ఆంధ్రామృతం బ్లాగులో పెద్దలు చింతా రామకృష్ణారావు గారు ఇచ్చిన సమస్య "క్షామము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్" కి నేను చేసిన పూరణం.
ఉ. | 'సీమ'ను క్షామ మెక్కువని చెప్పుచు కొందరు; కాదు కాదు మా సీమన క్షామ మెక్కువని చెప్పెద రింకొక ప్రాంత నాయకుల్; క్షామము తాండవించుటకు కారణ మౌదురు, ఓటు కింత శి క్షా? మము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్. |
హరి గారూ,
ReplyDeleteఓటు కింత శిక్షా? మము బ్రోచు ....
పూరణ చాలా బాగుంది. పద్యం సలక్షణంగా, ధారాశుద్ధితో నడిచింది.
కంది శంకరయ్య గారు,
ReplyDeleteధన్యవాదాలు