Skip to main content

బాబా దేవుడా, మనిషా?


సత్యసాయిబాబా శరీరావయవాలు చికిత్సకి సహకరిస్తున్నాయని తాజా వార్త. సంతోషం. గత వారం పది రోజులుగా రోజూ ఇలాంటి వార్తలే వస్తున్నాయి తప్ప ఇదమిద్ధంగా ఇది జరిగింది, దీనికి ఈ చికిత్స చేస్తున్నాం అని ఎక్కడా చెప్పడం లేదు. ఇలా ఇంకెంత కాలం చేస్తారో వేచి చూడ్డమే.

ఈ మధ్యన రకరకాల వాదోపవాదాలు ఊపందుకుంటున్నాయి. సాయి దేవుడని కొందరు, కాదు మనిషే అని కొందరు. మొత్తానికి వీరందరూ అస్తికులే నండోయ్, నమ్మనివారు నాస్తికులనుకునేరు! అస్తికులంటేనే నమ్మేవారని అర్థం. నమ్మే వారంటే, తర్కం జోలికి వెళ్ళకుండా దేవునిపై విశ్వాసం ఉంచేవారనికదా అర్థం? ఎందుకంటే, ఎక్కడైతే తర్కం ఉంటుందో అక్కడ ప్రశ్న ఉంటుంది, మూఢవిశ్వాసానికి స్థానం ఉండదు. అటువంటప్పుడు అస్తికులై ఉండి కూడా సత్యసాయి దేవుడని నమ్మని వారినేమనాలి? నమ్మీ నమ్మనివారనా? సగం తర్కించి, సగం నమ్మే వారనా?

ఏదేమైనప్పటికీ, వీరి మధ్య వాదనలు మాత్రం జోరుగానే నడుస్తున్నాయి. సాయి దేవుడైతే చికిత్సలు చేయడం ఎందుకు అని కొందరు. నిజమే మరి, సర్వ జనులను కాపాడే వాడికి తన శరీరం మీద కూడా ఆధిపత్యం ఉండాలి కదా!

మరి కొందరు మాత్రం దేవుడైనా కూడా, మానవ రూపంలో ఉన్నప్పుడు అన్ని రకాలా ఈతి బాధలు తప్పవని సెలవిస్తున్నారు. సో, దేవుడైనా కూడా మానవ జన్మమేట్టితే ఈ బాధలన్నీ తప్పవన్న మాట! మరి అలాంటప్పుడు ఈ తప్పని ఈతి బాధలు తప్పించుకోవడానికి దేవుడి పంచన జేరడమెందుకు? అనే అనుమానం రాక మానదేమో?

ఇదిలా ఉండగా గతంలో బాబాగారే ఇచ్చిన స్పీచిలో శరీరం మిధ్య అని, ఆత్మే సత్యమని శెలవిచ్చారు. పైగా ఆత్మంతే వేరేమీ కాదు, అన్ని ఆత్మలు కూడా ఆ పరమాత్మే అని తేల్చేసారు. అంటే అందరూ దేవుళ్ళేనన్న మాట!

మరి అందరూ దేవుళ్ళే అయినప్పుడు, ఇతరులకు, ఈ మానవ రూపంలో ఉన్న బాబాకి తేడా ఏమిటి? అలా కాక ఇతరులవన్నీ ఆత్మలే, బాబాది మాత్రమే పరమాత్మ అయినప్పుడు, మరి బాబా తప్పుగా ఎలా చెపుతాడు? మరీ ప్రశ్నలు ఎక్కువయ్యాయా? ఇకాపేద్దాం మరి!

Comments

  1. In Indic traditions there is no concept God similar to West Asian (not Western, West borrowed their God from West Asia) concept of God.

    As said that, in Indic traditions, we have Atma and Paramatma (Para Brhma). God lives within one self. Atma can attain higher status by satwik Karma.

    So there is a chance for each and every one of us to realize Paramatma. In Western theology only one person can be son of God, and every one else must go through him to realize Paramatma.

    So don't confuse with Western concept of God with Indian concept of Paramatma. They are no the same.

    ReplyDelete
  2. అనానిమస్ గారు,

    మీ సమాచారానికి ధన్యవాదాలు.

    మీరు చెప్పిందొకటే సత్యమైతే ముక్కొటి దేవతలు అవసరం లేదు కదా? ఆ పైన బాబాలు కూడా అనవసరమే కదా?

    సత్యసాయి బాబా ఎలాంటి గత చరిత్ర వల్ల సాత్వికత సాధించి పరబ్రహ్మగా మారాడు?

    ReplyDelete
  3. హరి గారు, ఈ ప్రశ్నలు మీరు ఇతరులతో వాదనలు చేయటానికి వేస్తున్నారా? లేక నిజం గా "సత్యం" తెలుసుకోవటానికి వేస్తున్నారా?

    Srinu

    ReplyDelete
  4. *సత్యసాయి బాబా ఎలాంటి గత చరిత్ర వల్ల సాత్వికత సాధించి పరబ్రహ్మగా మారాడు.*

    మంచి ప్రశ్న మీ దృష్ట్టిలో పరబ్రహ్మ కి డెఫినేషన్ ఎమీటి?పరబ్రహ్మగా మారిన వారు ఇలా ఉండాలని ఎమైనా మీకు తెలిసిన లక్షణాలు ఉన్నాయా? మీకు తెలిసే ఉంట్టుంది కనుక ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు, నాకు తప్పక చెప్పగలరు. Thanks in advance.

    Rama

    ReplyDelete
  5. 'సత్యం' తెలుసుకోవడమంటే ఏమిటి? ఎదురు ప్రశ్నలు వేయకుండా చెప్పింది వినడమేనా?

    ReplyDelete
  6. Rama

    "పరబ్రహ్మ" కోసం మొదటి అనానిమస్ కామెంటు చూడండి.

    ReplyDelete
  7. 1. "మీరు చెప్పిందొకటే సత్యమైతే ముక్కొటి దేవతలు అవసరం లేదు కదా? ఆ పైన బాబాలు కూడా అనవసరమే కదా?"

    2. "సత్యసాయి బాబా ఎలాంటి గత చరిత్ర వల్ల సాత్వికత సాధించి పరబ్రహ్మగా మారాడు?"

    Answer for 1)
    ముక్కొటి దేవతలు -> (may be) these people (Soul's) attained higher status than the ordinary Soul's. In our traditions we give (higher status)/respect to Parents, Guru's, elderly people. Why? It is the realization that they are several steps ahead of our own Soul. Don't you think that Parents, Guru's and elders' won't make any mistakes or crimes. Yes they do. Our traditions know it. Still it asks us to respect those Souls.

    At birth all souls are equal. But the Karma determines the elevated or degraded status of the soul.

    Note: this concept can not be explained in plain English terms in the blog world. It needs focused in-person discussion.

    Answer for 2)

    I did not claim that he attained పరబ్రహ్మ status. I understand that you are pointing the general public view abut him.

    Do you know that the West also recognize great Souls time to time. I am talking about Saints and Sainthood conferred on people time to time in the West.

    Do you ever realize that this Sainthood Business is anathema (violates the most fundamental principles of their belief system) of their religion. Their core principle is as follows

    A) West Kirastani

    God <--> Son <--> people

    But this Sainthood Business added another layer as follows.

    God <--> Son <--> Saints <--> people

    B)Arab Turaka

    God <--> Prophet <--> people

    They added another layer as follows

    God <--> Prophet <--> Sufi Saints <--> people


    Note 1: ముక్కొటి దేవతలు may be like Great Souls or Saints or Sufi's. As times passes they were elevated to minor Gods, Demi Gods, Gods. But the word God in this context did not point to Para Brahma.

    Note 2: We are too materialistic to know the ultimate truth. If you want to seek the real truth, please follows the Yogic path advocated by Lord Krishna.

    Take it easy!.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ