Skip to main content

Posts

Showing posts from April, 2011

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు పెరిగుతాయి

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే ఈ ప

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులుబాటు ఉండద

బాబా దేవుడా, మనిషా?

సత్యసాయిబాబా శరీరావయవాలు చికిత్సకి సహకరిస్తున్నాయని తాజా వార్త. సంతోషం. గత వారం పది రోజులుగా రోజూ ఇలాంటి వార్తలే వస్తున్నాయి తప్ప ఇదమిద్ధంగా ఇది జరిగింది, దీనికి ఈ చికిత్స చేస్తున్నాం అని ఎక్కడా చెప్పడం లేదు. ఇలా ఇంకెంత కాలం చేస్తారో వేచి చూడ్డమే. ఈ మధ్యన రకరకాల వాదోపవాదాలు ఊపందుకుంటున్నాయి. సాయి దేవుడని కొందరు, కాదు మనిషే అని కొందరు. మొత్తానికి వీరందరూ అస్తికులే నండోయ్, నమ్మనివారు నాస్తికులనుకునేరు! అస్తికులంటేనే నమ్మేవారని అర్థం. నమ్మే వారంటే, తర్కం జోలికి వెళ్ళకుండా దేవునిపై విశ్వాసం ఉంచేవారనికదా అర్థం? ఎందుకంటే, ఎక్కడైతే తర్కం ఉంటుందో అక్కడ ప్రశ్న ఉంటుంది, మూఢవిశ్వాసానికి స్థానం ఉండదు. అటువంటప్పుడు అస్తికులై ఉండి కూడా సత్యసాయి దేవుడని నమ్మని వారినేమనాలి? నమ్మీ నమ్మనివారనా? సగం తర్కించి, సగం నమ్మే వారనా? ఏదేమైనప్పటికీ, వీరి మధ్య వాదనలు మాత్రం జోరుగానే నడుస్తున్నాయి. సాయి దేవుడైతే చికిత్సలు చేయడం ఎందుకు అని కొందరు. నిజమే మరి, సర్వ జనులను కాపాడే వాడికి తన శరీరం మీద కూడా ఆధిపత్యం ఉండాలి కదా! మరి కొందరు మాత్రం దేవుడైనా కూడా, మానవ రూపంలో ఉన్నప్పుడు అన్ని రకాలా ఈతి బాధలు తప్పవని సెలవి

లోక్ పాల్ కమిటీ మరో తెలంగాణా కమిటీ అవుతుందా?

హజారే విజయంతో అవినీతిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. లోక్ పాల్ బిల్లు ఎంతవరకు పాస్ అవుతుందో తెలియదు కాని అవినీతి పై దేశ ప్రజలు చర్చించేలా చేయగలిగినందుకు అన్నా ఎంతైనా అభినందనీయుడు. అయితే హజారే దీక్షకు అంత సులభంగా కాంగ్రెస్ తలవొగ్గడం విచిత్రంగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ స్వభావ సిద్ధంగా ఉద్యమాలకు, దీక్షలకు తలొగ్గే రకం కాదు. సమస్యలు నాన్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు ఎన్నో జరిగినా కూడా మిన్నకున్న చరిత్ర ఉంది ఈ ప్రభుత్వానికి. భవిష్యత్తులో ఉధృత రూపం దాల్చేదేమో కాని, సమస్యను పరిష్కరించే సమయానికి పట్టణాల్లో ప్రదర్శనలు తప్ప పెద్దగా ఉద్యమం కూడా ఏమీ కనిపించ లేదు. మరి హజారే నాలుగు రోజులు దీక్ష చేయగానే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఒక అంగీకారానికి ఎలా వచ్చింది?  సమస్యను పరిష్కరించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తారేమోనని అనుకున్నా కూడా అలాంటిదేమీ చేయలేదు.   తానొక్కటే మొత్తం క్రెడిట్ తీసుకోవాలనేమో, ఏక పక్షంగా ఆందోళన కారులతో చర్చలు జరిపింది. ఆ రెండువర్గాలు తప్ప మరే ఇతరులకు కూడా బిల్ డ్రాఫ్టు కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు. 2G, కామన్వెల్త్ మొదలైన కుంభకోణాలతో కాంగ్

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటారు.

గూగుల్ నిర్వాకం

గూగుల్ వాడు తన అనలిటిక్స్ సైటులో భారత దేశ పటం ఇలా చూపుతున్నాడు. దీనిలో జమ్మూ&కాశ్మీర్, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాలు భారత్ నుండి వేరు చేసి చూపబడ్డాయి. దీన్ని మనమంతా ఖండించ వలసిన అవసరం ఉంది. దీనిపై కంప్లైంటు ఏ మెయిల్ ఐడికి పంపాలో ఎవరైనా తెలియ జేయ గలరు.

అవినీతిపై యుద్ధం

ప్రతిరోజూ ట్రాఫిక్ పోలీసు వాడికి, తహసీలు ఆఫీసు గుమాస్తాకి, మున్సిపాలిటీ ఇంజనీరుకి, ఎమ్మెల్యేకి, మంత్రికి మామూళ్ళు సమర్పించుకుంటూ బతుకులీడ్వడం అలవాటైన మనకు అన్నా హజారే చేస్తున్న ప్రయత్నం ఏటికి ఎదురీదడంలా కనిపించవచ్చు.  అవినీతి ఇప్పుడు దేశంలో ఎంతగా పాతుకు పోయిందంటే, అదొక తప్పనిసరి వ్యవహారంలా ప్రతి ఒక్కరికి అలవాటై పోయింది. ఊళ్లలోకి వెళ్లి పరిశీలిస్తే క్రిందిలాంటి సంభాషణలు వినడం సర్వ సాధారణం. "కలెక్టర్ ఆఫీసుకు వెల్లినవ్ కదా? పనైందా?" "కాలేదన్నా, పైసలు అడుగుతున్నడు". "అరే, పిచ్చోనివా? పైసలు లేందే పనులైతయా?" పై సంభాషణ ఏం చెప్పుతుంది. ప్రజలు అవినీతి పై నిరసన వ్యక్తం చేయడం లేదు. అదొక ట్రాఫిక్ రూల్ లాగా, ఇంటి పన్నులాగా, కరెంటు బిల్లు లాగా ఇష్టం ఉన్నా లేకపోయినా చేయక తప్పని పనిగా భావిస్తున్నారు. అరవై సంవత్సరాల 'ప్రజా'స్వామ్య పాలన చూసాక ఇక దీన్ని ఎవరూ మార్చలేరన్న భావనకు వచ్చేశారు. ఇక ఇలాంటి భావనకు వచ్చిన తర్వాత "ఎలాగూ మీరు తింటున్నారుగా, వోటేస్తే మాకేమిస్తారు?" అన్న ప్రశ్నలు కూడా మొదలు పెట్టడంలో ఆశ్చర్యమేముంది? కాని, భూతంలా పెరిగిపోయిన అవినీతిక

జయహో అన్నా హజారే

మన దేశానికి అవినీతి ఒక మానని గాయంలా తయారై సలుపుతుంది. యాభై రూపాయలకు ఆశపడి వోటు వేసే సామాన్యుడి నుండి ఐదువేల కోట్లు తీసుకుని సంతకం పెట్టే మంత్రి వరకు ఇది ఒక మహా విషవృక్షంలా తయారైంది. విత్తు ముందా, చెట్టు ముందా అన్నట్టు డబ్బు తీసుకోకుండా మార్పు ఎక్కడ మొదలు కావాలి, సామాన్యుడి లోనా, రాజకీయ నాయకుల లోనా అనేది ఒక తెగని సమస్యగా మారి పోయింది. ఈ రోజున దాదాపు డెబ్బై అయిదు లక్షల కోట్ల డబ్బు అవినీతి పరుల చేతుల్లో పడి స్విస్స్ బ్యాంకుల్లో మూలుగుతుంది. ఈ డబ్బు గనక వినియోగంలోకి వస్తే దాదాపు ఐదు సంవత్సరాలు దేశ ప్రజలు ఎలాంటి టాక్సులు కట్టాల్సిన అవసరం ఉండదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అవినీతిని నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతో. ప్రతి ఏడూ లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా వసూలు చేయ బడుతుంది. ఆపైన ఎన్నో కోట్ల రూపాయల దేశంలోని సహజవనరులకు ప్రభుత్వం ఆధిపత్యం వహిస్తుంది. ఇంతటి సంపదపై ఆధిపత్యం వహిస్తున్నపుడు, సంబధిత పాలకవర్గం ప్రలోభాలకు గురికావడం సహజమైన విషయం. అందుకనే అవినీతిని రూపు మాపడానికి అత్యంత శక్తి వంతమైన నిఘా, విచారణ సంస్థను ఏర్పాటు చేసి, సంబంధిత వ్యక్తులను శిక్షించడం తప్ప వేరే మార్గం లేదు. అలా వచ్

దేవుడికి ఒంట్లో బాగోలేదట

దేవుడికి ఒంట్లో బాగోలేదట! దైవభక్తులారా, మీరంతా తలో దేవున్ని పూజించండి, ఈ దేవున్ని బ్రతికించమని కోరుతూ. దేవుడైన వాడికి మా పూజలతో పనేంటి అనుకుంటున్నారా? ఒద్దొద్దు, కొత్త దేవుళ్ళకు ప్రజల తోనే పని. ప్రజాదరణే వారి బలం. మీరు పూజలు చేయండి, ఇళ్ళల్లో భజనలు చేయండి, ఎప్పటి మాదిరిగానే. వీలయితే పక్కింటి వారిని కూడా కలుపుకోండి. మంత్రులారా, మీకు మీ కమీషన్ల వ్యవహారాల్లో క్షణం తీరిక ఉండదని తెలుసు. భోలక్ పూర్ లో మునిసిపాలిటీ నీళ్ళు తాగి కుక్క చావులు చచ్చినా, మన్యసీమలో విషజ్వరాలొచ్చి  వందల మంది చచ్చినా అక్కడికెళ్ళే మాట దేవుడెరుగు, కనీసం అరగంట సమీక్షా సమావేశం ఏర్పాటు చేసే సమయం కూడా మీకు దొరకదని నాకు ముందే తెలుసు. అయినా అడుగుతున్నాను. మీరు వెళ్లి వారాల తరబడి దేవుడి పాదాల చెంతే ఉండండి. ఆయన తిరిగి లేచి తిరిగే దాకా కదలొద్దు, వదలొద్దు. రాష్ట్రం ఏమై పోతుందో అని భయం అవసరం లేదు. నడుస్తూనే ఉంటుంది ముక్కుతూ మూలుగుతూ, మీరున్నప్పుడు ఎలాగో, లేకపోయినా అలాగే. దేవున్ని మాత్రం కంటికి రెప్పలా చూసుకొండి. ముఖ్యమంత్రిగారూ, మీరు మాత్రం ఎందుకు? రాష్ట్రంలో ఏం వుంది గనక చేయడానికి? వెంటనే వెళ్లి దేవుడి సంగతి చూడండి. మీడియా మహ

ఆత్మహత్యలు నాయకులెవ్వరూ చేసుకోరేం?

ప్రత్యేక తెలంగాణా పోరాటంలో భాగంగా చోటు చేసుకున్న వివిధ రకాలైన పోరాట రూపాలు బహుశా ఏఉద్యమంలో కూడా ఇంతవరకు చోటు చేసుకోలేదేమో! బాధాకరమైన విషయం ఏమంటే ఆత్మాహుతులు, ఆత్మహత్యలు కూడా ఉద్యమ రూపంగా మారడం. వీటి కారణంగా ఆరొందలకు పైగా లేతప్రాణాలు ఆహుతి పోయాయి అని గుర్తొచ్చినప్పుడు మనసున్న ప్రతి మనిషికీ అది వికలం కాక తప్పదు. ఆత్మహత్యలు నాయకులెవ్వరూ చేసుకోరేం? దాదాపుగా ప్రతి వేదికలోనూ తెలంగాణా వ్యతిరేకులు వేసే ప్రశ్న ఇది. అపరిపక్వంగా ఆలోచించే విద్యార్థులెవరైనా ఇలాంటి ప్రశ్నలడిగితే సరే అనుకోవచ్చు, కాని వివిధ పార్టీలకు చెందిన మహానాయకులు, మేధావులమని చెప్పుకు తిరిగే వారు కూడా ఇదే ప్రశ్న వేయడం విస్మయాన్ని కలిగిస్తుంది. దీన్ని అపరిపక్వత అని అనుకోలేం. ఒక తర్కవిరుద్ధమైన భావాన్ని వ్యాపింప చేయడానికి తార్కికమైన వాదన ఉపయోగ పడదు, తర్కరాహిత్యాన్ని శరణు కోరాల్సిందే. అందుకే ఇలాంటి వాదనలు వస్తుంటాయి. నాయకుడంటే ఎవరు? నలుగురినైనా లేదా నాలుగు కోట్లమందినైనా నడిపించగలిగే వాడే నాయకుడు. ఒక సంఘటనపై కోపం తెచ్చుకొని తనను తాను ఆత్మాహుతికి గురి చేసుకునే వాడు నాయకుడు కాబోడు. తన కోపాన్ని ప్రజాగ్రహంగా మలచగలిగే వాడే నాయకుడు. దక్

తెలంగాణా ఏర్పడితే ప్రజల జీవితాలెలా బాగు పడతాయి?

తెలంగాణా ఏర్పడితే ప్రజల జీవితాలెలా బాగు పడతాయి? ఇది కొంతమంది సమైక్య వాదులు, మరికొంత మంది తెలంగాణా సమస్యను సానుకూలంగా అర్థం చేసుకోవాలనుకునే వారికి ఉదయించే ప్రశ్న. దీనికి సులభంగా చెప్ప గలిగే సమాధానం 'అవును, ఇక్కడి నాలుగు కోట్ల మంది ప్రజలు విడిపోతే అభివృద్ధి చెందుతామని భావిస్తున్నారు'. నిజమే భవిష్యత్తును ఇంతకన్నా కచ్చితంగా చెప్పడం కుదరదేమో. ఒకప్పుడు బ్రిటిష్ వారినుండి భారత స్వాతంత్ర్యాన్ని కోరినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలే వెలుగు చూసాయి. అభివృద్ధి కన్నా ముఖ్యమైనది ప్రజల స్వాభిమానం, స్వాతంత్ర్యం.  ఇప్పుడు స్వాతంత్ర్యం లేదా? గత ఇరవై సంవత్సరాలనుండి తెలంగాణాకి చెందిన ఒక్క వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాలేదు. మనది పార్లమెంటరీ తరహా పాలన. ఎక్కువ ఎమ్మెల్యేలు ఎవరిని బలపరిస్తే వారే అధినాయకులు. జనాభాలో తక్కువ శాతంగా ఉన్న తెలంగాణాలో తక్కువ శాతం మందే ఎమ్మెల్యేలు ఉంటారు. పెద్ద పెద్ద వర్గాలను సమకూర్చ గలిగిన నాయకులు సీమాంధ్రలో ఉంటారు. సహజంగా పెద్ద వర్గంగా ఉన్నవారికే అధికారం దక్కుతుంది. ప్రస్తుత దేశ రాజకీయాలలో ముఖ్యమంత్రి అంటే సర్వాధికారాలు చెలాయించ గలిగిన నియంతతో సమానం. గతంలో పరిపాలించిన ఎన్టీయార్