Skip to main content

దోపిడీ అంటే ఏమిటి?

తాడేపల్లిగారు నిన్న ఒక వ్యాఖ్యలో అమాయకంగా అసలు దోపిడీ అంటే ఏమిటి?  దోపిడీ దారులెవరు? ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం లో బిజినెస్ చేసుకుంటే అది దోపిడీయా? అంటూ ప్రశ్న వేశారు.

దానికి నాకన్నా బాగా ఈరోజు ఈనాడు పేపర్ బాగా సమాధానం చెప్పినట్టుంది. అధికారం మనదైతే అడ్డూ అదుపూ లేకుండా ఎలా భొంచేయవచ్చో ఈ వార్తలు చూస్తే తెలుస్తుంది.





ఇది ఒక రోజు సమాచారం మాత్రమే, ఒక నెల పేపర్లు తిరగేస్తే చాలు, కొన్ని వందల పేర్లు బయటికొస్తాయి!

Comments

  1. పైవి ఖచ్చితంగా దోపిడీయే, తాట తీసి ఎండగట్టాల్సిందే. గుడిసెల వెంకటసామి భూఆక్రమణలు, చెన్నారెడ్డి వసూలు చేసిన చందాలు, కెసిఆర్ మజగాన్ డాక్లో పెట్టిన 600కోట్లు, పొన్నాల మింగిన జలయజ్ఞం వాటా దోపిడి కిందికి రాదా?

    ReplyDelete
  2. DMK Karunanidhi-Raja-Congress swindled Rs.1,76,000 crores, should we ask for seperate country minus Tamil Nadu or seperate TN for DMK-AIADMK?

    CWG scam-3500 crores, should we seperate Maharashtra for Suresh Kalmadi?

    Telgi Scam -Rs. 20000 crore plus - seperate Karnataka.

    Fodder scam - 900crores, should we seperate Bihar for Lalu?

    IPL scam - Kerala be seperated for Sashi Tharoor?

    Harshad Mehta - 4000Crores, Ketan Parekh - 1000Crores, seperate Mahrashtra, Gujarath for them.

    Satyam- 14000 crores - Give up AP to Raju.

    Anything left?
    Your reasons for seperation are far from any logical reasoning or sense and are in the interest of vested interests.

    We must&will remain united, to solve these issues.

    ReplyDelete
  3. మొదటి అఙ్ఞాత,

    అవన్నీ జరిగుంటే దోపిడీలే.

    రెండవ,

    మీరు చెప్పినవన్నీ దోపిడీలే. సమాచారం పంచుకున్నందుకు ధన్యవాదాలు. కానీ అవన్నీ ఒకప్రాంతం మీద మెజారిటీ అద్దం పెట్టుకుని ఇంకో ప్రాంతం వారు చేసే దోపిడీలు కావు.

    ReplyDelete
  4. ఇదే దోపిడిదారు మరొక దోపిడిదారుతో కలిసి అనంతపురం జిల్లాలో ఇనుప ఖనిజాన్ని భారీగా దోచుకున్నట్టు అభిజ్ఞవర్గాల కధనం. దోపిడిదారులకి జాతి, ప్రాంత, మత, కుల, వర్గ విచక్షణ ఉంటుందని మీరు నమ్మితే, ప్రత్యేకవాద భావజాల ప్రభావం మీ ఆలోచనా శక్తిని ఒక్కింత తక్కువ చేసిందేమోనని అనిపిస్తుంది, హరి గారు.

    ReplyDelete
  5. Edge గారు,

    కోస్తాలో, రాయలసీమలో కూడా దోపిడీ ఎక్కువగానే ఉంది. కాదనడం లేదు. కోస్తా కారిడార్, ఓబులాపురం, బయ్యారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వీటిపై ప్రజలు చైతన్యం కావలసిన అవసరం ఉంది.

    అయితే తెలంగాణా విషయంలో అది ఇలా జరుగుతున్న దోపిడీతో పాటు ప్రాంతీయ విచక్షణని కూడా ఎదుర్కుంటూ వుంది. కారణం ఒక్కరని చెప్పలేం, కాని పరిష్కారం మాత్రం ప్రత్యేక తెలంగాణాయేనని ఇక్కడివారు బలంగా నమ్మడానికి కారణాలున్నాయి.

    బ్రిటిష్ వారు పరిపాలించిన సమయంలో కూడా ఇలాంటి చర్చలు జరిగాయి. ప్రజలు తక్షణ పరిష్కారంగా స్వాతంత్ర్యాన్ని కోరుకున్నారు - కాబట్టి గాంధీని నమ్మారు. కమ్యూనిస్టులు చెప్పిన ఆర్థిక సిధ్ధాంతాలు వారికి పట్టలేదు.

    ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ