Skip to main content

అవినీతి భాగోతం

రాజశేఖర్ రెడ్డి వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఈ రోజు పెద్ద గొడవ జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలలో ఎంతో కొంత నిజం తప్పకుండా వుండే అవకాశం ఉంది. అయినా ఎంతో పరిశోధించాల్సిన అవసరం లేదు. కళ్ళముందే వట వృక్శాల్లా పెరిగి పోతున్న ఆయన బంధువుల కంపెనీలే చెపుతున్నాయి. అయితే రాజశేఖర రెడ్డి ఎదురు దాడిగా చంద్రబాబు పై చేసే ప్రతి ఆరోపణలకు కొంతమంది ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్ర బాబు కూడా అవినీతి పరుడే అయినప్పటికీ అది ఇప్పుడు అంత ప్రస్తుతం కాదు. ఎందుకంటే అధికారం లోకి వచ్చే వరకు రాజశేఖర రెడ్డి చంద్రబాబు పై ఎన్నో ఆరోపణలు చేసాడు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో ఏ లాంటి చర్యలూ తీసుకోలేక పోయాడు. పైగా తనపై వచ్చిన ఆరోపణలకు ప్రత్యారోపణలతో జవాబివ్వడం నిజంగా సిగ్గు చేటయిన విషయం.

అయితే వీరిదరు సృష్టిస్తున్న గందరగోలాన్ని మనం తప్పక గమనించాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంతటి ఆరోపణలు చేస్తున్న చంద్ర బాబు కుడా రేపు అధికారం లోకి వస్తే రాజ శేఖర రెడ్డి పై చర్యలు తీసుకుంటానని స్పష్టమైన హామీ యివ్వటం లేదు.

ఇక చిరంజీవి అంటారా, ఎంత సేపూ ఇతరుల అవినీతి గురించి మాట్లాడుతాడే కాని తాను నీతివంతంగా ఎలా పరిపాలించ గలడో వివరించ బోవడం లేదు. తాను ఎలక్షన్లో డబ్బు, మద్యం వాడను అని ఇంతవరకు స్పష్టమైన హామీ యివ్వ లేదు. పైగా అవినీతి రికార్డు ఉన్న ఇతర పార్టీల నాయకులను తన పార్టీలో చేర్చు కుంటున్నాడు. కుటుంబ రాజకీయాలకు పురిటి లోనే పెద్ద పీట వేశాడు. ఇతడు అధికారం లోకి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా వుంటుందో ఇప్పుడే కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.

వీరందరూ ప్రజలను తామే మభ్య పెట్ట గలమని అనుకుంటున్నారు. సామాన్య జనం అమాయకత్వం పై వీరికి అపారమైన నమ్మకం, తాము ఏది చెప్పినా నమ్మేస్తారని. అయితే దురదృష్ట వశాత్తు అది అసత్యం కాదు. ఇప్పుడు ఆలోచించ గలిగే ప్రతి ఒక్కరి కర్తవ్యం... రాజకీయ నిరాశ వాదం, అచైతన్యం నుంచి బయట పడి కనీసం తమ చుట్టూ ఉన్న జనాన్ని చైతన్య వంతం చేయడం.

Comments

  1. Completely agreed.
    Even God cannot help with Indian corrupted politics.

    The corruption system is sooo deeply established, its next to impossible.

    ReplyDelete
  2. Nijame. Andaroo em chesinaa vaalla adhikaram kosame adhikaram loki raavatam kosamo pani chesevare. Nijamgaa prajala kosamo desam kosamo pani chese vaallu chaala takkuvayyaaru. Mana desamlo raajakeeyaalu oka laabhasati vyaapram ga maaripoyayi. oka sari oka padavi vasthe inka akkadi nunchi chanipoyevarakoo aa padavo antha kante pedda padavo untene nidra paduthundi mana vaallaki. Asalu mana desam lo kooda o 2 saarlu maatrame M.L.A. gaano M.P. gaano unde chance maatrame unte machidemo. Kanee alaa kaavalanna malle mana raajakeeya naayakule chettam cheyali. Naa athyaasa kaakapotheno...!! veellaki veellu alaanti nashtam kaliginche charyalenduku teesukuntaaru lendi.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ