Skip to main content

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను. 

మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను.

రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను. 

ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి.


గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు. 

దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది. 

ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటారు. అందులో కొన్ని బూతు అర్థాలను కూడా స్ఫురించేలా ఉంటాయి. ఇవన్నీ హిట్లకోసం చేసే ప్రయత్నాలన్న మాట!


Comments

  1. ఈ స్క్రీన్‌షాట్ చూడండి: http://vizaghost.net/images/Clipboard01.jpg మూఢ నమ్మకాల విషయంలో పాలక వర్గాన్ని విమర్శిస్తూ వ్రాసిన టాపిక్‌ని ఎక్కువ మంది చదవలేదు.

    ReplyDelete
  2. కొంతవరకూ మీ ఆలోచన కరెక్ట్ అయినా మీరు టపా పెట్టిన టైం ఈ హిట్స్ విషయం లో చాలా ముఖ్యం కనుక మీ కంక్లూషన్ లాజికల్ గా కరెక్ట్ కాదు.. నేను అరుణాచల్ ప్రదేశ్ గురించి పెట్టిన టపా చూశాను కానీ దాని ముందు టపా గురించి ఇప్పుడు మీరు చెబితే తప్ప నాకు తెలియదు.. భారతకాలమానం ప్రకారం ఆదివారం రాత్రి టపా పెట్టండి ఎక్కువ హిట్స్ వస్తాయి.. ఈ విధంగా రెండు వారాలు చెయ్యండి అప్పుడు అవి పోల్చి చూడండి..(ఏదో ఒక ఐదు పైసల సలహా నచ్చకపోతే పిచ్చపిచ్చగా లైట్ తీస్కోండి ;))

    ReplyDelete
  3. అవినీతిపై యుద్ధం సంగతి అందరూ చాలాచోట్ల చదివీ/వినే ఉంటారు కాబట్టి కొత్తవిషయం కాదని చదవలేదు. గూగులోడి వార్త ఎక్కడా వినలేదని చెప్పి తెరిచి చూశారు.

    ReplyDelete
  4. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం ఉన్నవాళ్లు అవినీతి వ్యతిరేక పోరాటాలని అర్థం చేసుకుంటారా? అవినీతి విషయంలో వాళ్లు చెప్పేవి పైపై కబుర్లే. అవినీతి గురించిన మీ టాపిక్‌లో మొదటి కామెంట్ చదివారు కదా, అతను ఏమి వ్రాసాడో.

    ReplyDelete
  5. కార్తీక్ గారు,

    నా ఉద్దేశం వివాదాస్పదంగా ఉన్న విషయాలపై చదువరులు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని ఒక పరిశీలన మాత్రమే. మీ సలహాకి ధన్యవాదాలు.

    ప్రవీణ్ గారు,

    లింక్స్ కి ధన్యవాదాలు.

    అనానిమస్,

    అది కూడా పాయింటే.

    ReplyDelete
  6. స్క్రీన్‌షాట్ల మీద క్లిక్ చేసి చూడండి. మనవాళ్ళకి సినిమాల మీద ఉన్న ఆసక్తి సమాజం మీద లేదని అర్థమవుతోంది. బజ్‌లో నన్ను అనుసరించేవాళ్ళూ ఉన్నారు. వాళ్ళలో కొందరు తెలంగాణావాదులు, కొందరు నాస్తికులు, స్త్రీలకి సంబంధించిన ఇష్యూస్ మీద ఆసక్తి ఉన్న కొందరు ఉన్నారు. సినిమాలూ, సొల్లు కబుర్ల గురించి వ్రాస్తే ఫాలోవర్స్ పెరుగుతారు కానీ సినిమాల మీద నాకు అంత ఆసక్తి లేదు. చిన్నప్పుడు సమాజం గురించి ఏమీ తెలియని రోజుల్లో సినిమా పత్రికలే చదివేవాడ్ని. సమాజంలో సినిమాలు కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గ్రహించడానికి.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ