Skip to main content

గూగుల్ నిర్వాకం


గూగుల్ వాడు తన అనలిటిక్స్ సైటులో భారత దేశ పటం ఇలా చూపుతున్నాడు. దీనిలో జమ్మూ&కాశ్మీర్, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాలు భారత్ నుండి వేరు చేసి చూపబడ్డాయి. దీన్ని మనమంతా ఖండించ వలసిన అవసరం ఉంది. దీనిపై కంప్లైంటు ఏ మెయిల్ ఐడికి పంపాలో ఎవరైనా తెలియ జేయ గలరు.

Comments

  1. దీనిగురించి ఎలా అర్థం చేసుకోవాలో, నిజమయితే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో నాకు తెలియదు కానీ...ఒక సందేహం...ఒకవేళ గూగుల్ వాళ్ళ నెట్ వర్క్ ఈ రాష్ట్రాల్లో లేదేమో...అందుకని వాటిని కలర్ లేకుండా ఉంచారేమో...కనుక్కోండి.

    ReplyDelete
  2. బ్రిటిష్ వాళ్ళ టైమ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇండియా, చైనాల మధ్య వివాదం ఉంది. కాశ్మీర్ ఇండియాలో లేనట్టు చూపించడమే బాలేదు. కాశ్మీరీ ముస్లిం నాయకులు ఒప్పుకుంటేనే జవహార్ లాల్ నెహ్రూ కాశ్మీర్‌ని ఇండియాలో ఉంచారు. అంతే కానీ కాశ్మీర్‌ని ఇండియా ఆక్రమించుకోలేదు. అరుణాచల్ ప్రదేశ్‌ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో హిందూ మతాన్ని నమ్మే గిరిజన జాతులు రెండే ఉన్నాయి. అందుకే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదు అనే భావన బలపడుతోంది.

    ReplyDelete
  3. ప్రవీణ్ గారు,

    మీరు పొరబడ్డట్టున్నారు. అరుణాచల్‌ను ఎవరూ ఆక్రమించలేదు. అది భారత దేశంలో ఒక రాష్ట్రం. ఇక్కడ చూడండి. అయితే చైనా మాత్రం అరుణాచల్ మన దేశంలో భాగంగా ఒప్పుకోవడం లేదు. అందుకే అరుణాచల్ వారికి, కాశ్మీర్ వారికి ప్రత్యేక వీసాలు మంజూరు చేస్తుంది.

    ReplyDelete
  4. వికీపీడియాలో సమాచారాన్ని ఎవరైనా ఎడిట్ చెయ్యొచ్చు. బ్రిటిష్ వాళ్లు ఇండియాని ఆక్రమించుకోవడానికి ముందు ఇండియా ముఘల్ సామ్రాజ్యవాదుల పాలనలో ఉండేది. అప్పట్లో ముఘల్ సామ్రాజ్యం ఉత్తరాన కాబూల్ నుంచి దక్షిణాన తిరుచ్చిరాపల్లి వరకు, తూర్పున బంగ్లాదేశ్ నుంచి పశ్చిమాన ఇరానీ బెలూచిస్తాన్ వరకు విస్తరించి ఉండేది. అరుణాచల్ ప్రదేశ్ ముఘల్ సామ్రాజ్యంలో భాగంగా లేదు. అరుణాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జాతుల సంస్కృతి బర్మా సంస్కృతికి దగ్గరగా ఉంది. అక్కడ 80% మంది గిరిజన జాతులవారే కానీ ఆ జాతులలో రెండు జాతులవారు మాత్రమే హిందూ మతాన్ని నమ్ముతారు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ ఒకప్పుడు ఇండియాలో భాగం కాదేమో అనిపిస్తుంది. నేపాల్‌లో 90% మంది హిందువులు. ఎందుకంటే నేపాల్ ఒకప్పుడు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. నేపాల్‌లో నేముని అనే హిందూ సన్యాసి కూడా ఉండేవాడు. అతని పేరు మీదే దేశం ఏర్పడింది. భూటాన్‌లో 25% మంది హిందువులు, ఆ దేశం కొన్ని వందల సంవత్సరాల నుంచి బౌద్ధుల పాలనలో ఉన్నప్పటికీ. కానీ అరుణాచల్ ప్రదేశ్‌లో హిందువుల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? సాంస్కృతిక తేడాలు చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదేమో అనిపిస్తోంది.

    ReplyDelete
  5. ప్రవీణ్ గారు,

    బ్రిటిష్ వారు ఆక్రమించక ముందు దేశం ఎప్పుడూ ఒకటిగా లేదు. వందల కొద్దీ దేశాలు ఉండేవి. కాబట్టి బ్రిటిషర్ల కంటే ముందు India అనే దేశాన్ని ఊహించలేం.

    అలాగే హిందూ జనభా ఉంది కాబట్టి నేపాల్ మనదనీ చెప్పలేం.

    పైగా కాశ్మీర్‌లో అలజడులు జరుగుతున్నాయి కానీ, అరుణాచల్‌లో ఎవ్వరూ భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం లేదు. అక్కడ ప్రజాస్వామ్య యుతమైన పాలన, ముఖ్యమంత్రి ఉన్నారు.

    ఏదేమైనా, కాశ్మీర్, అరుణాచల్ లను అధికారికంగా ఐక్యరాజ్యసమితి భారత భూభాగాలుగా గుర్తిస్తున్నప్పుడు (వాస్తవాధీన రేఖకు లోబడి), గూగుల్ వాడు ఆ ప్రాంతాలు మన దేశానికి చెందనివిగా చూపడం తగని పని.

    ReplyDelete
  6. Google has adapted country based policy. www.google.com shows all disputed lands in all places separately, but country specific urls like google.co.in, google.co.cn, google.co.pk show maps as per their country standard.

    Even bbc does not show kashmir as prt of India but shows it with separate marking.

    ReplyDelete
  7. హరి దోర్నాల గారు,
    నేను మీబ్లాగుని చదువుతూ ఉంటాను. మీరు రాసిన దానిని చదివితే ఒక సగటు మనిషి ఆవేదనా, మధ్యతరగతి వారి దేశభక్తి కనిపిచ్చింది. మీరు ప్రపంచం లో ప్రస్తుత జరిగే పరిణామాలనిటిని పై పై చూస్తున్నారని పిస్తున్నాది. పశ్చిమ దేశాల స్ట్రేటజి మీకు బాగా అర్థమౌతుంది. ఇతను కొన్ని సంవత్సరాలు పగలు రాత్రి కష్టపడి ఎంతో రీసర్చ్ చేసి పుస్తకం రాశాడు. ఈ పుస్తకం లో ప్రతి లైన్ కి ఇచ్చినన్ని రిఫరేన్స్లు నేను ఇప్పటివరకు చదివిన ఏ పుస్తకంలో లేవు. సుమారు 200 పేజిలు రిఫరెన్స్లు ఇచ్చి ఎంతో అథేంటిక్ గా రాశారు. ఇప్పుడు యు యస్ లోని ప్రిన్స్ టన్ యునివర్సిటి లో ఈపుస్తకం మీద అకేడేమిక్ చర్చ జరిపారు. దేశంలో జరిగే సంఘటనలు వాటి సమాధానల కోసం చీకట్లొ వెతుకునే మనకు ఇది మంచి దీపం లాంటిది. ఈ పుస్తకం 430 పేజీలు ఉంట్టుంది.

    http://breakingindia.com/?page=videos&playlist=84946D0C3A116B00
    Rs550/- if you place order in Flipkart

    ఈ పుస్తకం చదివి నాకు నచ్చ లేదు అని చెపితే. నేను మీకు డబ్బులు చెల్లిస్తాను.

    శ్రీనాథ్

    ReplyDelete
  8. శ్రీనాథ్ గారు,

    మీరు చెప్పిన పుస్తకం తప్పక చదవడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ