Skip to main content

ఆత్మహత్యలు నాయకులెవ్వరూ చేసుకోరేం?

ప్రత్యేక తెలంగాణా పోరాటంలో భాగంగా చోటు చేసుకున్న వివిధ రకాలైన పోరాట రూపాలు బహుశా ఏఉద్యమంలో కూడా ఇంతవరకు చోటు చేసుకోలేదేమో! బాధాకరమైన విషయం ఏమంటే ఆత్మాహుతులు, ఆత్మహత్యలు కూడా ఉద్యమ రూపంగా మారడం. వీటి కారణంగా ఆరొందలకు పైగా లేతప్రాణాలు ఆహుతి పోయాయి అని గుర్తొచ్చినప్పుడు మనసున్న ప్రతి మనిషికీ అది వికలం కాక తప్పదు.

ఆత్మహత్యలు నాయకులెవ్వరూ చేసుకోరేం?

దాదాపుగా ప్రతి వేదికలోనూ తెలంగాణా వ్యతిరేకులు వేసే ప్రశ్న ఇది. అపరిపక్వంగా ఆలోచించే విద్యార్థులెవరైనా ఇలాంటి ప్రశ్నలడిగితే సరే అనుకోవచ్చు, కాని వివిధ పార్టీలకు చెందిన మహానాయకులు, మేధావులమని చెప్పుకు తిరిగే వారు కూడా ఇదే ప్రశ్న వేయడం విస్మయాన్ని కలిగిస్తుంది. దీన్ని అపరిపక్వత అని అనుకోలేం. ఒక తర్కవిరుద్ధమైన భావాన్ని వ్యాపింప చేయడానికి తార్కికమైన వాదన ఉపయోగ పడదు, తర్కరాహిత్యాన్ని శరణు కోరాల్సిందే. అందుకే ఇలాంటి వాదనలు వస్తుంటాయి.

నాయకుడంటే ఎవరు? నలుగురినైనా లేదా నాలుగు కోట్లమందినైనా నడిపించగలిగే వాడే నాయకుడు. ఒక సంఘటనపై కోపం తెచ్చుకొని తనను తాను ఆత్మాహుతికి గురి చేసుకునే వాడు నాయకుడు కాబోడు. తన కోపాన్ని ప్రజాగ్రహంగా మలచగలిగే వాడే నాయకుడు.

దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీపై తెల్లవాడు దాడి చేసినప్పుడు మొదట ఆయనకి విపరీతమైన కోపం వచ్చి ఉంటుంది. వెంటనే వెళ్లి ఆ తెల్లోడిని చంపి వేయాలనే కోపం వచ్చి ఉంటుంది. కాని ఆ కోపాన్ని నిగ్రహించుకున్నాడు. నిగ్రహించు కున్నాడు కాని మరచిపోలేదు. అందుకే బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పంపి వేసే వరకూ విశ్రమించ లేదు. మరచి పోయి ఉంటే మరుసటి రోజున మామూలుగా అందరు లాయర్ల మాదిరిగానే కోర్టుకు వెళ్ళుతూ సాధారణ జీవితం గడిపి ఉండేవాడు.

నాయకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు అని అడగడం, గాంధీ ఎందుకు డయ్యర్ ని చంపలేదు? అని అడిగినట్టు ఉంటుంది. ఇలా అడిగే సమైక్యాంధ్ర నాయకులు మరి సమైక్యాంధ్ర కోసం తమలో ఒకరైనా ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదేం అని అడిగితే ఏం చెపుతారు? తిరిగి పై వివరణే ఇవ్వాల్సి ఉంటుంది. ఆత్మ హత్యలు దేనికీ పరిష్కారం కాదు. మనిషికి ఆగ్రహం వచ్చినప్పుడు నిగ్రహించుకోలేని వాడు ఎదుటివాడిపై దాడి చేసి నేరస్తుడిగా మారుతాడు. లేదా తనకు తాను ఆశక్తుడిగా భావించిన వాడు, ఆత్మహత్యకు పాల్పడతాడు. ఇలాంటి వారు అదృష్టవశాత్తూ చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఉంటారు. ఆ విధంగా చూసినప్పుడు ఒక్కడు నిగ్రహం కోల్పోయి ఆత్మాహుతికి పాల్పడితే అది ఒక లక్ష మంది ఆగ్రహానికి ప్రతిరూపంగా భావించాలి. 

అందువలననే ఒక పది మంది రైతులో, చేనేత కార్మికులో  ఒకేసారి ఆత్మహత్యలకు పాల్పడ్డప్పుడు చాలా చర్చలు జరుగుతాయి. అవి రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పురికొల్ప బడతాయి. అదంతా కేవలం పదిమంది చనిపోయినందుకే కాదు. ఆ పదిమంది వెనక ఉన్న పదిలక్షలమంది ప్రజల వేదనను గమనించడమే దానికి కారణం. 

అదేవిధంగా ఆరొందల మంది ఆత్మహత్యలు కేవలం ఆ ఆరొందల మంది ఆకాంక్షలను ప్రతిబింబించవు. అవి యావత్తు తెలంగాణా ప్రజల ఆకాంక్షలను తెలియ బరుస్తాయి. కాని దురదృష్టవశాత్తూ వీటిపై జరగాల్సినంత, జరగాల్సిన విధంగా చర్చ జరగడం లేదు. మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మరణాలపై హేళనా పూర్వకంగా వ్యాఖ్యానాలు చేయడం. జోకులు పేల్చడానికి ప్రయత్నించడం. 

ఆత్మహత్యలను ఎవరూ కోరుకోవడం లేదు, కాని అవి జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒకటో రెండో ఆత్మాహుతుల వార్తలు పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం. ఆత్మహత్యలకు పాల్పడ వద్దని తెలంగాణాలోని అన్ని పార్టీల నాయకులు, JAC వారు విజ్ఞప్తి చేశారు. అయినా ఆగడం లేదు.

భవిష్యత్తులోనైనా ఈసమస్యకు తొందరగా పరిష్కారం లభించి ఆత్మహత్యలు ఆగిపోతాయని ఆశిద్దాం.

Comments

  1. "ఒక తర్క విరుద్ధమైన భావాన్ని వ్యాపింప చేయడానికి ,తార్కికమైన వాదన ఉపయోగపడదు ,తర్కరహిత్యాన్ని శరణు కోరాల్సిందే .అందుకే ఇలాంటి వాదనలు వస్తుంటాయి "చాలా బాగ చెప్పారు .మీరు రాసిన విషయం లో గొప్ప వేదనుంది.రాసిన పద్దతిలో చాలా హేతుబద్దత ఉంది .మొత్తంగా నిజాయితి ఉంది .

    ReplyDelete
  2. Hari, thanks a lot for the mature post.

    This type of rhetoric is just a diversion tactic. I once responded to this question by "KCR (లేదా ఇంకో నాయకుడు) ఆత్మహత్య చేసుకుంటే, నువ్వు మాకు తెలంగాణ తేచ్చిస్తవా?". No answer, he just changed topic and started other nonsense like "తెలంగాణ వచ్చినంక దొరల రాజ్యమయితది"

    I have no problems with people criticizing suicides but they don't even express a word of regret.

    ReplyDelete
  3. Thanks Udaya

    Thanks Jai,

    Coming across this question very often and thought of expressing my views.

    ReplyDelete
  4. ఆత్మ హత్యలపై మీరు రాసిన తీరు బాగుంది...
    నిజమే...నాయకులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు..
    చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు..
    మరి అమాయకుల సంగతి..
    దేశం ఎంతో ముందుకు పోతుంది అనుకుంటూనే మనం కొన్ని విషయాలలో
    వెనుక బడి ఆలోచిస్తున్నాం .
    రోటి, కపడా , మఖాన్ ..ఈ మూడు ఉంటె చాలు అనుకునే సగటు మనిషి
    నేడు ఆత్మ హత్య చేసుకోవడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటో ముందు ఊహించండి ..
    ఒక పరిశోధక సిద్దాంత వ్యాసం లో చెప్పినట్లు ఆత్మా హత్య ఒక మానసిక సంచలనం...
    ఒక సునామి లాంటి తీవ్రమైన మానసిక ఆవేదనకు గురి అయితేనే మనిషి ఇటువంటి పనులు చేడానికి పూనుకుంటాడని దీని భావం..
    మరి ఇలాంటి మానసిక సంచలనాలకు గురవుతున్న యువతకు, మానసికంగా క్రుంగి ఉన్నవారికి
    ఎన్ని ప్రభుత్వాలు, గవర్నమెంట్లు, నాయకులు , సంస్థలు చేయూత నిస్తున్నాయి.
    ఇక్కడ ప్రాంతం అనేది ముఖ్యం కాదు..
    ఏ ప్రాంతం వారైన వారు ఆత్మహత్య చేసుకొని చనిపోతే మనసున్న ప్రతి ఒక్కరు బాధపడతారు..
    మానవత్వం ఉన్న ప్రతి ప్రాంతం వాడు బాధ పడతాడు..
    ఇవ్వన్ని కూడా నాణానికి ఒక పక్క మాత్రమె...
    కాని నేడు ఆత్మహత్యల పేరుతొ దేశంలో అనేక చోట్ల దౌర్జన్యా హత్యలు, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి ) .వీటి కి సమాధానం ఏ సగటు మనిషి దగ్గర వుండదు.ఒక్క భగవంతుని వద్ద తప్ప)

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ