Skip to main content

దేవుడికి ఒంట్లో బాగోలేదట

దేవుడికి ఒంట్లో బాగోలేదట!

దైవభక్తులారా, మీరంతా తలో దేవున్ని పూజించండి, ఈ దేవున్ని బ్రతికించమని కోరుతూ. దేవుడైన వాడికి మా పూజలతో పనేంటి అనుకుంటున్నారా? ఒద్దొద్దు, కొత్త దేవుళ్ళకు ప్రజల తోనే పని. ప్రజాదరణే వారి బలం. మీరు పూజలు చేయండి, ఇళ్ళల్లో భజనలు చేయండి, ఎప్పటి మాదిరిగానే. వీలయితే పక్కింటి వారిని కూడా కలుపుకోండి.


మంత్రులారా, మీకు మీ కమీషన్ల వ్యవహారాల్లో క్షణం తీరిక ఉండదని తెలుసు. భోలక్ పూర్ లో మునిసిపాలిటీ నీళ్ళు తాగి కుక్క చావులు చచ్చినా, మన్యసీమలో విషజ్వరాలొచ్చి  వందల మంది చచ్చినా అక్కడికెళ్ళే మాట దేవుడెరుగు, కనీసం అరగంట సమీక్షా సమావేశం ఏర్పాటు చేసే సమయం కూడా మీకు దొరకదని నాకు ముందే తెలుసు. అయినా అడుగుతున్నాను. మీరు వెళ్లి వారాల తరబడి దేవుడి పాదాల చెంతే ఉండండి. ఆయన తిరిగి లేచి తిరిగే దాకా కదలొద్దు, వదలొద్దు. రాష్ట్రం ఏమై పోతుందో అని భయం అవసరం లేదు. నడుస్తూనే ఉంటుంది ముక్కుతూ మూలుగుతూ, మీరున్నప్పుడు ఎలాగో, లేకపోయినా అలాగే. దేవున్ని మాత్రం కంటికి రెప్పలా చూసుకొండి.

ముఖ్యమంత్రిగారూ, మీరు మాత్రం ఎందుకు? రాష్ట్రంలో ఏం వుంది గనక చేయడానికి? వెంటనే వెళ్లి దేవుడి సంగతి చూడండి.

మీడియా మహారాజుల్లారా మీకిదే అవకాశం. కోతికి కొబ్బరి చిప్ప దొరికినా వదులుతుందేమో గాని, మీరెలా వదులుతారు? నిమిషానిమిషానికి అప్డేట్లు ఇస్తూ మీ ప్రతాపం చూపెట్టండి మరి. అలవాట్లో పొరబాటుగా దేవుడు గారి పాత చరిత్రలు తవ్వడానికి ప్రయత్నించేరు జాగ్రత్త! కొత్తదేవుళ్ళకు పాత చరిత్రలుండవ్. ఉన్నా వాటిని పాతరేయాలి. తెలిసిందా? ఇక చూపెట్టండి మీ ప్రతాపం.  

ప్రజలారా, తోటి బ్లాగర్లారా, మీకిదే విజ్ఞప్తి. మీ ధర్మ సందేహాలు, విమర్శలూ కొంతకాలం పక్కన పెట్టండి. దేవుడి గురించి మీ కామెంట్లు మీకుండొచ్చు, కాని ఇది సమయం కాదు. ఒక మనిషి (సారీ, దేవుడు) అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు వీలైతే సానుభూతి చూపండి. లేకుంటే ఊరుకోండి. అంతే కాని మీ ధర్మసందేహాలతో, దేవుడికి, ఆయన భక్తులకి ఇబ్బంది కలిగించకండి. అర్థమైందా?

Comments

  1. అతని పూర్తి పేరు సత్యనారాయణ రాజు. పుట్టినది మాలపల్లి, అనంతపురం జిల్లా. అతని తల్లితండ్రులు నిరక్షరాస్యులు. అతనేమో స్కూల్ డ్రాపౌట్. స్కూల్ మధ్యలో మానేసిన తరువాత గారడీ విద్యలు నేర్చుకున్నాడు. అనంతపురం జిల్లాలో పని చేసి రిటైరైన మాజీ ప్రిన్సిపల్ సున్నపురాళ్లపల్లె జయరామరెడ్డి గారు వ్రాసిన పుస్తకంలోని సమాచారం ఇది.

    ReplyDelete
  2. ప్రవీణ్ శర్మ గారు,

    సమాచారానికి ధన్యవాదాలు.

    అజ్ఙాత గారు,

    వ్యాఖ్యకు ధన్యవాఅలు.

    ReplyDelete
  3. ఇందాకే మా తమ్ముడి ఫ్రెండ్ వచ్చాడు. సత్యనారాయణ రాజుకి టివి చానెళ్లు పనిగట్టుకుని పబ్లిసిటీ ఇవ్వడం గురించి చెపుతూ నవ్వుతున్నాడు. సత్యనారాయణ రాజు స్కూల్ డ్రాపౌట్ అని నేను చెప్పాను. స్కూల్ డ్రాపౌట్‌ని జనం అంత గుడ్డిగా నమ్మడమేమిటని అతను ఇంకా నవ్వుకున్నాడు.

    ReplyDelete
  4. @Hari, @Praveen:

    Really ridicoulous to see presidents, governors etc. fawning over a "godman" LOL!

    In what capacity is Geetha Reddy camping in Puttaparthi? Why should we pay for her stay there?

    ReplyDelete
  5. Jai,

    That is what my rhetoric is all about.

    Thanks for the response.

    ReplyDelete
  6. ప్రవీణ్ మళ్ళీ అర్ధంలేని కామెంట్లు మొదలెట్టారా!
    ఐన్ స్టీన్ కుడా చదువుకోని వ్యక్తే. ఆయన మీదా బాగా నవ్వండి మీరు మీ గొప్ప స్నేహితుడూ.

    ReplyDelete
  7. @ప్రవీణ్,

    కారల్ మార్క్స్ లా బాగా చదువుకొని, బుర్రలు తినే పెద్ద పెద్ద పుస్తకాలు రాసి ఇంట్లో పని మనిషితో సంబందం పెట్టుకొని పిల్లల్ని కంటె నువ్వు ఒక్క మాట అనలేదు. ఎందుకు చెప్మా!?

    ReplyDelete
  8. Einstein worked as professor in University. Who told you that Einstein was uneducated or dropout?

    ReplyDelete
  9. సృష్టి మొదలైనప్పటినుండీ ఇప్పటి వరకు సంఘటనలు జరిగాయే గాని అద్భుతాలు జరగలేదు. మహత్యాలు పుస్తకాలలో, గ్రంధాలలో తప్ప నిజంగా జరిగిన దాఖలాలు లేవు. ఒక మనిషిని దేవుడిని చేయడానికి అతనికి మహత్యాలు అంటగట్టడం వ్యాపార సూత్రాలలో భాగమే గాని నిజంగా ఎవరికీ ఎలాంటి అద్భుత శక్తులు లేవని మన ప్రజలకు నిరూపించాల్సిన బాధ్యత మేధావులు, విద్యావంతుల మీద వుంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ