే రకమైన శిక్షలు ఉంటాయా? వీరు మాట్లాడే మాటలతో ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి.

నిజానికి వీరు మాట్లాడే దాంట్లో తప్పేమీ లేదు. వీరు ఏం చేస్తారో అవే మాట్లాడుతున్నారు. రాజ శేఖర్ రెడ్డి రెండో సారి అధికారం లోకి రాగానే మొహంతిని డీజీపీ పదవినుండి ఊడ బీకేసి యాదవ్ ని నియమించడం, రోశయ్య రాగానే ఆయనను పీకేసి ప్రస్తుత డీజీపీని నియమించడం అనే సంఘటనలు చాలు, పోలీసు విభాగంలో ఎన్ని రాజకీయాలు నడుస్తున్నాయనే విషయం తెలుసుకోవడానికి.

ఇక పోలీసులు కూడా తమ విధి నిర్వహణలో కాకుండా రాజకీయ నాయకుల మెప్పు ఎలా పొందాలా అనే విషయం లో ఎక్కువ చురుకుదనం చూపిస్తున్నారని అనిపిస్తుంది. పాత బస్తీలో రెండు వర్గాల వారు రాళ్ళు రువ్వుకున్న సంఘటన జరిగినా కూడా రెండు రోజుల వరకు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించారు. ఎలాంటి కవ్వింపు చర్యా లేకుండానే ఉస్మానియాలో రెండు వేల మంది పోలీసులను మొహరించి అత్యుత్సాహం చూపించిన డీజీపీ, కమీషనర్లు, ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేసారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. మొహంతి ఉండ వలసిన హోదాలో వీరు ఎందుకు ఉన్నారో అర్థమైతే చాలు, ఇది అర్థం చేసుకోవడానికి.

ఖాకీల పై ఖద్దరు చొక్కాల పెత్తనం కొనసాగినంత కాలం ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు అనే మాటలో అతిశయోక్తి లేదు.

Comments

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...